Friday 9 March 2012

అక్కడ సైకిల్ జోరు.. ఇక్కడ సైకిల్ బేజారు ..



ఎట్టకేలకు యూపీ ముఖ్యమంత్రి పీటముడి వీడింది. ఊహించినట్టుగానే ఎస్పీ యువనేత యూపీ పీటాన్ని అధిష్టించనున్నారు. దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రంగా పేరుగాంచింది. ఇప్పటివరకు అటు జాతీయ పార్టీలైన ఇటు ప్రాంతీయ పార్టీలైన యువతకు పెద్దపీట వేస్తామనడమే గానీ ఆచరణలో చూపడం లేదు. చూపవు కూడా. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు ఆలవాలమైన మన దేశంలో పార్టీ పదవులైనా ... చట్టసభల్లో అధిక ప్రాధాన్యమైన వ్యక్తి ఆరాధనతో ముడిపడి ఉన్నది. యిప్పుడు అఖిలేష్ యాదవ్ కు కూడా ముఖ్యమంత్రి పదవి వారసత్వంగానే వచ్చింది. ఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను యూపీ ప్రజలు అంగీకరించారని అఖిలేష్ మీడియా ముందు చెప్పారు. ఇచ్చిన హామీలను తప్పకుండ నేరవేరుస్తామన్నారు. ఈ దేశంలో ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలన్నీ అధికారం కోసమే అన్నది విదితమే. ఆ హామీలను తుచ తప్పకుండ ఆయా పార్టీలు అమలుచేస్తాయని ప్రజలు భావించడం లేదు. కానీ అందులో కనీసం కొన్నైనా నేరవేరుస్తారని ఆశపడుతారు. అదే యిప్పుడు యూపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే మాయావతి యూపీ విభజనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని అఖిలేష్ అన్నటు వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే బుందేల్ కండ్ కు రాహుల్  ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించిన అక్కడ బీఎస్పీ హవా కొనసాగింది. దీన్ని విస్మరించరాదు. అలాగే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన వారిలో ములాయం కూడా ఉన్నారు. మరి అక్కడ మహిళలు ఆ పార్టీ వ్యతిరేకంగా ఓట్లు వేశారా? ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు చాలా అంశాలతో ముడిపడి ఉంటాయి. యూపీ ఎన్నికల ఫలితాల్లో ఎస్పీకి బిఎస్పీల మధ్య ఓట్ల శాతం కేవలం మూడు శాతమే. ఎస్పీని అధికారంలోకి తీసుకురావడానికి అఖిలేష్ ఎంత శ్రమించాడో ...రాహుల్ కూడా పరోక్షంగా  ఎస్పీకి లబ్ధి చేకూర్చాడు. రాహుల్ ప్రచారం అంత మాయకు వ్యతిరేకంగానే సాగింది. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎస్పీకి లాభించాయి. ఎస్పీ విజయాన్ని ఆ రాష్ట్ర విభజనకు ముడిపెట్టడమే విడ్డూరంగా ఉన్నది. యూపీలో ఎస్పీ గెలవడానికి ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే కారణం కాదు. ఆ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్న ముస్లిం ప్రజల ఓట్లు కూడా కీలకమే. అలాగే యువత కోసం ఎస్పీ ఇచ్చిన హామీలను జనంలో తీసుకెళ్ళి నమ్మకం వాళ్ళలో నమ్మకం కలిగించడంలో సఫలమయ్యాడు. ముస్లిం ఓట్ల కోసం కాంగెస్ ఎన్ని పాచికలు వేసిన అవి పారలేదు. పైగా ఆ వర్గ ఓట్లన్నీ ఎస్పీవైపు మళ్ళాయి. ఎందుకంటే బిఎస్పీ హయంలో ఒకే వర్గానికి మేలుచేసే విధంగా మాయావతి వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని కారణాలను కాదని మన రాష్ట్రం కూడా కొందరు తెలంగాణ వ్యతిరేకులు .. యూపీ ఫలితాలు విభజనకు వ్యతిరేకంగా వచ్చాయని దాన్ని మన రాష్ట్రానికి ఆపాదిస్తున్నారు. అది సరికాదు. యూపీ ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వం పై ప్రభావం చూపబోవు అని సోనియా గాంధీ మొదలు కేంద్ర మంత్రులు కూడా సెలవిస్తున్నారు. అలాగే ఆ రాష్ట్ర ఫలితాల ప్రభావం  ఇక్కడ జరగబోతున్న ఉప ఎన్నికల్లో కూడా ఉండదని ముఖ్యమంత్రి మొదలు అందరూ చెబుతున్నారు. దేశంలో దశాబ్డంన్నర కాలంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అందుకే ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు అక్కడ ఉండే స్తానిక సమస్యలను బట్టి ఉంటుంది. అవి వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ఉంటుంది అని కూడా చెప్పడం కష్టమే. యూపీలో సైకిల్ జోరు చూసి లోలోపల మురిసిపోతున్న చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు. అక్కడ అఖిలేష్ .. ఇక్కడ లోకేష్ అని ఆ పార్టీ నేతలు అంటుంటే పులకించి పోతున్నాడు. కానీ అఖిలేష్ కు లోకేష్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో నగదు బదిలీ పథకం లోకేష్ ఆలోచనే అని మహాకూటమి పేరుతో చంద్రబాబు ఎంత మాయ చేయాలని చూసిన ఈ రాష్ట్ర ప్రజలు బాబును లోకేష్ బాబు పథకాన్ని ఆదరించలేదు. చంద్రబాబు ఎంత ఘనుడో ఈ రాష్ట్ర ప్రజలకు బాగా ఎరుకే. అందుకే ఆయనను విశ్వసించలేదు. విశ్వసించరు కూడా. అందుకే అక్కడ అవకాశవాదం కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మభ్యపెట్టే మాటలు ఎన్ని చెప్పిన జనం నమ్మలేదు. అఖిలేష్ యాదవ్ చెప్పిన సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా నివేదికలను కచ్చితంగా అమలు చేయాలే. మిగతా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలి. అప్పుడే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా దేశంలో ఎక్కువ స్థానాలు ఉన్న యూపీలో మెరుగైన సీట్లను దక్కించుకోగలదు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home