Sunday, 23 February 2025

కాంగ్రెస్‌ నేతల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం

 దేవరకొండకు కృష్ణా జలాలు వస్తాయని మా మిత్రుడు బెక్కం వేణు చిన్నప్పటి నుంచి ఎదురుచూస్తున్నాడు. దీంతో మా భూములకు డిమాండ్‌ పెరుగుతుందని, మంచి పంటలు పండితే మా తలరాతలు మారుతాయని ఆశించాడు. కానీ దశాబ్దాలుగా ఆ నియోజకవర్గానికి నీళ్లు అందించే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు వస్తే నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారయ్యాయి. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన తీరే పెద్ద కుట్ర అని కేసీఆరే కాదు తెలంగాణ ఇంజినీర్లు అనేకమంది అభిప్రాయం. కానీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ పదేళ్లు పండబెట్టిన ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామని బీరాలు పలికారు. కానీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కుప్పకూలింది. అందులో గల్లంతైన 8 మంది ఆచూకీ 48 గంటలైనా జాడలేదు. వాళ్లు సురక్షితంగా బైటికి రావాలని కోరుకుంటున్నారు. కానీ సాంకేతికంగా అనేక సమస్యలతో ముడిపడిన ఈ ప్రాజెక్టుపై కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడితే ఎద్దేవా చేసిన కోమటిరెడ్డి లాంటి వాళ్లకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం  పైకొప్పు కుప్పకూలిన తర్వాత కూడా అర్థం కాలేదు. తెలంగాణ ప్రాజెక్టులపై అవగాహన లేకపోయినా ఫరవాలేదు. కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడే
కాంగ్రెస్‌ నేతల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.

యాదగిరి గుట్టలో బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం


 https://www.youtube.com/watch?v=SdG1oZG-KgY

 


Thursday, 20 February 2025

మారాల్సింది రేవంత్‌ రెడ్డి రాజకీయ ఉపన్యాసాలే

 


రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తెరలేపిందే సీఎం రేవంత్‌ రెడ్డి. ఒక రకంగా బూతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆయన మారిపోయారు.  ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. తన అనుయాయుల చప్పట్లను చూసి మరింత రెచ్చపోయి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయాక ఇక నుంచి నా నుంచి అలాంటి మాటలు ఆశించవద్దని.. తాను మారిన మనిషిని అన్నట్లు డైలాగులు కొట్టారు. కానీ మాట మీద నిలబడితే ఆయన ఎనుముల రేవంత్‌ రెడ్డి ఎందుకు అవుతారు అనేలా ఆయన వ్యవహారశైలి ఉన్నది.

నిన్న మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ 'విజయ తెలంగాణ' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. ప్రత్యర్థులను ఎంత అవమానకరంగా, కించపరిచేలా తిట్లు తిట్టామనే రీతిలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పోటీ జరుగుతున్నదన్నారు. రాజకీయ నాయకుల ఉపన్యాసాలు వస్తే పిల్లలు టీవీలు బందుపెట్టే దుస్థితి దాపురించింది అన్నారు. ఈ ధోరణికి ముగింప పాలకాలని ఓ సూచన కూడా చేశారు. సీఎం చెప్పినవన్నీ ఆయనకే వర్తిస్తాయి. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులను సీఎం ఏ విధంగా దూషించారో అందరికీ తెలిసిందే. అందుకే కేసీఆర్‌ ఓ మీడియా ఛానల్‌ మాట్లాడుతూ బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు పరిపాలన అన్నారు. ఆయన అప్పుడు ఎందుకు అన్నారో ఈ పధ్నాలుగు నెలల రేవంత్‌ పాలన, ఆయన వ్యాఖ్యలు చూసిన ప్రజలకు అర్థమైంది. అంతెందుకు ఈ కార్యక్రమానికి ముందు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా శివచరణ్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సీఎం మాట్లాడిన మాటలు చూస్తే రేవంత్‌ పొద్దునో మాట, మధ్యాహ్నాం ఓ మాట, సాయంత్రం మరో మాట్లాడుతారని ఇట్టే అర్థమౌతుంది. 

