Thursday 18 April 2024

ఆ నాలుగు స్థానాల ఫలితాలపై ఆసక్తి


రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పూర్తి  స్థానాల్లో పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. నాలుగో విడతలో తెలంగాణలోని 17 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల కోలాహలం మొదలైంది. తొలిరోజే 42 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలున్నాయి. ఖమ్మంలోని 10 స్థానాల్లో 9, కరీంనగర్‌లోని 13 స్థానాల్లో (సిరిసిల్లా, జగిత్యాల, హుజురాబాద్‌ ,కోరుట్ల మినహా) మిగిలిన తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం  సాధించింది. అలాంటి ఈ రెండు జిల్లాల అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన పట్నం మహేందర్‌రెడ్డి సతీమణికి మల్కాజ్‌గిరి, రంజిత్‌రెడ్డి చేవెళ్ల, దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌, కడియం కావ్యకు వరంగల్‌ టికెట్‌ ఇవ్వడాన్ని సొంతపార్టీలోనే విముఖత వ్యక్తమౌతున్నది. ఈ స్థానాల్లో పార్టీల అభ్యర్థుల కంటే జాతీయ, రాష్ట్ర నాయకత్వమే ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఒకవేళ ఈ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ లేదా బీజేపీ అభ్యర్థులు గెలిస్తే అది కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయమే కారణమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home