లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం
నెలకొంటుందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ భవన్‌లో లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్స్, ఎన్నికల ఖర్చు చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖారారవుతుంది. కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. రానున్న రోజులు మనవే. పార్లమెంటులో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.
No comments:
Post a Comment