Monday 29 April 2024

ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా వెనుక!

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు.లోక్‌సభ ఎన్నికలలో AAPతో పొత్తు పెట్టుకోవడం తన రాజీనామాకు ఒక కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపినట్టు పేర్కొన్నారు.


అరవిందర్ సింగ్ లవ్లీ కన్హయ్య కుమార్ పై విమర్శలు చేశారు. దీంతో ఆయన రాజీనామా వెనక బీజేపీ ఉన్నదనే వాదనలు ఉన్నాయి.


ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య  కన్నయ్య కుమార్ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై పోటీకి దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఢిల్లీ లోని 7 లోక్ సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన కమల నాథులకు కాంగ్రెస్+ఆప్ అలయెన్స్ సవాల్ విసురుతున్నదని సమాచారం. అందుకే ఇండియా కూటమిలో సంక్షోభం సృష్టించే ఎత్తుగడలో భాగమే తాజా రాజకీయ పరిణామాలు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Labels: , ,

ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత

కొవిడ్ కష్టకాలంలో ప్రధాని మోడీ దేశంలో టీకాల తయారీకి అనుమతించి, అందరికీ అందించడంతోనే నేడు భారతీయులంతా బతికున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. కనుక ఆయనను మళ్ళీ ఆశీర్వదించాలని కోరారు. దీనిపై  విమర్శలు వస్తున్నాయి.


ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అధికారంలో ప్రభుత్వం తన బాధ్యత ను నిర్వర్తించిన దానికి ఇప్పుడు ఓట్లు అడగటం బీజేపీ కే చెల్లింది. లాక్ డౌన్ సమయం లో ఉపాధి పోయి సొంత ఊళ్లకు రవాణా సౌకర్యం లేక వేల కిలోమీటర్లు కాలి బాటన నడిచి మధ్య లోనే కొంత మంది ప్రాణాలు విడిచిన ఉదంతాలు ఉన్నాయి. 

కొవిడ్ సమయం లో చాలా దేశాలు ప్రజల ప్రాణాలను కాపాడటానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. ఎందుకంటే మానవ వనరుల తోనే ఏ దేశం అయినా పురోగమిస్తుంది ఆ దేశాలు విశ్వసించాయి. కానీ ఇక్కడ మాత్రం బీజేపీ ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుతో ముడిపెట్టడం సరైంది కాదు. పదేళ్ల తమ పాలన లో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగవచ్చు. కానీ ప్రజల విశ్వాసాలను కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కు వాడుకోవాలని చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఫలితాలే చూడాల్సి ఉంటుంది. 

Labels: , ,

కాంగ్రెస్‌లోకి గుత్తా కుమారుడు


ఊహించినట్టుగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 


కేసీఆర్‌ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే నేతలు పార్టీ వీడుతున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు  ముందు కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని నేతలు పార్టీ వీడటానికి ఇదే కారణం అన్నారు. పార్టీలో అంతర్గత సమస్యల వల్లనే తన కొడుకు అమిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నాడని తెలిపారు. అప్పుడే తండ్రి కొడుకులు ఇద్దరూ పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన తనయుడు పార్టీ మారడంతో అదే నిజమైంది.

Labels: , , ,

కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చిన ఇండోర్‌ అభ్యర్థి

 కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆ పార్టీ అధిష్ఠానానికి షాక్‌ల మీద షాక్‌ ఇస్తున్నారు. మొన్న సూరత్‌ ఏకగ్రీవ ఎన్నిక ఉదంతాన్ని మరిచిపోకముందే మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో హస్తంపార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. 


ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో దశలో భాగంగా మే13న పోలింగ్‌ జరగనున్నది. నామినేషన్ల  విత్‌ డ్రాకు నేడే (ఏప్రిల్ 29) చివరి రోజు. ఈ క్రమంలోనే సోమవారం పొద్దున అక్షయ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆ వెంటనే బీజేపీలో చేరారు.   ఆ సమయంలో ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్‌ మెండోలా ఉండటం గమనార్హం. 


