"పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో పోరాడాలి. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఓటర్ల ను బూత్ కు తీసుకుని రావాలి. మోడీ వేవ్ ఉందనే భ్రమ లో ఉండకండి. 2019 లోనూ మోడీ వేవ్ ఉన్నది. కానీ నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను." అంటూ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా వ్యాఖ్యానించినట్టు వీడియో ఒకటి వైరల్ గా మారింది.
మహారాష్ట్ర లోని తన సిట్టింగ్ నియోజకవర్గం ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇది తన ప్రత్యర్థి పార్టీలు శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) అస్త్రంగా మారింది.2019 లో ఆమె ఎన్ సీపీ మద్దతు తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. నవనీత్ తాజా వ్యాఖ్యల పై స్పందించిన శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ "బీజేపీ నేతలు బహిరంగంగా నిజాలు చెబుతున్నారని " అన్నారు.

No comments:
Post a Comment