అందరూ అనుకున్నదే జరిగింది. తెలంగాణ కోసం టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీ'నామాల'ను స్పీకర్ తిరస్కరించారు. తెలంగాణ పై తమకున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదన్న ఈ నేతలు ఈ ఉత్తుత్తి రాజీనామాలు ఇంకా ఎన్నిసార్లు చేస్తారో? తెలంగాణ టిడిపి నాయకులైతే మొదటిసారి రాజీనామాలు చేసిన తరువాత, ఏదో సాధించామని బస్సు యాత్రలు చేశారు, తెలంగాణ ప్రజలపై 'రణ'భేరీలు మోగించారు. రెండో సారి కూడా జిల్లా పర్యటనలు చేశారు. చంద్ర బాబు రెండుకళ్ళ సిద్ధాంతంతో నియోజకవర్గాల్లో తిరగలేని వీళ్ళు ఈ రాజీనామాలను అడ్డుపెట్టుకొని ఒక సారి చుట్టివచ్చారు. అయినా అక్కడక్కడ వారికి ప్రతిఘటన ఎదురైంది. రెండో సారి పర్యటనలో తెలంగాణ అంశం కంటే టి ఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు గోడుగుకింద పనిచేసే వీరు ఇంతకంటే ఏమి చేస్తారు. యిప్పుడు మళ్లీ ఏదైనా చేయాలంటే చంద్రబాబు పర్మిషన్ కావాలి. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణ కోసం కాకుండా, అయన కోసం, తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే మరో కొత్త ఎత్తుగడ వేయాలి. దీనికి తెలంగాణ ముసుగును తగిలించాలి. ఇదీ తెలంగాణ టిడిపి నేతల వ్యవహారశైలి. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలది మరో దారి. యిప్పుడు వారుచేస్తున్న కృషి తమ రాజకీయ భవిషత్తు 'కిరణాల' కోసమే. కొందరు మంత్రి పదవులకోసమైతే, మరికొందరు తమ సొంత పనులకోసం తహతహలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ స్టీరింగ్ కమిటీ కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడడానికి, తమ అధినేత్రి సోనియా దగ్గర మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నది. కొందరు నేత లైతే ఆవేశంలో పార్టీ వదిలి పోయిన వారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని చిలక పలుకులు పలుకుతున్నారు. వీరి పదవి లాలస వల్లే కేంద్రం తెలంగాణ అంశాన్ని నాన్చుతున్నది. తెలంగాణ కోసం పార్లమెంటులో గొడవ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపి లను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నది. రాజీనామాలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులు కాపాడుకోవడానికే ప్రయత్నించారు. ప్రధాని తెలంగాణ పై తొందరపడం అని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా వీరిలో స్పందన లేదు. శ్రీ కృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన పొలిటికల్ మేనేజ్ మెంట్ లో వీరు భాగస్వాములయ్యారు. ఇలా ఒకరు చంద్రబాబు కనుసన్నల్లో, మరొకరు అధిష్టానం పై నమ్మకం తో పనిస్తున్నారు. ఇదే వారి దృష్టి లో తెలంగాణ పై చిత్తశుద్ది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment