బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో సుమారు 68.52 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 11:00 గంటలకు 31.38 శాతంగా ఉండగా, మధ్యాహ్నం 1 గంట వరకు 47.62 శాతానికి పెరిగింది. సాయంత్రం 3 గంటల సమయానికి ఇది 60.40 శాతానికి చేరి, 5 గంటల వరకు 67.14 శాతానికి పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే, కిషన్‌గంజ్ అత్యధికంగా 51.86 శాతం పోలింగ్‌ను నమోదు చేయగా, మధుబని జిల్లాలో అత్యల్పంగా 43.39 శాతం నమోదైంది. ఈ దశలో పోలింగ్ జరిగిన 122 అసెంబ్లీ స్థానాల్లో, గరువా నియోజకవర్గంలో అత్యధికంగా 55.91 శాతం ఓటింగ్ నమోదు కాగా, నవాడా నియోజకవర్గంలో అత్యల్పంగా 38.93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ స్పందిస్తూ, "బిహార్ శాసనసభ ఎన్నికలు 2025లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది... బిహార్ ప్రజలు ప్రధాని మోడీని, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను, ఎన్డీఏ మిత్రపక్షాలన్నింటినీ విశ్వసిస్తున్నారు... మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది" అని ధీమా వ్యక్తం చేశారు.
తేజస్వి యాదవ్ తన సొంత స్థానంలో ఓడిపోతారు
బిహార్ బీజేపీ సహ-ఇన్‌ఛార్జ్ దీపక్ ప్రకాష్ బిహార్ బీజేపీ సహ-ఇన్‌ఛార్జ్ దీపక్ ప్రకాష్ మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ తన సొంత అసెంబ్లీ స్థానంలో ఓడిపోవడం ఖాయమని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని అన్నారు.
పోలింగ్ శాతం పెరిగితే మార్పు తప్పదు
ఆర్జేడీ ఎంపీ మీసా భారతి స్పందిస్తూ అధిక పోలింగ్ శాతం నమోదైతే ప్రస్తుత ప్రభుత్వం అధికారం కోల్పోతుంది అని పేర్కొన్నారు.
బిహార్‌లో మహాకూటమి విజయం సాధిస్తుంది
కాంగ్రెస్ నాయకుడు ,మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మహాకూటమి బిహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తేజస్వి యాదవ్ సీఎం అవుతారు
బిహార్ సీఎల్పీ నేత ఖాన్ బిహార్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ... బిహార్‌లో ఎన్డీఏ ఓడిపోతుంది. తేజస్వి యాదవ్ బిహార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.
No comments:
Post a Comment