అక్షయ్‌ బీజేపీలో చేరిన విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ ధృవీకరించారు. ఆయనతో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్‌ చేసి పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ శంకర్‌ లల్వానీ బరిలో ఉన్నారు. ఇక్కడ బీఎస్పీతో పాటు స్వతంత్రులు కొంతమంది పోటీ చేస్తున్నారు. 


ఎన్నికల వేళ బీజేపీ చేస్తున్న రాజకీయాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో తేల్చుకోలేక ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం ద్వారా అంతటా బీజేపీ హవా ఉన్నదనే ప్రచారం కల్పించడానికే ఇలాంటివి చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Labels: , ,

Friday 19 April 2024

మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావ్‌ : రేవంత్‌రెడ్డి


కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 20 మంది టచ్‌లో ఉన్నారన్న మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ..  'మా ఎమ్మల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. కారు పాడైపోయింది. ఇక షెడ్డు నుంచి బైటికి రాదని ఎద్దేవా చేశారు.' తమ హయాంలో పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టామని. కానీ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఈ జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా.. బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలని రేవంత్‌ ప్రశ్నించారు.

Labels: , , ,

సార్వత్రిక సమరంలో తొలి విడుత పోలింగ్‌ ప్రారంభం


సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్‌ జరుగుతున్నది. దీనితోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 50  , సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. 60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీకి చెందిన 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 

ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు దశల్లో జరిగే పోలింగ్‌లో ఇదే పెద్దది. అలాగే కేంద్రంలో బీజేపీ రెండుసార్ల సంపూర్ణ మెజారిటీ సాధించడంలో కీలక రాష్ట్రాలైన యూపీలో 8, రాజస్థాన్‌లో 12 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలోని ముస్లిం, దళిత, ప్రాబల్య ప్రాంతాల్లో తొలి విడుత పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలో ఇవాళ జరుగుతున్న 8 స్థానాల్లో 2019లో బీజేపీ 3 స్థానాలు గెలుచుకోగా, బీఎస్పీ 3, ఎస్పీ రెండు చోట్ల గెలుపొందాయి. బీజేపీకి సంప్రదాయంగా మొదటి నుంచి మద్దతుగా ఉన్న రాజ్‌పూత్‌లు ఈసారి ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి నెలకొన్నది. అలాగే రాజస్థాన్‌లోని 12 చోట్ల ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నది. 

Labels: , , , , , , , ,

Thursday 18 April 2024

కాంగ్రెస్‌ పార్టీలోకి మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే



కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌  వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా ఆ జాబితాలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ చేశారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన త్వరలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు తెలిపారు. నేడో, రేపు ఆయన తన అనుచరులతో కలిసి కారు దిగి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. 

చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాతే ఆయన బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్లలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పై పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో వికారాబాద్‌, తాండూరు, పరిగి మినహా మిగిలిన మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేర్‌లింగంపల్లి, చెవెళ్ల ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్‌కు చెందిన వారే. ఇప్పుడు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే పార్టీ వీడనుండటంతో ఇంకా ఎంతమంది ఈ జాబితాలో ఉండనున్నారన్న చర్చ జరుగుతున్నది. ప్రకాశ్‌గౌడ్‌ కొన్నిరోజుల కిందటే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన పార్టీ వీడుతారనే ప్రచారం జరిగింది. కానీ అభివృద్ధి పనుల విషయంలోనే సీఎంను కలిసినట్టు ఆయన వివరణ ఇచ్చారు. కానీ నాటి ప్రచారమే నేడు నిజమైంది.

