Thursday 28 September 2023

నియామక బోర్డుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం


బయోమెట్రిక్‌ నమోదు చేయడానికి అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాల ముందు చేరుకోవాలన్న నిబంధనను తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. తాను పేర్కొన్న నిబంధనను కమిషన్‌ అమలు చేయాలి. గత ఏడాది అక్టోబర్‌ 16న జరిగిన పరీక్షల్లోఅమలు చేసిన విధానాన్ని ఈ ఏడాది జూన్‌ 11న వాటిని విస్మరించింది. 

దీన్నిబట్టి పరీక్ష నిర్వహణలో, అభ్యర్థుల హాజరు వివరాలను నమోదు చేయడంలో కమిషన్‌ జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమౌతున్నదని గ్రూప్‌-1 రద్దు సమయంలో హైకోర్టు వ్యాఖ్యానించింది.  కాబట్టి జూన్‌ 11న రద్దు చేసి మళ్లీ తిరిగి నిర్వహించాలని సెప్టెంబర్‌ 23న హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారు. ఈసారి బయోమెట్రిక్‌ సహా నోటిఫికేషన్‌లోని అన్ని నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణ, అభ్యర్థుల డేటా సేకరణలో అజాగ్రత్త కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. దీన్ని సవాల్‌ చేస్తూ సర్వీస్‌ కమిషన్‌ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సబబే అని గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాల్సిందేని తీర్పు చెప్పింది. 


డివిజన్‌ బెంచ్‌లోఈ కేసు విచారణ సందర్భంగా కూడా 'ప్రశ్ర పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నప్పుడు మళ్లీ అదే నిర్లక్ష్యమా? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా? బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్న దాన్ని ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్‌లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా? అలా ఎందుకు జరిగింది? లక్షలమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు నీరుగారుస్తారా?' అని టీఎఎస్‌పీఎస్సీని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని.. వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించిది. తర్వాత సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. 


500 పైగా గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు నిరుద్యోగులు ఎంతో ఆనందపడ్డారు. చాలామంది గ్రూప్‌-1 లక్ష్యంగా చేసుకుని సీరియస్‌గా ప్రిపరేషన్‌ మొదలుపెట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీతో ఒకసారి, కమిషన్‌ నిర్లక్ష్యంతో మరోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు కావడంతో నిరుద్యోగులు ఎంతో మానసిక వ్యథకు గురవుతున్నారు. పరీక్ష రద్దుపై సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కి వెళ్లారు. కానీ సింగిల్ బెంచ్ కంటే డివిజన్ బెంచ్‌ కమిషన్‌  చాలా కఠినమైన పదాలు వాడింది. డివిజన్‌ బెంచ్‌ కూడా సింగిల్‌ జడ్జి తీర్పు సబబే అని పేర్కొంటూ అవే అంశాలనే పునరుద్ఘాటించింది. సర్వీస్‌ కమిషన్‌ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది తెలుస్తున్నది.  అందుకే డివిజన్‌ బెంచ్‌ అభ్యర్థుల భవిష్యత్తు, కమిషన్‌ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయని చెప్పింది. 



నియామకాల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్లలో లోపాలు, పరీక్ష నిర్వహణ సమయంలో లోపాలు పదే పదే ఎందుకు పునరావృతమౌతున్నాయి? సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే కమిషన్‌ హడావుడిగా ఎందుకు పరీక్షలు నిర్వహిస్తున్నది? అన్నప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కమిషన్‌ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష రద్దు తర్వాత రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు 52 వేల మంది అభ్యర్థులు హాజరుకాలేదు. ఏండ్ల తరబడి చదివిన వాళ్లకు పరీక్ష రద్దు అనేది మానసిక వ్యథకు గురిచేసింది. ఈ సమయంలో అభ్యర్థుల్లో విశ్వాసం నింపాల్సిన కమిషన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. నిరుద్యోగ అభ్యర్థులను పూర్తిగా నైరాశ్యంలోకి నెడుతున్నది. కమిషన్‌ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని దీంట్లో రాజకీయ జోక్యం ఉండదంటూనే మరి స్వేచ్ఛగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నది? ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత, నోటిఫికేషన్లలో, పరీక్ష నిర్వహణలో లోపాలపై కోర్టులు ప్రశ్నించినా ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదు? ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవడానికి కూడా వీల్లేదని కేసు విచారణ సందర్భంగా దాఖలు చేస్తున్న కౌంటర్లను చూస్తే తెలిసిపోతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నేతల మాటలు నినాదాలే కాని వాటిని భర్తీ చేసే ఉద్దేశం లేదన్ననది కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం అని నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు.

