Sunday, 31 August 2025
Friday, 29 August 2025
Sunday, 24 August 2025
Friday, 22 August 2025
Thursday, 21 August 2025
Tuesday, 19 August 2025
Saturday, 16 August 2025
Friday, 15 August 2025
Wednesday, 13 August 2025
రేవంత్ రాజకీయాలకు కోదండరామ్ బద్నాం
'కొంతమంది తమకు తాము ఎక్కువగా ఊహించుకుంటారు' అనిప్రొఫెసర్ కోదండరామ్‌ను ఉద్దేశించి కేసీఆర్ అప్పట్లో ఓ కామెంట్ చేశారు. దీనిపై చాలామంది కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. అయితే పార్టీ పెట్టిన తర్వాత ప్రొఫెసర్ పతారా ఏమిటో తేలిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ అలా ఎందుకు అన్నారో చాలామందికి అర్థమైంది. కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ జీవనాడి కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేసి, నియామకాలపై నిరుద్యోగులను పక్కదోవ పట్టించి కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎలా ఉంటాయో పొలిటికల్స్‌సైన్స్ ప్రొఫెసర్‌కు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అర్థం అయి ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ప్రతిపాదిస్తూ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని అప్పటి కాషాయ పార్టీ గవర్నర్ కాలరాశారు. రాజకీయ కొర్రీలు పెట్టి వారు ఎమ్మెల్సీలు కాకుండా అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించింది.
వీళ్ల నియామకంపై కేసు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగానే రేవంత్ ప్రభుత్వం హడావుడిగా ప్రమాణ స్వీకారం చేయించింది. ఆ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తాను అన్నారు. ఆయన ఎమ్మెల్సీ కాగానే కోదండరామ్ కాబోయే విద్యాశాఖ మంత్రి అని ప్రచారం కూడా చేయించుకున్నారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న కీలక అంశం 'తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు' అని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాంగ్రెస్, కాషాయ పార్టీల రాజకీయానికి ప్రొఫెసర్ కోదండరామ్ బద్నాం అవడంమే కాదు, ఇప్పుడు రాజకీయంగా కూడా అన్నిరకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాసే విధంగా రేవంత్ రెడ్డి మొదటి రోజు నుంచి కుట్ర చేస్తున్నా ముద్దసాని కోదండరామ్ మౌనం వీడలేదు. ఇక్కడ విషయం ప్రొఫెసర్ తెలుసుకోవాలి. కోదండరామ్‌ను జేఏసీ ఛైర్మన్ చేసి కేసీఆర్ ఆకాశమంత ఎత్తులో నిలబడితే.. రేవంత్ రెడ్డి ఆయన రాజకీయ జీవితాన్ని అధఃపాతాళంలోని నెట్టేశారు. అందుకే అనేక కుట్రలను దాటుకుని ఉద్యమకారుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ కాగానే పార్టీలకు అతీతంగా అందరూ హర్షించారు. తెలంగాణ అంతా గర్వించింది. కానీ ప్రొఫెసర్ కోదండరామ్ నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది అనగానే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. వాస్తవాలు విస్మరించి రాజకీయ విన్యాసం చేసిన ప్రొఫెసర్ ముద్దసాని కోదండరామ్‌కు ఇవి మింగుడు పడని అంశాలే. కానీ ఇది నిజం.
Tuesday, 12 August 2025
Sunday, 10 August 2025
Thursday, 7 August 2025
Tuesday, 5 August 2025
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న బంధం అగ్రరాజ్యం రాయబారి కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక...