Labels: , , , ,

ఆ నాలుగు స్థానాల ఫలితాలపై ఆసక్తి


రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పూర్తి  స్థానాల్లో పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. నాలుగో విడతలో తెలంగాణలోని 17 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల కోలాహలం మొదలైంది. తొలిరోజే 42 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలున్నాయి. ఖమ్మంలోని 10 స్థానాల్లో 9, కరీంనగర్‌లోని 13 స్థానాల్లో (సిరిసిల్లా, జగిత్యాల, హుజురాబాద్‌ ,కోరుట్ల మినహా) మిగిలిన తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం  సాధించింది. అలాంటి ఈ రెండు జిల్లాల అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన పట్నం మహేందర్‌రెడ్డి సతీమణికి మల్కాజ్‌గిరి, రంజిత్‌రెడ్డి చేవెళ్ల, దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌, కడియం కావ్యకు వరంగల్‌ టికెట్‌ ఇవ్వడాన్ని సొంతపార్టీలోనే విముఖత వ్యక్తమౌతున్నది. ఈ స్థానాల్లో పార్టీల అభ్యర్థుల కంటే జాతీయ, రాష్ట్ర నాయకత్వమే ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఒకవేళ ఈ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ లేదా బీజేపీ అభ్యర్థులు గెలిస్తే అది కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయమే కారణమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Labels: , , , ,

బీజేపీ బలం ఎంత?


అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓట్ల శాతం పెంచుకున్నా ఆశించిన సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో అధికారంలోకి వస్తామని లేదా కింగ్‌ మేకర్‌ అవుతామని చేసిన ప్రచారమూ ఉత్తదేనని తేలిపోయింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతామన్న ఆపార్టీకి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులే కరువైన పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, మహబూబాబాద్‌ స్థానాలకు బీఆర్‌ఎస్, పెద్దపల్లి, చేవెళ్ల నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకే టికెట్‌ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆపార్టీ గెలిచిన కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌లలో ఆదిలాబాద్‌ మినహా ముగ్గురినే తిరిగి బరిలోకి దించింది. మల్కాజ్‌గిరి, భువనగిరి స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా బీఆర్‌ఎస్‌ తరఫున గతంలో చట్టసభలకు ఎన్నికైన వారే కావడం గమనార్హం. దీంతో మొత్తం 17 స్థానాల్లో ఎనిమిది మంది బీఆర్‌ఎస్‌, ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులే. దీంతో బీజేపీ బలం ఎంత అన్నది ఫలితాల రోజున తేలనున్నది.

Labels: , , , ,

మోడీ వేవ్ లేదట


 

"పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో పోరాడాలి. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఓటర్ల ను బూత్ కు తీసుకుని రావాలి. మోడీ వేవ్ ఉందనే భ్రమ లో ఉండకండి. 2019 లోనూ మోడీ వేవ్ ఉన్నది. కానీ నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను." అంటూ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా వ్యాఖ్యానించినట్టు  వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

మహారాష్ట్ర లోని తన సిట్టింగ్ నియోజకవర్గం ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇది తన ప్రత్యర్థి పార్టీలు శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) అస్త్రంగా మారింది.2019 లో ఆమె  ఎన్ సీపీ మద్దతు తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. నవనీత్ తాజా వ్యాఖ్యల పై స్పందించిన శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ "బీజేపీ నేతలు బహిరంగంగా నిజాలు చెబుతున్నారని " అన్నారు.

Labels: , ,

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం

 

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం


నెలకొంటుందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుందన్నారు.  తెలంగాణ భవన్‌లో లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్స్‌, ఎన్నికల ఖర్చు చెక్కులను అందించారు. 


ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ...ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు. బస్సు యాత్ర రూట్‌ మ్యాప్‌ ఇవాళ ఖారారవుతుంది. కాంగ్రెస్‌ పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. రానున్న రోజులు మనవే. పార్లమెంటులో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.

బీ ఫామ్ అంటే...

'బీ' ఫామ్‌ అంటే...



ఎన్నికల సమయం రాగానే పార్టీలు, అభ్యర్థులే కాదు బీ-ఫామ్‌ అంశం కూడా నిత్యం వార్తల్లో ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు తాము స్వతంత్ర అభ్యర్థులగా పోటీ చేస్తున్నామా? ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా? అన్నది నామినేషన్‌ పత్రాల్లో తెలియజేస్తారు. 


గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులకు బీ -ఫామ్‌ ఇస్తుంది. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన బీ-ఫామ్‌ను దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును ఆ అభ్యర్థికి కేటాయిస్తారు. ఆ పార్టీ అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫామ్‌ను అభ్యర్థికి అందిస్తారు. బీ-ఫామ్‌ ఉంటే  ఒక రాజకీయ పార్టీ ఆ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు లెక్క. దీనివల్ల ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందిన పార్టీ  అయితే  ఆ పార్టీకి  చెందిన గుర్తుపై అతను పోటీ చేయవచ్చు. ఎన్నికల ప్రచారంలో ఆ గుర్తును వాడుకునే అవకాశం ఉంటుంది.



https://youtube.com/shorts/ajT0b9x11bc?si=BovujaCtCUEqYgzL

Thursday 11 April 2024

సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత


ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకున్నది. తీహార్‌ జైలులో ఉన్న ఆమెను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో కవితను సీబీఐ ప్రశ్నించిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన జైలులో మరోసారి ప్రశ్నించింది. కవితను మరోసారి విచారించడానికి రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు వద్ద సీబీఐ అనుమతి తీసుకున్నది.

https://youtube.com/shorts/gyJ_iGsN3hs?si=82Cv-r4li_4b8VYy

సీబీఐ అరెస్ట్‌పై కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు అత్యవసర విచారణ కోరారు. ఈ మేరకు ఆయన సీబీఐ స్పెషల్‌ కోర్టులో దరఖాస్తు చేశారు. ప్రత్యేక జడ్జి మనోజ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు అప్లికేషన్‌ దాఖలు చేశారు. 





Labels: , , , ,

మంత్రి మాటల్లో అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు


అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  ఏం మాట్లాడినా కౌంటర్‌ ఇచ్చారు. అసలు రేవంత్‌ చెప్పేది కాంగ్రెస్‌ పార్టీలో నడువదు అన్నారు. అట్లా ఉప్పూ నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఫలితాల తర్వాత ఒక్కటయ్యారు. ఈ మధ్యకాలంలో బీజేపీ నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కోమటిరెడ్డి బీజేపీలోకి వస్తాననని తమ పార్టీ పెద్దలతో చెప్పినట్టు ఆరోపించారు. దీన్ని మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్‌ చేసినా రెండురోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి గేట్లు ఎక్కడివి? బిల్డింగ్‌ ఎక్కడిది? ఉన్న8 సీట్ల ఉన్న ఆపార్టీ ఎక్కడిది అని ఎదురు ప్రశ్నించారు. 


రాష్ట్రంలో కొన్నిరోజులుగా ఏక్‌నాథ్‌ షిండే ఎవరు అన్న చర్చ జరుగుతున్నది. దీనిపై స్పందించి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... 'కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు ఎవరూ లేరు. పదేళ్లు రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రి బీజేపీనే ఏక్‌నాథ్‌షిండేను సృష్టించిందన్నారు. హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డిలు నోరు అదుపులోపెట్టుకోవాలని మంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా దేనికైనా సిద్ధమని' మంత్రి సవాల్‌ విసిరారు.


రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక అధిష్ఠాన నిర్ణయాన్నికోమటిరెడ్డి బ్రదర్స్‌  బహిరంగంగా వ్యతిరేకించారు. ఆయన నాయకత్వంలో పని చేయను అన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్మే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సందర్భంగా రేవంత్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డిల జరిగిన మధ్య మాటల యుద్ధం తెలిసిందే. ఆ సమయంలో వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కాకుండా తన తమ్ముడి కోసం పనిచేయాలని కార్యకర్తలను, నేతలను కోరినట్టు ఆడియో ఒకటి కలకలం సృష్టించింది., అట్లా రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చారు. రేవంత్‌ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని అంటున్నారు. ఆయనే పదేళ్లు సీఎం అని కొనియాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక  వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో అంటున్నారు. 

