జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడింది. త్వరలో ఈ పదిహేడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పదహారు స్థానాలు సీమాంధ్రలోనే జరుగుతాయి కాబట్టి సీమాంధ్ర ప్రజానీకానికి విజ్ఞప్తి. అదేమంటే యిప్పుడు తెలంగాణాలో జరగబోయే ఆరు స్థానాల్లో రెండు కండ్ల బాబు, కాంగ్రెస్ పార్టీ తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ పై చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణ ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు. ఈ ప్రాంతంలో ఈ ఎన్నిక జరిగినా తెలంగాణ వాదానికే జై అంటున్నారు. కాబట్టి ద్వంద్వ విధానాలు అవలంబించే పార్టీలకు ఇక్కడ స్థానం లేదు. ఇక తేల్చుకోవలసింది సీమాంధ్ర ప్రజానీకమే. యిప్పుడు ఎన్నికలు ఎందుకు వచ్చాయి, వాటి నేపథ్యం అనవసరం. కానీ ఈ రెండు కండ్ల బాబును, కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజనపై, సమైక్యం పై నిలదీయాల్సిన సమయం వచ్చింది. యిప్పుడు రెండు వాదనలకు ఆస్కారం ఇవ్వకూడదు. ఈ రెండు పార్టీలను ఏదో ఒక అభిప్రాయానికి మాత్రమే కట్టుబడి ఉండాల్సిందేనని డిమాండ్ చేయాలే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కోరుతున్న రాష్ట్ర డిమాండ్ కొత్తది కాదు. ఇదీ ఏ పార్టీనో, ఒక వ్యక్తి డిమాండ్ అసలే కాదు. ఐదున్నర దశాబ్దాల పోరాటం. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. రాష్ట్ర సాధన కోసం దాదాపు ఎనిమిది వందలమంది బలిదానాలకు పాల్పడ్డారు. తెలంగాణ ప్రజలముందు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం, రెండు తెలంగాణ వ్యతిరేకులకు బుద్ధి చెప్పడం. ఈ రెండూ రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. తమ గమ్య స్థానాన్ని ముద్దాడడానికి ఒక్కో సమస్యను అధిగమిస్తున్నారు. అది సమ్మె రూపంలో కావచ్చు, మిలియన్ మార్చ్ లే కావచ్చు, ఎన్నికలే కావచ్చు అన్ని ఉద్యమం లో భాగమే. అందుకే ఇవ్వాళ అధికార, ప్రతిపక్ష పార్టీలు నై తెలంగాణ అనలేక పోతున్నాయి. అందుకే సీమాంద్ర ప్రజలు యిప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలే. మీ అభిప్రాయం ఏదైనా కావాచ్చు. అధికార, ప్రతిపక్ష, వైఎస్ఆర్ పార్టీలను నిలదీయలే. తెలంగాణ, సమైక్య ఈ రెండింటిలో ఏదో ఒక దానికి కట్టుబడి ఉండాల్సిందేనని డిమాండ్ చేయండి. అప్పుడే ఈ రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత తొలిగిపోతుంది. సీమాంధ్ర ప్రజలారా బహు పరాక్!
Sunday, 4 March 2012
ప్రశ్నించాల్సిన సమయం !

Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment