'బీ' ఫామ్ అంటే...
ఎన్నికల సమయం రాగానే పార్టీలు, అభ్యర్థులే కాదు బీ-ఫామ్ అంశం కూడా నిత్యం వార్తల్లో ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు తాము స్వతంత్ర అభ్యర్థులగా పోటీ చేస్తున్నామా? ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా? అన్నది నామినేషన్ పత్రాల్లో తెలియజేస్తారు.
గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులకు బీ -ఫామ్ ఇస్తుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన బీ-ఫామ్‌ను దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును ఆ అభ్యర్థికి కేటాయిస్తారు. ఆ పార్టీ అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫామ్‌ను అభ్యర్థికి అందిస్తారు. బీ-ఫామ్ ఉంటే ఒక రాజకీయ పార్టీ ఆ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు లెక్క. దీనివల్ల ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందిన పార్టీ అయితే ఆ పార్టీకి చెందిన గుర్తుపై అతను పోటీ చేయవచ్చు. ఎన్నికల ప్రచారంలో ఆ గుర్తును వాడుకునే అవకాశం ఉంటుంది.
No comments:
Post a Comment