Saturday, 22 November 2025

ఢిల్లీ వాయు కాలుష్యంపై నటి కృతి సనన్ ఆందోళన



ఢిల్లీ: జాతీయ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి కృతి సనన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన ఆమె, కాలుష్య పరిస్థితి మరింత దిగజారుతోందని పేర్కొన్నారు. మీడియాతో కృతి సనన్ మాట్లాడుతూ, "ఏదైనా చెప్పడం వలన ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. ఇది (కాలుష్యం) మరింత, మరింత దారుణంగా మారుతోంది. నేను ఢిల్లీ నుంచే వచ్చాను, గతంలో ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలుసు, ఇప్పుడు అది మరింతగా దిగజారుతోంది," అని అన్నారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే, భయంకరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

కాలుష్యాన్ని అరికట్టడానికి ఏదైనా చేయాల్సిన అవసరం ఉన్నదని లేకపోతే, మనం పక్కన నిలబడి ఉన్నప్పటికీ ఒకరినొకరం చూసుకోలేని పరిస్థితికి ఇది చేరుకుంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...