Friday 18 November 2011

ఎన్ని వేదికలు, ఎన్ని మాటలు



కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారు. ఒక్కో వేదిక పై ఒక్కో మాట మాట్లాడుతున్నారు.  మొన్న చిన్న రాష్ట్రాల విషయంలో రెండో ఎస్సార్సీ యే కాంగ్రెస్ విధానమన్నారు. ఇప్పుడేమో ఉత్తరపదేశ్ రాష్ట్ర విభజన విషయంలో మాత్రమే రెండో ఎస్సార్సీ మా విధానమని, తెలంగాణ ప్రత్యేక అంశం అని తాజా వ్యాఖ్యలు. మరి రాష్ట్రం లోని ఈ అనిత్చితిని తొలగించాలని ఇరు ప్రాంతాల ప్రజలు ముక్తకంటంతో కోరుతున్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ పై చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే ఉద్యమకారులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది రాస్ర ప్రభుత్వం. దీనికి తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దమన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పరోక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. వీళ్ళ మన నేతలు అని తెలంగాణ ప్రజానీకం అసహించుకుంటున్నది. చంద్రబాబు గొడుగు కింద తెలంగాణ టిడిపి నేతలు ఎన్ని ఉద్యమాలు చేసినా, కాంగ్రెస్ అధిష్టానం పై నమ్మకముందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. రాజ్యాంగ సంక్షోభం సృస్తిస్తామన్న ఈ ఇరు పార్టీల ప్రజాప్రతినిధులు ఇప్పడు వారి వారి అధినాయకత్వాలతో రాజీ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇరు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆడుతున్న ఈ నాటకానికి ముగింపు పలకక పోతే ప్రజలు వీరికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం. అలాగే తెలంగాణ పొలిటికల్ జెఎసిలో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీలు కూడా తమ ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరముంది. ఉద్యమకారులు ఎదురుకొంటున్న నిర్బంధకాండ పై ప్రత్యక్ష కార్యాచరణను రూపొందించాల్సిన అవసరమున్నది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home