Raju Asari

Tuesday, 4 November 2025

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: తొలిదశ ప్రచారం ముగిసింది

బిహార్ శాసనసభ తొలిదశ ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగిసింది. 18 జిల్లాల్లోని 121 స్థానాలకు నవంబర్ 6 (గురువారం) పోలింగ్ జరగనుంది. అధికార ఎన్డీఏ, విపక్ష మహాఘట్‌బంధన్ స్టార్ క్యాంపెయినర్లు, సీనియర్ నేతలు చివరిరోజు ముమ్మర ప్రచారం నిర్వహించారు. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ సహా అగ్రనేతలు విస్తృత పర్యటనలతో ప్రచారాన్ని ఉధృతం చేశారు.




భోజ్‌పుర్, గయాలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైశాలీ, పట్నా, సహర్సా, ముంగేర్ జిల్లాల్లో పర్యటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్భంగా, ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్‌లో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్భంగా రోడ్‌షోకు భారీ జనసమూహం తరలివచ్చింది. మరోవైపు ప్రధాని మోడీ ఎన్డీఏ మహిళా కార్యకర్తలతో నమో యాప్‌లో మాట్లాడి, బిహార్ సభల్లో రికార్డుస్థాయి మహిళల హాజరును ప్రస్తావించారు.


మహాఘట్‌బంధన్ తరఫున రాహుల్ గాంధీ గయా, ఔరంగాబాద్‌లలో ప్రచారం నిర్వహించారు. సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సుల్తాన్‌పుర్, బెగుసరాయ్, ముజఫర్‌పుర్, వైశాలీలో సుడిగాలి పర్యటనలు చేశారు. గయాలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విపక్ష కూటమికి మద్దతుగా ప్రచారం చేపట్టారు.బిహార్‌లో మొత్తం 243 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 6, 11 తేదీల్లో ఓటింగ్.. 14న ఫలితాలు వెలువడతాయి.


No comments:

Post a Comment

Featured post

హైదరాబాద్‌ బాలాపూర్ పరిధిలో స్క్రాప్ షాప్‌లో అగ్నిప్రమాదం

   ఎలాంటి ప్రాణనష్టం లేదన్న పోలీసులు హైదరాబాద్ నగరంలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్ సమీపంలో ఉన్న ఒక స్క్రాప్ షాప్‌లో (తుక్కు...