Labels: ,

కరువులేని సమాజ లక్ష్య సాధనే స్వామినాథన్ కు నివాళి

 


ప్రైవేట్ రంగ పరిశ్రమల్లో అతిపెద్దది అత్యంత కీలకమైంది వ్యవసాయం. వ్యవసాయం లాభదాయకంగా లేనందు వల్ల  తల్లిదండ్రులు వారి పిల్లలను వ్యవసాయం వైపు ప్రోత్సహించడం లేదు. అందుకే సేద్యం ఒకటే చాలదు వ్యవసాయ అనుబంధ అభివృద్ధి అంశాలు చాలా ముఖ్యమని,  పార్కులు అగ్రి ప్రాసెస్ విధానం ఉత్పత్తుల తయారీ వంటి వ్యాపకాల ద్వారానే యువతరం వ్యవసాయం పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుందని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ స్పష్టం చేశారు.   ఐటీ రంగంలోనే కాకుండా వ్యవసాయంలోనూ మన దేశం ఔట్‌ సోర్సింగ్‌ సేవలు అందించేందుకుఅనేక అవకాశాలు ఉన్నాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.  


వ్యవసాయ పరిశోధనవైపు యువత రాకపోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ..యువత సహజంగా వారి తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు నడుచుకుంటుందన్నారు. వ్యవసాయం లాభసాటిగా లేదని వారు భావిస్తే..తమ పిల్లలను అగ్రికల్చర్‌ కోర్సులు చదివించేందుకు వారు అంగీకరించరన్నారు. ఆర్థికంగా లాభమా కాదా అన్న విషయం బాగా ప్రభావితం చేస్తుందన్నారు. విశ్వవిద్యాలయాలకు వెళ్లి చదువుకునే యువత హుందా జీవితాన్ని కోరుకుంటున్నది. విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నది. వ్యవసాయం ద్వారా అన్నిరకాల అవసరాలు తీరేలా ఆదాయం వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు కీలకమైన అంశం. యువతరం రైతులు పంట పండించడానికి మాత్రమే పరిమితం కాకండి. అదనపు ఆదాయాన్ని అందించే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై దృష్టి సారించాలనిఆయన సలహా ఇచ్చారు. అలాగే మన వ్యవసాయ విద్యా విధానం వాస్తవాలకు దూరంగా సాగుతుందన్నారు. మన విద్యార్థుల్లో చాలామందికి రైతుల సమస్యలు ఏమిటో తెలియదన్నారు. జాతీయ రైతు కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు చాలా వ్యవసాయ కళాశాలలకు వెళ్లానని అక్కడ విద్యార్థులు తమకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ లేదని వారు ఓపెన్‌గానే చెప్పారని తెలిపారు. తాను వ్యవసాయ పరిశోధన సేవలు అందించే సమయంలో అగ్రికల్చర్‌ విద్యార్థులు ఒక సీజన్‌ (వానకాలం లేదా యాసంగి) మొత్తం రైతులతో గడపాలని  చెప్పవాడిని, అప్పుడే వారికి వ్యవసాయంలోని అసలు సమస్యలు అనుభవంలోకి  వస్తాయన్నారు. 


ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతుంటాయి. దీనిపై ఆయనను అగినప్పుడు తాను చేసిన కొన్ని సూచలను ప్రభుత్వాలు  అమలు చేశాయన్నారు. రైతులకు 4 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వడం వంటివి వాటిలో కొన్న. కానీ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రధాన అంశాలపై తన  ఇంకా అమలు కాలేదన్నారు. తాను చేసిన మరో ముఖ్యమైన సూచన ఏమిటి అంటే దేశమంతా ఒకే మార్కెట్‌  ఉండాలన్నారు. అప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల తరలింపుపై ఆంక్షలు ఉండవన్నారు. ఒకే మార్కెట్‌ విధానం తెస్తే అవినీతి చాలా వరకు తగ్గుతుందన్నారు. 


