Monday, 14 November 2011
ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం
తెలంగాణ పై ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజల ఆకాంక్ష కంటే తమకు పెట్టుబడిదారులే ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పారు. ఒక ప్రాంతీయ సమస్యను పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కావాలట. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. దీనికి ప్రాథమిక చర్చలు అని, మాధ్యమిక చర్చలు, ఫైనల్ చర్చలు పూటకో మాటలు కాంగ్రెస్ పార్టీ లోనే వారే మాట్లాడుతున్నారు. చేతగాని ప్రబుత్వంలో చేతగాని నేతలున్నారు యిప్పుడు. నిజానికి ఈ ఏకాభిప్రాయం అనే మాట కాంగ్రెస్ పార్టీ ఏడేళ్ళుగా చెబుతున్నదే. కాని ఇంత వరకు జాతీయ స్థాయిలో ఏమో గానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్యే ఏకాభిప్రాయాన్ని సాధించలేదు. సమస్యను పరిష్కరించాలనే చితశుద్ది ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాని ప్రజల ఆకాంక్షను రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. దీనికి ఇక్కడి వెన్నుముక లేని కాంగ్రెస్ నేతలు కూడా తోడయ్యారు. వీరి వల్లే తెలంగాణ పై కాంగ్రెస్ అధిష్టానం ఈ దాగుడుమూతలు ఆడుతున్నది. పైగా ఇతర ప్రాంతాలలో అశాంతి రగులుతుండగా తెలంగాణ ఇవ్వడం సరికాదని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఈ దేశ దౌర్భాగ్యం. అంటే నలుగురు పెట్టుబడి దారులు కోసం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు అశాంతికి గురైన పరవాలేదు అన్నట్టు ఉంది. యిప్పుడు కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది. చంద్రబాబు కూడా తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పాము. ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే బాబు ఊసరవెల్లి రంగు బయటపడింది. ఇక మిగిలింది తెలంగాణ ప్రజలకు ఈ రెండు పార్టీలను బొంద పెట్టడమే.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment