Friday, 2 February 2024
సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని .మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.ఆటోలకు గిరాకీ లేక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా? అని ప్రశ్నించారు. ప్రజాభవన్ ముందే ఆటో తగలబెట్టినా కనికరించరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. బాధిత డ్రైవర్ల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది ఆటోడ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకోవావాలని వారి పక్షాన కోరుతున్నట్టు, ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటోడ్రైవర్‌కు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజాభవన్ అని పేరు మారిస్తేనే సరిపోదన్న కేటీఆర్ అది ఆచరణలో చూపెడితేనే ప్రజలు హర్షిస్తారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment