తెలంగాణ ప్రజల ఆకాంక్ష హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ మాత్రమే!
ఇప్పుడు మీడియాలో వస్తున్నలీకులు అంటు మొక్క రాయల తెలంగాణ ఎవరికీ
ఆమోదయోగ్యం కాదు. దీన్ని తెలంగాణ ప్రజలే కాదు, రాయలసీమ ప్రజలు కూడా
అంగీకరించరు. ఇప్పటివరకు రాష్ట్రంలో సమైక్య, తెలంగాణ వాదనలే ఉన్నాయి. ఆ
మధ్య రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఈ రెండు అంశాల
పైనే కిరణ్, బొత్స, రాజనర్సింహను రోడ్ మ్యాప్ అడిగారు. తెలంగాణను
అడ్డుకోవడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కంటే ప్రసార మాధ్యమాలే
ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. బులిటెన్ ఒక వాదాన్ని తెరమీదికి
తెస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణకే మొగ్గు
చూపిస్తున్నట్లయితే దీన్ని ఇరు ప్రాంతాల ప్రజలు ఒప్పుకోరు కాబట్టి దీని
సాకుతో ఇప్పటి వరకు ఆ పార్టీ చెబుతున్న నిర్ణయాన్ని చెప్పకుండా విభజన
అంశాన్నికొన్ని రోజులు (కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కొన్ని ఏళ్ళు) కోర్
కమిటీలో చర్చిస్తూ సాగదీస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
No comments:
Post a Comment