సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని, ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ను టీజీగా మార్చాలని, అలాగే.. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా మేము ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామన్నారు. దీనిపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అక్కరలేదని మంత్రులు తెలిపారు. అలాగే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఖాళీలపై ఇంకా కసరత్తు జరుగుతున్నదని కచ్చితంగా మేము నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
రాష్ట్రంలో కుల గణన జరపాలని, కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని, హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించారు. 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్ చేయాలని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయించారు.
No comments:
Post a Comment