కమలం గూటికి కోమటిరెడ్డి
అందరూ అనుకున్నదే జరిగింది. రాజగోపాల్ రెడ్డి ముందునుంచీ చెబుతున్నదే ఇవాళ కుండబద్దలు కొట్టారు. ఆయన ఏపార్టీ లో చేరబోతున్నారు అనేదానిపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి కమలం కండువా కప్పుకోనున్నట్టు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననని, ప్రజల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, కాబట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజలు తన వెంట నడవాలని ఆయన కోరారు. దీంతో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని, త్వరలో స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్లోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలన్నారు. ప్రజలు ఇతర పార్టీలను గెలిపించడం తప్పా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. నా రాజీనామాతో నా ప్రజలకు మేలు కలుగుతుందని