కరువు లేని సమాజ స్థాపన మనకు చాలా అవసరం అన్నారు. ప్రతీ ఒక్కరికీ తగినంత ఆహారం ఇవ్వాలన్నారు. ఆహారభద్రత చట్టం అమల్లోకి వచ్చాక ఈ  పథకం ద్వారా చాలావరకు ఇది సాధ్యపడుతుందన్నారు. కరువు లేని సమాజాన్ని సృష్టించేందుకు సమీకృత ప్రణాళికను  అమలు చేయాలని స్వామినాథన్‌ సూచించారు. దానికి ఆహార భద్రత చట్టం పటిష్టంగా అమలు చేయాలన్నారు. కరువులేని సమాజం లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదన్నారు. అలాగే పంటల విస్తీర్ణం తగ్గుదల సమస్యను అధిగమించడానికి అధికోత్పత్తినే పరిష్కారమన్నారు. మృత్తికల సంరక్షణ, పంటలకు సూక్ష్మ పోషకాలు అందించడం, చీడపీడల నివారణ, సమిష్టి బాధ్యత వంటి చర్యల ద్వారా ఉత్పత్తి పెంచుకోవచ్చన్నారు. కాబట్టి కరువులేని సమాజం లక్ష్య సాధనే మనం స్వామినాథన్ కు ఇచ్చే నివాళి. 

Labels: , ,

వొక్కలిగ ఓట్లు.. అన్నామలైపై ఆశలు


 

Labels: , , , , ,

నియామకాలపై నీలి నీడలు



 

Labels: , ,

బీజేపీకి 5 రాష్ట్రాల అగ్నిపరీక్ష



 

Labels: , , , , , , ,

Saturday 23 September 2023

కృషి వాటిది.. ప్రచారం వీటిది..


 

Labels: , , , , , ,

Thursday 21 September 2023

ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలె


 

Labels: ,

వైసీపీ, బీజేపీల మధ్య సయోధ్య?


 

Labels: , ,

Wednesday 20 September 2023

ఓటు రాజకీయాలు ఎవరివి?


 

Labels: , , , , , , , , , , , ,

దేని నుంచి.. ఎవరి నుంచి?


 

Labels: , , , ,

Thursday 14 September 2023

యూనివర్సిటీల్లో బోధించేవారేరీ?

 



Labels: , , ,

Sunday 10 September 2023

చంద్రబాబు అరెస్ట్‌.. అనంతరం పరిణామాలు


 

Labels: , , , ,

నీకు నేను నాకు నువ్వు


 

Labels: , , , , , , ,

గులాబీ బీ ఫామ్‌ దక్కేదెవరికి?

 



Labels: , , ,

Saturday 26 August 2023

కామ్రేడ్లు ఇకనైనా కళ్లు తెరవండి!


బీఆర్‌ఎస్‌ ను ఓడించాలనే నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని సీపీఐ, సీపీఎం నేతల ప్రకటించడం హాస్యాస్పందగా ఉన్నది. దీనికి వాళ్లు చెప్పిన కారణాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారని, కానీ మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని వామపక్ష నేతలు తప్పుపడుతున్నారు. అలాగే బీజేపీతో సఖ్యత ఏర్పడిన కారణంగానే కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించారు. కనీస మిత్ర ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వాపమక్షాలు మిత్ర ధర్మం గురించి మాట్లాడటం వారి బలహీనతను తెలియజేస్తున్నది. బీజేపీతో సఖ్యత అన్న సంగతి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇండియా కూటమిలోకి బీఆర్‌ఎస్‌ను ఎందుకు ఆహ్వానించలేదు అన్న ప్రశ్నకు ఆ కూటమిలోని పార్టీల నేతలు చెప్పిన విషయాలు కూడా వాపమక్ష నేతలు అప్పుడు అర్థం కాలేదా? మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో 'విధాత' తెలుసుకునే ప్రయత్నంలో ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పిన విషయాలు ఆసక్తి కలిగించాయి. ఒకప్పుడు మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట. ఆ తర్వాత చాలాకాలం కాంగ్రెస్‌కు అనంతరం బీఆర్‌ఎస్‌ కు అవకాశం ఇచ్చింది. కానీ ప్రస్తుతం బీజేపీకి ఇక్కడి ఓటర్లు మారే ప్రశ్నే తలెత్తదు అని తేల్చిచెప్పారు. మునుగోడు బీఆర్‌ఎస్‌ విజయం వెనుక వామపక్షాల పాత్ర కూడా ఉన్నది. తెలంగాణలో బీజేపీ విస్తరణను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే నాడు వామపక్షాలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన విషయం విదితమే. వామపక్షాల బలం తెలిసే కేసీఆర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించగానే వారి మద్దతు కోరారు. ఆ ఎన్నిక అయిపోయే వరకు వరకు వారితో సత్ససంబంధాలు నెరిపారు. ఫలితం అనంతరం వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వామపక్ష నేతలే చెప్పారు. అప్పుడైనా కమ్యూనిస్టులు కళ్లు తెరవాల్సింది. 


ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. కేసీఆర్‌ ఎంఐఎం మా మిత్ర పక్షం అని అసెంబ్లీ వేదికగా.. బహిరంగసభల్లోనూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కానీ ఎన్నడూ ఆయన వామపక్షాల గురించి ప్రస్తావించలేదు. అలాంటప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం ఏమొచ్చింది? బీఆర్‌ఎస్‌ వామపక్షాలకు చెరో టికెట్‌, రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వజూపినట్టు సమాచారం.  ఈ మాత్రం దానికి వాళ్లు బీఆర్‌ఎస్‌తో పొత్తు కోవడం దేనికి? వామపక్షాలు ఐక్యంగా వాళ్లకు బలం ఉన్నచోట కలిసి పోటీ చేస్తే అవే సీట్లు వారికి సొంతంగానే దక్కుతాయి. అవసరం అనుకుంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి వారి జాతీయ నాయకత్వం కలిసి పనిచేస్తున్నందున వారు పోటీ చేసే చోట ఇరువురు సహకరించుకునే అవకాశం ఉన్నది. ఇన్ని అవకాశాలను వదిలేసి బీఆర్‌ఎస్‌తోనే కలిసి వెళ్దామనుకున్నామని, కానీ కేసీఆర్‌ మమ్మల్ని పట్టించుకోవడం లేదని కామ్రేడ్‌లు ఆవేదన చెందడం అభ్యుదయవాదులకు, ప్రజాస్వామికవాదులకు నచ్చడం లేదు. 


వామపక్షాలు ఇప్పటికే త్రిపుర, బెంగాల్‌ వంటి రాష్ట్రాలను కోల్పోయాయి. రానున్నరోజుల్లో వారి ఉనికే ప్రశ్నార్థం అయ్యే ప్రమాదం ఉన్నది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వాళ్లు ఇంకో పార్టీని టికెట్లు అడగటం కంటే సొంతంగానే పోటీ చేసి తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నది. కనుక  కామ్రేడ్లు దేశంలో ప్రస్తుతం నెలకొన్నప్రతికూల పరిస్ఙితులు దృష్ట్యా మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడే పార్టీలతో కలిసి వెళ్లడం వారికీ మంచిది. దేశానికి శ్రేయస్కరం.

Labels: , , ,

ఆరేళ్ల తర్వాత డీఎస్సీ


ఆరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం  ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 6,500 కు పైగా పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.  ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 పోస్టులున్నాయి. ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్ల మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలలను కార్పొరేట్‌ పాఠాశాలల స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. 


ఆరేళ్ల నుంచి కొత్త పోస్టుల భర్తీ లేదు


రాష్ట్రావిర్భావం తర్వాత 2017 లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీఎస్సీని టీఆర్‌టీ ( (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) మార్చి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియామకాలు చేపట్టింది. అపట్లో దాదాపు 25 వేల పోస్టులు ఖాళీలు ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. కానీ 8,792 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నియామక ప్రక్రియ పూర్తై ఆరేళ్లు అవుతున్నా.. కొత్తగా భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. గత మార్చిలో తెలంగాణ రాష్ట్రంలో 1 నుంచి 8 వ తరగతి వరకు బోధించే టీచర్ పోస్టులు 11,348 ఉన్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి తెలిపారు. 




24 వేల వరకు ఖాళీలు...నాలుగు లక్షల మంది నిరీక్షణ

రాష్ట్రంలో 80 వేల పోస్టులకు పైగా భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఏడాది మార్చి 9న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అప్పుడు  పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇందులో భాగంగా సెకండరీ ఎడ్యుకేషన్‌లో ఖాళీగా ఉన్న 13,086 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఏడాది దాటినా ఆ హామీ ఇప్పటివరకు అమల్లోకి నోచుకోలేదు. రాష్ట్రంలో సుమారు 24 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటి కోసం నాలుగు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి  ప్రభుత్వ ప్రకటనల్లో చెప్పిన పోస్టులకు నోటిఫికేషన్లలో జారీ అవుతున్న పోస్టులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది.  ఉమ్మడి రాష్ట్రంలో 6 నెలలకు ఒకసారి టెట్‌, రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా శాఖకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. గురుకులాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఏటా ఖాళీ అవుతున్న టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై అలసత్వాన్ని ప్రదర్శించింది. ఫలితంగా విద్యాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో రాష్ట్రాల వారీగా చూస్తే అట్టడుగుస్థాయిలో ఉన్నది. 


ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, ఐదేళ్లుగా బదిలీల లేవు

అలాగే రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, ఐదేళ్లుగా బదిలీల కోసం  గురించి ఎదురుచూస్తున్నారు. ఇవి గత ఏడాది వేసవి సెలవుల్లో పూర్తి చేస్తామని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలకు సీఎం హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌లు, ఎస్జీటీలు  బదిలీలు, పదోన్నతులపై  ఈ ఏడాది జనవరిలో విద్యాశాఖ జీవో జారీ చేసింది. బదిలీలపై స్పౌజ్‌ టీచర్స్‌, గుర్తింపు పొందిన సంఘ నాయకులకు అదనపు పాయింట్లు కేటాయించడంపై కొందరు ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారు.  దీంతో బదిలీలకు హైకోర్టు ఫిబ్రవరిలో బ్రేక్‌ వేసింది. మార్చి 14 వరకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నిలిపివేస్తున్నామని కోర్టు స్టే విధించింది.   ప్రమోషన్లకు, బదిలీలకు అంతర్గత సంబంధం ఉన్నది. ముందుగా పీజీ హెచ్‌ఎంల బదిలీలు జరగాలి. తర్వాత పీజీ హెచ్‌ఎంల పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. తర్వాత స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ జరగాలి. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంల  బదిలీల జరగాలి. తదుపరి స్కూల్‌ అసిస్టెంట్ ఖాళీలకు పదోన్నతులు నిర్వహించాలి. చివరగా ఎస్‌జీటీ, పండిట్లకు ట్రాన్స్‌ఫర్లు జరగాలి. ఈ మొత్తం ప్రక్రియ జరగాలంటే ముందుగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరగాలి. బదిలీల ప్రక్రియ కోర్టు స్టే ఇవ్వడంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది.  ప్రస్తుతం కోర్టులో అంశం కోర్టు పరిధిలో ఉన్నది. దీనిపై వాదనలు జరుగుతున్నాయి. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయితే మరిన్ని ఖాళీలు ఏర్పడుతాయి.  కానీ ప్రభుత్వం ఈ సమస్య  పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపడం లేదని, అందుకే పోస్టులు తక్కువగా ఉంటున్నాయని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.

Labels: , , , ,

బీఆర్‌ఎస్‌కు రెబెల్స్‌ బెడద


బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అందరి కంటే ముందుగానే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఒకటి రెండు రోజులు మౌనంగా ఉన్నారు. టికెట్లు రానివారు బాధ పడవద్దని భవిష్యత్తులో వారికి ఇతర అవకాశాలు ఉంటాయని సీఎం చెప్పారు. అయితే అసంతృప్తుల్లో చాలామందికి సీఎం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఇంకా మౌనంగా ఉంటే అదే అంగీకారమవుతుందని భావించిన నేతలు మెల్లగా స్వరం పెంచారు. పాలేరు టికెట్‌ ఆశించిన తుమ్మల నాగేశ్వర్‌ రావు సుమారు వెయ్యి కార్లు, 2 వేల బైక్‌లతో ఆయన ఖమ్మం వెళ్లారు. ఆయనకు టికెట్‌ రాకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ మారి పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. 


కార్యకర్తలతో సమావేశం అనంతరం తుమ్మల వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని తేల్చారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసినట్టు చెప్పారు. నా జిల్లా కోసం, ఖమ్మం జిల్లా వాసుల రాజకీయ రుణం తీర్చుకోలేనిదన్నారు. గోదావరి జిల్లాలతో తన ప్రజల పాదాలు కడుగడానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అయితే తుమ్మల మాటల బట్టి చూస్తే ఆయన పాలేరు నుంచి కాకుండా ఖమ్మం నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. జిల్లా మంత్రిగా అందరిని సమన్వయం చేయాల్సిన  అజేయ్‌కుమార్‌ పార్టీలో తమవర్గాన్నిఇబ్బందిపెట్టారని, తమకు  అన్యాయం చేశారని గతంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తుమ్మల కూడా నేరుగా మంత్రిపై ఆరోపణలు చేయకున్నా ఖమ్మం నుంచే పోటీ చేసి ఆయనను ఓడించాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన గతంలో జిల్లా టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు. ఆ సందర్భంలో వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తుమ్మలను గెలిపించుకుంటామని శపథం చేసిన సంగతి తెలిసిందే. 


షర్మిల పార్టీ కూడా కాంగ్రెస్‌లో విలీనమౌతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఒకవేళ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా.. రెండు పార్టీల మధ్య అవగాహన కుదరవచ్చని కలసి పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించడంతో తుమ్మలకు ఖమ్మం నియోజకవర్గాన్ని ఆఫర్‌ చేసి ఉండొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని సవాల్‌ విసిరిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేయించేందుకు కృషి చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, జలగం వెంకటరావులను పార్టీలోకి తీసుకొస్తే మెజారిటీ అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా గెలుచుకోవచ్చనే యోచనలో ఉన్నారు. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. 


స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనూ బరిలో ఉంటానని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. ఆరునూరైనా రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటానని, భూమి కొని దుక్కిదున్ని, నారు నీరు పోసి, రాశి చేస్తే.. ఎవరో వచ్చి దానిపై కూర్చుకుంటానంటే ఊరుకుంటానా? అని పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కూడా పార్టీ మారొచ్చు అంటున్నారు. టికెట్లు రాని వారిని బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ కమిటీ వేసినా ఫలితం కనిపించడం లేదు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్‌ నుంచి తన తనయుడిని పోటీ చేయించడానికే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ తనపై వేటు వేసినా అందుకు సిద్ధంగా ఉన్నట్టున్నారు. అట్లనే ఉప్పల్‌  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలతో పాటు రామగుండంలో కందుల సంధ్యారాణి లతో పాటు టికెట్లు ఆశించి భంగపడిన వారు రానున్నరోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వాళ్లంతా తిరుగుబాటు జెండా ఎగురవేస్తే అధికారపార్టీకి 15-20 స్థానాల్లో సొంతపార్టీ నేతల నుంచే ముప్పు తప్పేలా లేదంటున్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ తనకు టికెట్‌ కేటాయించకపోవడంతో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన పౌరసత్వానికి సంబంధించిన వివాదం కొనసాగుతున్నందున పార్టీ అధిష్ఠానం ఆ నిర్ణయం తీసుకుని ఉంటుంది. అందుకే ఆయన సేవలను మరో రకంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ఆయనను నియమించింది. 


దీనికి తోడు వామపక్షాలు కూడా తాము బలంగా ఉన్నచోట బరిలో ఉంటామన్నారు. హుస్నాబాద్‌తో పాటు తమకు పట్టున్న ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. సీపీఎం కూడా మిర్యాలగూడ, మునుగోడుతో పాటు ఖమ్మం జిల్లాలో పోటీ చేయవచ్చు. తమ బలాన్ని తక్కువ అంచనా వేసిన బీఆర్‌ఎస్‌ అధినేతకు తమ సత్తా ఏమిటో చూపెడుతామని వామపక్ష నేతలు ఇప్పటికే చెప్పారు.  దీంతో ఏడెనిమిది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు గండిపడే ప్రమాదం ఉన్నది. అక్టోబర్‌ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ రావొచ్చు. ఆ లోగా అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీకీ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీతో కమ్యూనిస్టులు, ఇతర చిన్న పార్టీలు అవగాహనకు రావొచ్చు. కలిసి పోటీ చేయవచ్చు. అదే జరిగితే బీఆర్‌ఎస్‌కు డేంజర్‌ బెల్స్‌ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Labels: , , ,

బీఆర్‌ఎస్‌కు టాస్క్‌.. విపక్షాలకు టఫ్‌


 

Labels: , , , , ,

వివాదాస్పదం.. ఆ నేతల వైఖరి


 

Labels: , ,

నియామకాలపై అసత్య ప్రచారాలు..నిజాలు


 

Labels: , , ,

స్వరాష్ట్రంలో విద్యా వికాసం దిశగా..