అందుకే బూతుల సంస్కృతికి ముగింపు పలకాలన్న ముఖ్యమంత్రే అసభ్యకర వ్యాఖ్యలు మంచిది కావంటున్న మీ పరిస్థితి ఏంటని మీరు నన్ను అడుగవచ్చు. ఆటనే ఆలా ఉంటుంది. ఆడకుంటే ఔటయ్యే పరిస్థితి . ఈ పోటీలో నేను గెలవాలనుకుంటున్నాను కాబట్టి తప్పడం లేదని లేదన్నారు. దీన్నిబట్టి సీఎం మానసిక పరిస్థితి ఎలా ఉన్నదో చూడవచ్చు. వ్యక్తిగత దూషణలు, రాజకీయాల్లోకి కుటుంబాలను తీసుకురావడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతను నోటికొచ్చినట్లు తిడుతూ కాలం వెళ్లదీస్తూ.. ఆరు గ్యారెంటీలను అటకెక్కించి డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా రోజుకో వివాదాన్ని తెరమీదికి తెచ్చిందే రేవంత్‌రెడ్డి. తెలంగాణ సమాజం తలదించుకునేలా బూతుల సంస్కృతిని మొదలుపెట్టిన ఆయనను చూసే ప్రజలు కూడా అదేస్థాయిలో తిడుతున్నారు. వారిని చూసిన తర్వాత అయినా ముఖ్యమంత్రి మారితే ఆయనకే మంచిది.

కాంగ్రెస్‌ బీసీ సీఎం.. పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యల వెనుక?


బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీ సీఎం అవుతారు. అది కాంగ్రెస్‌ పార్టీలోనే అవుతారు.  వచ్చే ఎన్నికలన్నీ బీసీల చుట్టే తిరుగుతాయి. ఈ ఐదేళ్లు  రేవంత్‌ రెడ్డే సీఎంగా కొనసాగుతారు. రానున్న రోజుల్లో మాత్రం బీసీలకే ఈ అవకాశం ఉంటుంది.- గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు

ఆ మధ్య పదేళ్లు నేనే సీఎం అని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే మాటను ఆయన పదే పదే ఉటంకించారు. గతంలో ఒకే పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారని 1994-2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీల గురించి 2014-2023 వరకు బీఆర్‌ఎస్‌ పాలనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే  మాకు కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారని, కాబట్టి వచ్చే ఐదేళ్లూ సీఎం సీటు నాదేనని స్పష్టంగానే చెప్పారు. కానీ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో జరిగిన పరిణామాలతో సీఎం స్వరం మారింది. మంత్రులు, అధికారులు తనకు సహకరించడం లేదని, కొంతమంది మంత్రులు తన సీటుపై కన్నేశారని వార్తలు వచ్చాయి. సీఎం పోస్టుపై పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలను అంచనా వేశారు. కానీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలువడం, సీఎం సీటు బీసీలు రాహుల్‌ గాంధీ ఇస్తారని మహేశ్‌కుమార్‌ చెప్పినట్లు జరిగే అవకాశాలు 10 శాతం కూడా లేవు. 

కొన్నిరోజులుగా కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల్లో సడలుతున్న నమ్మకం వంటివి బేరీజు వేసుకుని ఏదో జరుగుతున్నదన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్‌ బీసీలదే సీఎం సీటు అని వ్యాఖ్యానించడం కొంత ఆలోచనలో పడేసింది. ఎందుకంటే రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్‌ మున్షీ తప్పించి రాహుల్ గాంధీ విధేయురాలైన మీనాక్షి నటరాజన్ నియమించారు. అది కూడా రాహుల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ తర్వాత జరిగిన పరిణామాం ఇది. మీనాక్షి నియామకం తర్వాతే రాష్ట్ర వ్యవహారాలన్నీ పార్టీ హైకమాండ్‌ తమ చేతుల్లోకి తీసుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా బీసీలకు రాహుల్‌ రాజ్యాధికారం ఇవ్వాలని నిర్ణయించారని పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలు వీటికి కొనసాగింపుగానే భావించాలి.

Wednesday, 5 February 2025

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల


తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 

జనవరి 2 నుంచి 20 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఇటీవల సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.

జనవరి 27వరకు అభ్యంతరాలు స్వీకరించి తాజాగా తుది కీ, ఫలితాలను ప్రకటించారు.

టెట్‌ పరీక్షలకు 1,35,802 మంది హాజరు కాగా.. వీరిలో 42,384 (31.21 శాతం) మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడి.


