Friday 11 November 2011

వార్తల్లో వాస్తవమెంత తెలంగాణకు ప్యాకేజిలని, రెండో ఎస్సార్సీ అని వార్త వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతో ఎవరికీ తెలియదు. కాని సీమాంద్ర మీడియా మాత్రం దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న రాష్ట్రాలపై రెండో ఎస్సార్సీ వేయడం సాధ్యం కాకపోవచ్చు. ప్రాంతీయ పార్టీల పై మనుగడ సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అవి ఒప్పుకోవు కూడా. కేవలం ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాంగ్రెస్స్ ఈ ఎత్తుగడ వేసింది. ఆ ఎన్నికల్లో లబ్ధి కోసమే మేము చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తోంది. పైగా రషీద్ ఆల్వి వంటి వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాని తెలంగాణ ప్రత్యేకమైన అంశమని ఇప్పటికే ప్రణబ్ వంటి నేతలు స్పష్టం చేశారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల పై ఇప్పటికే ఒక కమిటీ వేసింది కేంద్రం. ఆ కమిటీ తన నివేదిక ఇచ్చి కూడా చాల కాలం అయ్యింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఆ కమిటీ ఒక చెత్త రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రజాస్వామిక వాదులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. తాజాగా తెలంగాణ లో జరిగిన, జరుగుతున్న పరిణామాలతో ఇక ఈ అంశాన్ని తేల్చాల్సిందే అని ఒక నిర్ణయనికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ . అందులో భాగంగానే ఆజాద్ తో రెండు ప్రాంతాల నేతలతో సంప్రదింపులు చేసింది. ఆయన కూడా తన రిపోర్ట్ ఇచ్చి ఉన్నాడు. శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్, ఆజాద్ రిపోర్ట్ రెండు దగ్గర పెట్టుకొని తెలంగాణ పై ఏ నిర్ణయం చెప్పకుండా సాగదీస్తున్నది కాంగ్రెస్ పార్టీ . యిప్పుడు రాష్ట్రం లోని రెండు ప్రాంతాల ప్రజలు ఈ అనిచ్చితికి తెర దించాలని కోరుకుంటున్నారు. కాని కొందరు పెట్టుబడి దారులు, వారికి వంత పాడుతున్నమీడియా మాత్రం రెండో ఎస్సార్సీ అని ఇరు ప్రాంతాల ప్రజలను గందరగోళం లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా తెలంగాణపై కాంగ్రెస్ ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అడ్డదిడ్డంగా వాదిస్తున్న సీమాంద్ర కాంగ్రెస్ నేతలు మాత్రం ఎస్సార్సీకి అందరూ సహకరించాలి అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సీమాంద్ర పెట్టుబడిదారుల అవకాశవాద రాజకీయాలు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home