Labels: , , , , , , ,

Wednesday 10 April 2024

కంటోన్మెంట్ ఫలితంపై ఆసక్తి


కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరు ఖరారైంది. నివేదిత ను అభ్యర్థిగా ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

స్థానిక నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం తో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది.


మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో ఈ స్థానం ఉన్నది. దీంతో ఈ ఉప ఎన్నిక ఫలితం పై ఆసక్తి నెలకొన్నది. గత ఎన్నికల్లో ప్రధాన పోటీబీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యే జరిగింది. బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు బీఆర్ ఎస్ అభ్యర్థిగా లాస్య సోదరి నివేదిత పేరు దాదాపు ఖారారు అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ఆ పార్టీ ప్రకటించింది. కాషాయ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ లోకి జంప్ కావడంతో ఇప్పుడు ఆ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నది.

Labels: , , ,

కడియం కామెంట్స్‌.. బీఆర్‌ఎస్‌ భవిష్యత్తు



బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. 


గతంలో ఇరిగేషన్‌ మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను. కాళేశ్వరం ఫీలర్ల కుంగుబాటుపై నిపుణుల సూచనల ప్రకారం మనం ముందుకు వెళ్లాలి. కానీ కేసీఆర్‌ తాను కుర్చీ వేసుకుని మూడు నెలల్లో బాగు చేస్తానని అనడాన్ని తప్పుపట్టారు. 


ఇలాంటివే పార్టీకి నష్టం చేశాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే పార్టీ నిర్మాణం లేకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదని తాను సూచించానని కానీ దాన్ని కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదన్నారు.


నియోజకవర్గంలో గతంలో మంత్రిగా తాను చేసిన పనులే తప్పా గత పదేళ్ల కాలంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పెద్దగా అభివృద్ధి జరగలేదు అన్నారు. 


బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అన్న ప్రచారం పార్టీకి నష్టం చేసిందని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలతో ఓటర్ల దగ్గరి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు. 


కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ అధినాయకత్వానికి మధ్య దూరం పెరిగింది ఇది కూడా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోవడానికి కారణం అన్నారు. 


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదన్న తానే ఆ పార్టీ చేరడానికి కారణాలు చెబుతూ... కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక దళితులు, మైనారిటీలపై విపరీతంగా దాడులు పెరిగాయని.. దాన్ని అడ్డుకునే శక్తి ప్రాంతీయపార్టీలకు లేదన్నారు. అందుకే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 


అట్లనే మోడీ ప్రభుత్వం ప్రాంతీయపార్టీలను టార్గెట్‌ చేసిందని, దీంతో ప్రాంతీయపార్టీల మనుగడను ప్రశ్నార్థం చేసిందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ సీట్లు వస్తే పార్టీ మనుగడ కష్టమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


అయితే కేసీఆర్‌ ఫైటర్‌ అని ఆయన ప్రజా సమస్యలపై పోరు చేస్తూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తే పార్టీకి తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.

Labels: , , ,

టెట్‌: నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్‌ అవకాశం


ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు గడువు ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. 

దీంతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవడానికి (ఎడిట్‌ ఆప్షన్‌) ఈ నెల 11 నుంచి 20 వరకు అవకాశం కల్పించింది. 

మంగళవారం నాటికి 1,93,135 దరఖాస్తులు వచ్చాయి.

ఈసారి ఫీజులు భారీగా ఉండటంతో దరఖాస్తులు తగ్గాయి. 

వచ్చే నెల 20 వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Labels: , , , , ,

Monday 8 April 2024

జానారెడ్డిని కాదు, రేవంత్‌రెడ్డిని

 https://youtube.com/shorts/4Ankili1zjQ?si=kN8Z7HvRHGADtsWE

Labels: , , , ,

ఎన్నికల తర్వాత ఏక్‌నాథ్‌ షిండే ఎవరు?

https://youtube.com/shorts/jGGjD3n74no?si=h7eAQOeM0eCvPXoJ

Labels: , , , , ,