 

Labels: , , ,

సకల జనుల సంక్షేమం...


 

Labels: , , ,

కర్ణాటకలో కుదిరింది... కానీ తెలంగాణలో కష్టమే


 

Labels: , ,

Tuesday 22 August 2023

అందరికంటే ముందే అభ్యర్థుల ప్రకటన ఉద్దేశం?


కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఆగస్టు నెలలోనే అన్నిపార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తాయని ప్రచారం మొదలైంది. దానికి అనుగుణంగానే అన్నిపార్టీల కంటే ముందుగానే బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే జాబితాను సీఎం కేసీఆర్‌ ఇవాళ  ఏడు స్థానాల్లో మాత్రమే మార్పులు చేశారు. నాలుగు స్థానాలు మినహా 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో పెద్దగా మార్పులేమీ లేవు. కేసీఆర్‌ ముందు నుంచీ చెబుతున్నట్టే దాదాపు సిట్టింగులందరికీ టికెట్‌ ఇచ్చారు. 


కేసీఆర్‌ కామారెడ్డి నుంచి ఎందుకు?


ప్రగతిభవన్‌లో సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగడం విశేషం. ముచ్చటగా మూడో సారి అధికారం మాదేనని విశ్వాసంతో ఉన్న ముఖ్యమంత్రి ఈసారి రెండు స్థానాల్లో పోటీ చేయనుండటంపైనే చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 2018లో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తప్పా మిగిలిన 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈసారి అక్కడ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ నుంచి త్రిముఖ పోరు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. సీఎం అక్కడి నుంచి నిలబడితే మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆ ప్రభావం ఉంటుందనేది ఒక అభిప్రాయం కాగా, గజ్వేల్‌ సారుకు అంత అనుకూలంగా లేదనే మరో వాదన ఉన్నది. ముందుగా అధికారపార్టీ అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి కాంగ్రెస్‌, బీజేపీల తొలి జాబితా తర్వాత సీఎం కామారెడ్డి లేదా గజ్వేల్‌లలో ఏదో ఒక దానిపైనే ఫోకస్‌ చేసే అవకాశమూ లేకపోలేదు. 


జనగామ, నర్సాపూర్‌లో మార్పు తథ్యం!


ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే దుబ్బాక, స్టేషన్‌ఘన్‌పూర్‌, ఉప్పల్‌, వైరా, ఖానాపూర్‌, వేములవాడ, కామారెడ్డి, బోధ్‌, కోరుట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఇందులో కామారెడ్డి నుంచి సీఎం పోటీ చేస్తుండటం, కోరుట్ల నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు కుమారుడికే టికెట్‌ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు స్థానాలపై పెద్దగా పేచీ ఏమీ లేదు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఎంపీగా నిలబెడుతారని ప్రచారం జరుగుతున్నది. వేములవాడ ఎమ్మెల్యేకు పౌరసత్వం అంశం అడ్డంకిగా మారిందంటున్నారు. ఇంకా ప్రకటించని నాలుగు స్థానాల్లో నాంపల్లి, గోషామహల్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టినా ఎంఐఎంకు పరోక్షంగా సహకరించవచ్చు. ఇక జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డిలు బరిలోకి దిగడం దాదాపు ఖాయమంటున్నారు. టికెట్లు దక్కని వారు నిరాశపడవద్దని రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ ఇలా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పారు. 


బుజ్జగిస్తూనే... హెచ్చరికలు

టికెట్లు దక్కని వారిని బుజ్జగిస్తూనే... పార్టీలో ధిక్కారస్వరం వినిపిస్తే సహించలేదని ఇవాళ కేటీఆర్‌ ట్వీట్‌ ను బట్టి తెలుస్తోంది. మంత్రి హరీశ్‌పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన మేమంతా హరీశ్‌ వెంటే ఉంటామని చెప్పారు. దీంతో గీత దాటితే ఎంతటివారైనా వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్ బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై మైనంపల్లిపై వేటు అవకాశమూ లేకపోలేదంటున్నారు. టికెట్‌ ఇచ్చిన తర్వాత వేటు వేస్తారా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. కానీ కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలను సహించేది లేదనట్టు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం వైఖరిగా కనిపిస్తున్నది. 