Tuesday, 4 February 2025

ప్రజాపాలన వద్దు, ఫామ్‌హౌస్‌ పాలనే కావాలె

పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్కతోక తగిలి కూలిపోయిందట.. అట్లనే ఉన్నది రేవంత్‌రెడ్డి పాలన. గత ప్రభుత్వంపై పదేళ్లలో రానంత వ్యతిరేకత ఏడాది ప్రజాపాలనపైనే వచ్చింది. ఎన్నికలకు ముందు మార్పు కోరుకున్న జనాలే మాకొద్దు ఈ బుల్డోజర్‌ పాలన అంటూ రోడ్లెక్కారు. ప్రజాస్వామ్యం, హక్కుల అంటూ ప్రసంగాలు దంచిన రేవంత్‌ రెడ్డే ఇప్పుడు నిరసనలు, ఆందోళనలు సమావేశాలుపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు.. హామీలు అడిగితే అరెస్టులు. 



బీఆర్‌ఎస్‌ ఉండదు, కేసీఆర్‌ను ఆనవాళ్లు కనిపించకుండా చేస్తానని గప్పాలు కొట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ సొంత హ్యాండిల్‌లో పెట్టిన సర్వేలో దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. తామేదో ప్రజాపాలన సాగిస్తున్నట్లు.. కేసీఆర్‌ పాలన ఫామ్‌ హౌస్‌ పాలన అన్నట్టు ప్రచారం ఆ పోల్‌ పెట్టారు. దీంతో 70 శాతానికి పైగా జనాలు మాకు ప్రజలు లేని ప్రజాపాలన వద్దు, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే కేసీఆర్‌ పాలనే కావాలని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆగమైన హస్తం పార్టీ నేతలు హడావుడిగా ప్రెస్‌మీట్లు పెట్టి తూచ్‌ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవానికి ఆ పోల్‌ పెట్టామని, బీఆర్‌ఎస్‌, బీజేపీ వాళ్లు కలిసి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని నాలుక మడతేశారు. ఇంకా నాలుగేళ్లు ఉండగా.. ఇప్పుడే ప్రజాభిప్రాయం ఎందుకు అంటే సమాధానం ఉండదు.ట్విట్టర్ పోల్ ప్రామాణికం కాదు అన్నప్పుడు పార్టీ ఆఫీషల్ అకౌంట్లో  పోల్ ఎందుకు పెట్టారంటే సప్పుడు లేదు. 

రేవంత్‌ సర్కార్‌ ముందున్న సవాళ్లు


కాంగ్రెస్‌ పార్టీ మహా సముద్రం. ఆ పార్టీలోకి నాయకులు వస్తుంటారు. పోతుంటారు. అంతకంటే మఖ్యమైనది ఆపార్టీలో అంతర్గ ప్రజాస్వామ్యం పేరుతో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు అనేది. అందుకే కాంగ్రెస్‌ ఏడాది పాలనపై ప్రజలు, ప్రతిపక్షాల కంటే కొన్నిరోజులుగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నేతలే బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు పది మంది ప్రత్యేక సమావేశం కావడం రాజకీయవర్గాల్లో కలకలకం సృష్టిస్తుండగా.. దేశానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే కులగణన తెలంగాణ మోడల్‌ కాబోతున్నదని గప్పాలు కొట్టారు. దీనిపై బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమౌతున్నది. మొన్నటిదాకా కేసీఆర్‌ పాలన సరిగా లేదు, ఆయన పాలనా విధానాలు సరైనవి కావన్న వాళ్లే ఆయనే కరెక్టు. ఆయన చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతోనే కాంగ్రెస్‌ చేసిన బోగస్‌ సర్వే తేటతెల్లమైందంటున్నారు. అసెంబ్లీలోనూ విపక్షాలు కులగణనపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కడిగిపారేశాయి. చివరికి ముఖ్యమంత్రి సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదని,వారికి మైక్‌ ఇవ్వొద్దని స్పీకర్‌ను కోరడం కొసమెరుపు. 




ప్రజాపాలనా మజాకా!

 సర్వేలో పాల్గొనకపోతే మాట్లాడొద్దు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ప్రశ్నించొద్దు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదంటే నో ఆన్సర్‌. ముందు రోజు మంత్రి చెప్పిన మాటలనే అసెంబ్లీలో చదివి వినిపించిన ముఖ్యమంత్రి.. దీనికే చప్పట్లు కొట్టాలని కోరడం.. ప్రజాపాలనా మజాకా!


ఢిల్లీలో ఏపీ, తెలంగాణ సీఎంల ప్రచార ప్రభావం ఎంత?

 


https://www.youtube.com/watch?v=qKqZ8ygC15Q

 

తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా?




https://www.youtube.com/watch?v=veAC28M4eIQ

 


Featured post

ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?

 తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...