Saturday 24 March 2012

నాయక్ బలిదానానికి బాధ్యత ఎవరిది?


రెండేళ్లలో వరుసగా మూడు సార్లు జరిగిన ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిన ఇంకా కాంగ్రెస్, టిడిపి నేతలకు బుద్ధి రాలేదు. రాదు కూడా. అందులో తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ నేతలకు అసలే లేదు. కట్టి శత్రువుదైనా పొడిచేది మనోడే. అందుకే తెలంగాణ రావాలంటే ముందు ఇంటి దొంగలను తరిమి కొట్టలే. నిత్యం తాను తెలంగాణ బిడ్డనే అని చెప్పుకునే రేణుకమ్మ తెలంగాణకు ఇన్ స్టంట్ కాఫీ కాదని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నది. గండ్ర వెంకటరమణ రెడ్డ్డి తెలంగాణ వాదం తగ్గిపోయిందని చెబుతున్నాడు.పదవుల కోసం ప్రజల ఆకాంక్షను తాకట్టు ఇలాంటి బానిస నాయకత్వం వల్లే తెలంగాణాలో బలిదానాలు జరిగాయి. జరుతున్నాయి. అలేగే మొన్నటిదాక చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడి ఉద్యమం పై ఇష్టం వచ్చినట్టు మొరిగిన మోత్కుపల్లి, పాలకుర్తికి బాబును పట్టుకొచ్చి తెలంగాణ ప్రజల రక్తాన్ని చూసిన ఎర్రబెల్లిలకు ఉప ఎన్నికల్లో ప్రజలు చెంప చెల్లు మనిపించినా సిగ్గు రాలేదు. ఉప ఎన్నికల ఫలితాల తరువాత  ఈ ఇరు పార్టీల నేతల వింత వాదనలే  భోజ్యానాయక్ ఆత్మాహుతికి దారి తీశాయి. చేతగాని ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల కళ్ళ కింద పనిచేస్తూ.. కళ్ళు తాగిన కోతులవలె వ్యవహరిస్తున్నారు వీరు. శ్రీకాంత్ చారి బలిదానంతో మొదలు భోజ్యానాయక్ వరకు ఈ రెండు పార్టీల వైఖరే ప్రధాన కారణం. గత కొంత కాలంగా బలిదానాలు వద్దు.. బతికి సాధిద్దాం అని  ప్రజాసంఘాల నేతలు, ఉద్యమ నాయకత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఆత్మహత్యలు ఆగిపోయాయి. వందలాది మంది బలిదానాలను బాటగా చేసుకుని పదవులు సంపాదిస్తున్నారు ఈ టిడిపి, కాంగ్రెస్ నేతలు. అందులో డి ఎస్ నుంచి గండ్ర, జగ్గారెడ్డి, రేవూరి, ఎర్రబెల్లి , దేవేందర్, రేణుక దాక అలా సంపాదించిన వారే! ఇవ్వాళ వీరే తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర నేతల దగ్గర తాకట్టు పెట్టి, పదవులు తెచ్చుకుంటున్నారు. ఏ వెలుగులకు ఈ ప్రస్తానమో అర్థం కావడం లేదు. ఒకవైపు ఓటమిని అంగీకరిస్తూనే మరోవైపు ఉద్యమం బలహీన పడిందని, సీనియర్ల వైఖరి పార్టీకి చేటు తెస్తున్నదని అరుస్తున్నది  అరుణ. ఈమె మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి అభివృద్ధి అని ఎంత అరిచిన ప్రజలు ఆదరించలేదు. అయినా వాస్తవాలు తెలుసుకోకుండా చిత్తూరు బాబు అడుగులకు మడుగులోత్తుతున్నారు. ఇదీ మన తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ నాయకత్వ ప్రతిభ. వీళ్ళే ఇచ్చేది, తెచ్చేది. అందుకే వీరు తెలంగాణ పై  ఎన్నిచెప్పినా ప్రజలు నమ్మడం లేదు. నమ్మరు కూడా. కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇక తెలంగాణ టిడిపి నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలంగాణ ఉద్యమంలో టి టిడిపి లేనే లేదు, ఉండదు కూడా. ప్రజలు ఉండనివ్వరు కూడా. ఈ పాములకు పాలు పోసిన విషయాన్నే చిమ్ముతున్నాయి. అందుకే తెలంగాణలో టిడిపి పని అయిపోయింది. తెలంగాణ కోసం పార్టీ పెట్టి మూడు నెలల్లోనే మూసేసిన దేవేందర్ కు రాజ్యసభ పట్టం కట్టారు అంటేనే తెలంగాణ పై బాబు వైఖరి ఏమిటో అర్థమవుతున్నది. దేవేందర్ పార్టీని వీడి బయిటికి పోయాక అయన అల్లుడు అరవింద్ తో దేవేందర్ పై చేయించిన మాటలు తెలంగాణ ప్రజానీకం మరిచిపోలేదు. అవసరానికి అరవింద్ వంటి నేతలను వాడుకొని యిప్పుడు అదే దేవేందర్ కు ప్రమోషన్ ఇచ్చి పదవి కట్టబెట్టారు. ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని టి టిడిపి నేతలు గ్రహించక పొతే...చేసేది ఏమి ఉండదు. ఎవరో ఒకరు బలిదానం చేసిన తరువాత టి వీలలో చర్చలు పెడుతున్న సీమాంధ్ర మీడియా కూడా ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదానికి ప్రజలు పట్టం కట్టినా.. దాన్ని వదిలి పెట్టి కాంగ్రెస్, టిడిపి లకు గతంలో కంటే ఓట్ల శాతం పెరిగిందని.. మహబూబ్ నగర్లో టి అరె ఎస్ ఓటమి పై రేఅజకీ నేతల వలె విశ్లేషణలు చేస్తున్నాయి. ఇవి కూడా భోజ్యా నాయక్ ఆత్మాహుతికి కారణమయ్యాయి. ఏపీ లో మీడియా ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రతిబింబాల్సింది పోయి పని గట్టుకుని విష ప్రచారం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఒక ప్రాంతం పై ఎంత వివక్ష చూపుతున్నారో అంత కంటే ఎక్కువ సీమాంధ్ర చూపుతున్నది. ఇంత చేస్తూ మళ్లీ ఈ మీడియా నే విలువల గురించి మాట్లాడడమే ఇక్కడి విషాదం. కాబట్టి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు. ఈ ప్రాంత కాంగ్రెస్  నేతల్లో తెలంగాణ తెచ్చే వాడు లేడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి తెలంగాణ ఇవ్వాలనుకున్నా కుప్పం కుట్ర దారుడు చంద్రబాబు అందుకు అంగీకరించడు. అందుకే మనకు ఉన్నది రెండే దారులు. ఒకటి బరిగీసి పోరాటంలో నిలవడం. రెండు కాంగ్రెస్, టిడిపి లను ఈ ప్రాంతంలో భూస్తాపితం చేయడం. అప్పడే ఈ ప్రాంత విముక్తి సాధ్యమవుతుంది.నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. బలిదానాలు వద్దు .. బతికి సాధించాలే ... జై తెలంగాణ ...
-రాజు ఆసరి
--
rajuasari@gmail.com


Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home