Monday 29 April 2024

ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత

కొవిడ్ కష్టకాలంలో ప్రధాని మోడీ దేశంలో టీకాల తయారీకి అనుమతించి, అందరికీ అందించడంతోనే నేడు భారతీయులంతా బతికున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. కనుక ఆయనను మళ్ళీ ఆశీర్వదించాలని కోరారు. దీనిపై  విమర్శలు వస్తున్నాయి.


ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అధికారంలో ప్రభుత్వం తన బాధ్యత ను నిర్వర్తించిన దానికి ఇప్పుడు ఓట్లు అడగటం బీజేపీ కే చెల్లింది. లాక్ డౌన్ సమయం లో ఉపాధి పోయి సొంత ఊళ్లకు రవాణా సౌకర్యం లేక వేల కిలోమీటర్లు కాలి బాటన నడిచి మధ్య లోనే కొంత మంది ప్రాణాలు విడిచిన ఉదంతాలు ఉన్నాయి. 

కొవిడ్ సమయం లో చాలా దేశాలు ప్రజల ప్రాణాలను కాపాడటానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. ఎందుకంటే మానవ వనరుల తోనే ఏ దేశం అయినా పురోగమిస్తుంది ఆ దేశాలు విశ్వసించాయి. కానీ ఇక్కడ మాత్రం బీజేపీ ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుతో ముడిపెట్టడం సరైంది కాదు. పదేళ్ల తమ పాలన లో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగవచ్చు. కానీ ప్రజల విశ్వాసాలను కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కు వాడుకోవాలని చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఫలితాలే చూడాల్సి ఉంటుంది. 

No comments:

Post a Comment