Tuesday, 11 November 2025

ఓటెత్తిన బిహార్‌.. రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయి పోలింగ్‌

 


బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం భారీ ఓటింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం అత్యధికంగా కిషన్‌గంజ్ జిల్లాలో 76.26 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత కటిహార్‌లో 75.23 శాతం, పూర్ణియాలో 73.79 శాతం, సుపాల్‌లో 70.69 శాతం, పూర్వీ చంపారన్‌లో 69.02 శాతం, బాంకాలో 68.91 శాతం పోలింగ్ నమోదయ్యాయి. ఈ రెండో దశలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేబినెట్‌లోని 12 మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. మొదటి దశ ఎన్నికల్లో కూడా రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 65.08 శాతం పోలింగ్ నమోదైంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

తొలి విడతలోనూ 65.9 శాతం భారీ పోలింగ్‌ రికార్డైన విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఈసారి అత్యధిక పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. 2000లో బిహార్‌ (Bihar News) అసెంబ్లీ ఎన్నికల్లో 62.57శాతం నమోదు కాగా.. ఇప్పటివరకు ఇదే గరిష్ఠం. లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. 1998లో అత్యధికంగా 64.6శాతం పోలింగ్‌ నమోదైంది.



No comments:

Post a Comment

Featured post

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు నేడే పోలింగ్

ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం దేశంలోని మూడు కీలక ప్రాంతాలైన అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు కొత్త ప్రజా ప్రతినిధులను ఎన్ను...