రిటైల్ మార్కెట్లోకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్ డిఐ) ఆహ్వానిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆమ్ ఆద్మీ అభివృద్దే తమ కర్తవ్యం అని అధికారంలోకి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యిప్పుడు చిరు వ్యాపారుల పోట్టగొట్టే నిర్ణయాలను తెసుకుంటున్నది. సామాన్యుల బతుకులను గాలికి వదిలేసి కార్పోరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నది. ఒకవైపు ఆహార భద్రత చట్టాన్ని ముందుకు తెస్తూనే మరోవైపు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకులు వెళ్ళదీస్తున్న వారికి ఎఫ్ డిఐ లతో భద్రత లేకుండా చేసే చర్యలకు తెర తీస్తున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల సామాన్యుడు ఏమీ కొనలేని పరిస్థితి నెలకొన్నది. పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించే చర్యలు చేపట్టకపోగా, ప్రతి రెండు నెలల కొకసారి పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారు. దేశంలో లక్షలాది మంది యువత నిరుద్యోగంతో అల్లాడుతున్నది. ప్రభుత్వం వారికి ఉపాధి చూపించక పోగా ఉన్న ఉపాధిని పోగొట్టే విధానాలకు పచ్చ జెండా ఊపడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని రాహుల్ ఉత్తరపదేశ్ ఎన్నికల్లో ఓట్ల కోసం రోడ్డుపక్కన ఉన్న టి కోట్లల్లో చాయి తాగుతూ గొప్పగా నటిస్తున్నారు. ఇక ప్రజా సమస్యల కంటే ప్రపంచ బ్యాంకు విధానాలే ముద్దు అన్నట్టు మన్మోహన్ సర్కారు వ్యవహరిస్తున్నది. యుపి ఏ రెండో సారి అధికారంలోకి వచ్చాక అనేక అవినీతి కుంభ కోణాలు బయటపడ్డాయి, పడుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయి, రిటైల్ మార్కెట్ లోకి ఎఫ్ డిఐ లను ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం అవుతున్నది. ఆమ్ ఆద్మీ అంటే ఇదేనా అని ప్రజలు నిలదీస్తున్నారు. సామాన్యుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదు.
Saturday, 26 November 2011
ఆమ్ ఆద్మీ అంటే ఇదేనా ?

Subscribe to:
Post Comments (Atom)
Featured post
ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?
తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్‌ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment