కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఆ జాబితాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ చేశారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలిపారు. నేడో, రేపు ఆయన తన అనుచరులతో కలిసి కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాతే ఆయన బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్లలో ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో వికారాబాద్, తాండూరు, పరిగి మినహా మిగిలిన మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్‌లింగంపల్లి, చెవెళ్ల ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్‌కు చెందిన వారే. ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పార్టీ వీడనుండటంతో ఇంకా ఎంతమంది ఈ జాబితాలో ఉండనున్నారన్న చర్చ జరుగుతున్నది. ప్రకాశ్‌గౌడ్ కొన్నిరోజుల కిందటే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన పార్టీ వీడుతారనే ప్రచారం జరిగింది. కానీ అభివృద్ధి పనుల విషయంలోనే సీఎంను కలిసినట్టు ఆయన వివరణ ఇచ్చారు. కానీ నాటి ప్రచారమే నేడు నిజమైంది.
No comments:
Post a Comment