Saturday, 22 November 2025

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచి 'మహాన్' తీసివేత



  •  కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచి అక్బర్, టిప్పు సుల్తాన్ పేర్ల ముందున్న 'మహాన్' (గొప్ప) అనే పదాన్ని తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ గళమెత్తారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ..వారు ఒకటి రెండు రోజులు కాదు, 700 సంవత్సరాలు దేశాన్ని పాలించారు. మీరు వారి పేర్లను తొలగించారు, కానీ ఈ తొలగింపు లేదా చేర్పు సాధించేది ఏముంటుంది?" అని ఆయన ప్రశ్నించారు. వారి పాలనలో భారతదేశ జీడీపీ 27 శాతం ఉండేది. అందుకే భారతదేశాన్ని స్వర్ణభారతంఅని పిలిచేవారు. వారు ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.

మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ.. "ఆఖరి చక్రవర్తి (బహదూర్ షా జఫర్) తల నరికివేయబడింది, కానీ ఆయన బ్రిటిష్ వారి బానిసత్వాన్ని అంగీకరించలేదు. తన కుమారుల తలలను పళ్లెంలో చూసినా, ఆయన లొంగలేదు. ఇప్పుడు వారి వారసులు కలకత్తా వీధుల్లో పాత్రలు కడుగుతున్నారు. 

 ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ వారికి సేవ చేసి, ఇప్పుడు సుఖంగా ఉన్నవారు మీ ప్రభుత్వంలో ఉన్నారు. బ్రిటిష్ వారి ముందు మోకరిల్లి, రాయ్ బహదూర్, సర్ వంటి బిరుదులు పొందినవారు మీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. ఇది దురదృష్టకరం. మీరు ఈ విషయాన్ని కూడా వివరించాలి. అలాగే చరిత్రలో రాణి లక్ష్మీబాయికి ద్రోహం చేసి, ఆమె మరణానికి కారణమైనది ఎవరు? ఆ ద్రోహి వారసుడు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఎందుకు కూర్చున్నాడు? మీరు దానికి కూడా సమాధానం చెప్పాలంటూ ఇమ్రాన్ మసూద్  డిమాండ్‌ చేశారు. 


No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...