Raju Asari

Thursday, 18 April 2024

బీజేపీ బలం ఎంత?


అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓట్ల శాతం పెంచుకున్నా ఆశించిన సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో అధికారంలోకి వస్తామని లేదా కింగ్‌ మేకర్‌ అవుతామని చేసిన ప్రచారమూ ఉత్తదేనని తేలిపోయింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతామన్న ఆపార్టీకి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులే కరువైన పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, మహబూబాబాద్‌ స్థానాలకు బీఆర్‌ఎస్, పెద్దపల్లి, చేవెళ్ల నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకే టికెట్‌ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆపార్టీ గెలిచిన కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌లలో ఆదిలాబాద్‌ మినహా ముగ్గురినే తిరిగి బరిలోకి దించింది. మల్కాజ్‌గిరి, భువనగిరి స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా బీఆర్‌ఎస్‌ తరఫున గతంలో చట్టసభలకు ఎన్నికైన వారే కావడం గమనార్హం. దీంతో మొత్తం 17 స్థానాల్లో ఎనిమిది మంది బీఆర్‌ఎస్‌, ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులే. దీంతో బీజేపీ బలం ఎంత అన్నది ఫలితాల రోజున తేలనున్నది.

No comments:

Post a Comment

Featured post

స్వాతంత్య్రం తర్వాత జరిగిన నిరసనలపై అధ్యయనం

భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని నిరసనలపై, ముఖ్యంగా 1974 తర్వాత జరిగిన వాటిపై అధ్యయనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బ...