Friday, 19 April 2024
మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావ్ : రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది టచ్‌లో ఉన్నారన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. 'మా ఎమ్మల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. కారు పాడైపోయింది. ఇక షెడ్డు నుంచి బైటికి రాదని ఎద్దేవా చేశారు.' తమ హయాంలో పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టామని. కానీ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఈ జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా.. బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలని రేవంత్ ప్రశ్నించారు.
Subscribe to:
Post Comments (Atom)
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment