దిగ్విజయ్ సింగ్ తెలంగాణపై అన్ని పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపామన్నారు. ఇక సంప్రదింపులు ఉండవు అన్నారు. ఇక నిర్ణయమే మిగిలింది అన్నారు. అది తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఆ నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఒక విధానం ఉండాలి. అలాగే తెలంగాణపై ఇప్పటి వరకు ఏ అభిప్రాయం చెప్పని పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని కమిటీలు వేసింది. చర్చలు, సంప్రదింపుల పేరుతో ఏకాభిప్రాయం సాధిస్తామన్నది. తెలంగాణపై దేశవ్యాప్తంగా మెజారిటీ ఎప్పుడో వచ్చింది. కానీ హామీ ఇచ్చిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం దీనిపై ఎలాంటి నిర్దిష్ట అభిప్రాయం లేకపోవడమే ఇప్పటి విషాదం. తెలంగాణ అంశం తేలాలంటే కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాలి. అది జరగనంత కాలం కమిటీలు, చర్చలు, సంప్రందిపులు, కోర్ కమిటీ సమావేశాలు, సీడబ్లూసీలో చర్చించడాలు, రోడ్ మ్యాప్‌లు మాత్రమే కనిపిస్తాయి. ఆ సమా‘వేషాలు’ సమస్య సాగదీతకే తప్ప, పరిష్కారం కోసం కాదు.
Saturday, 13 July 2013
సమా‘వేషాలు’

Subscribe to:
Post Comments (Atom)
Featured post
ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!
లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment