కాంగ్రెస్
పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదు అని నిన్న పీసీ చాకో ప్రకటించారు. దీనిపై
చరిత్ర తెలుసుకో అని లగడపాటి రాజగోపాల్ ఒంటికాలిమీద లేచి కాంగ్రెస్
పార్టీ జాతీయ అధికార ప్రతినిధి చాకో కు లేఖ రాయడం హాస్యాస్పదం. రాజగోపాల్
మీలాగా పార్టీ వేదికల మీద పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళ సొంత అభిప్రాయం
చెప్పరు. అయినా నిన్ననే ఈ నేల ఎన్నటికి విడిపోదు, ఉండలేని వాళ్ళు
దిక్కున్న చోటికి పొండి అహంకారంగా మాట్లాడిన నువ్వు చాకో మాటలకే ఎందుకు
ఉలిక్కి పడుతున్నావ్? రాజగోపాల్ రంకెలు వేసినంత మాత్రాన రాష్ట్ర విభజన
ఆగదు. కాంగ్రెస్ ఎన్నడు తెలంగాణ ఇస్తామని చెప్పలేదని నీతో మొదలు మీ
సీమాంధ్ర నేతలు చెబుతున్న అసత్యాలకు సమాధానం మీ యూపీఏ ప్రభుత్వంలో కీలక
భాగస్వామి ఎన్సీపీ అధినేత తెలంగాణ పై చేసిన ప్రకటన చదవండి. తెలంగాణ పై
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రధాని కోరానని మీడియా ముందు వెల్లడించాడు.
పార్టీ అభిప్రాయం చెప్పిన చాకో మీద చిందులు వేయడం కాదు రాజగోపాల్ చేతనైతే
మీ అధినేత్రి తో చెప్పించండి తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం అని. అంతే గాని
తెలంగాణకు సానుకూలంగా స్పందించిన అందరికి లేఖలు రాసుకుంటూ పొతే ..నువ్వు
అలిసిపోవడమే తప్ప ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోలేవు.
No comments:
Post a Comment