 మంత్రివర్గ విస్తరణ?


ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసరా ఫించన్లు పెంచుతామని చెప్పిన సీఎం మంత్రివర్గంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క స్థానాన్నే భర్తీ చేస్తారా? ఇంకా ఏమైనా మార్పులు చేస్తారా అన్నది చూడాలి. తాండూరు నుంచి తానే పోటీ చేస్తానని పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని టాక్‌. ఎందుకంటే ఇవాళ జాబితా విడుదల చేసిన అనంతరం సీఎం పాత రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలోని 29 స్థానాల్లో  బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ గెలుస్తాయని చెప్పారు. మహేందర్‌రెడ్డిని తీసుకుంటే  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టు నిలుపుకోవచ్చని పార్టీ అధినేత అంచనా వేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్‌ అందరి కంటే ముందుగానే ఆట మొదలుపెట్టారు. తొలి జాబితా అనంతరం పార్టీలో మొదలైన అసంతృప్తి, నిరసనలు ఎన్ని రోజులు సాగుతాయి? ఎవరు ఎటు వైపు వెళ్తారు? పార్టీ విధేయులు ఎంత మంది? ఇలాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్తులో ఎవరికి అవకాశాలు ఇవ్వాలి? ఎవరిని పూర్తిగా పక్కనపెట్టాలన్నది తేల్చేస్తారని అంటున్నారు.

Labels: , , ,

సర్వేలు పోయాయి.. సమీకరణాలు మారుతున్నాయి




అసెంబ్లీ టికెట్ల కోసం బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటిస్తారని మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల వారీగా దాదాపు 100 సీట్లకు అభ్యర్థులు వీరే అని మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో రాడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే నువ్వా నేనా అన్న రీతిలో నేతలు బలప్రదర్శన మొదలుపెట్టారు. అసలు అధికారపార్టీలో ఏం జరుగుతున్నది? కచ్చితంగా మూడోసారి మాదే అధికారం అన్న నేతలు ఇప్పుడు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నారు? సొంతపార్టీ నేతల్లోనే చిచ్చు రాజేసే ఈ లీకులు ఎవరు ఇస్తున్నారు? కార్యకర్తలను, పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేసే కొందరు నేతల ప్రకటనలపై పార్టీ అధినేతల ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కేసీఆర్‌ గతంలో ఏం చెప్పారు? ప్రస్తుతం ఆ పార్టీలో ఏం జరుగుతున్నదో ఒకసారి పరిశీలిస్తే...


సిట్టింగులందరికీ టికెట్లు గ్యారెంటీ, ఇంతకంటే మంచి అభ్యర్థులు మాకు దొరుకుతారా అని అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అంతేకాదు సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, వందకు పైగా స్థానాలు గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఆ సందర్భంలోనే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తలదూర్చవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. నాటి మాటలన్నీ వమ్మయ్యాయి. ఈ ఐదారు నెలల కాలంలోనే అధికార 'కారు' పార్టీలో కల్లోలం మొదలైంది. స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలే అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోటీ అయ్యారు. ఇది ఇక్కడితోనే ఆగే అవకాశం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఆశావహులు ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పరిణామాలు చూస్తుంటే అధికారపార్టీలో సీఎం చెప్పిన సర్వేలు ప్రామాణికం కాదని స్పష్టమౌతున్నది. 




నాగార్జునసాగర్‌, రామగుండం,వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి, తాండూరు, ఆలేరు, నకిరేకల్‌, హుజురాబాద్‌, పెద్దపల్లి, చెన్నూరు, కోరుట్ల ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 20 స్థానాలకు పైగా అధికారపార్టీ నేతలే బలప్రదర్శనకు దిగుతున్నారు. సర్వేల సంగతి పక్కకు పోయి మారుతున్న సమీకరణాలతో అధికారపార్టీ కార్యకర్తలు, శ్రేణులు అయోమయంలోకి గురవుతున్నారు. టికెట్ల కేటాయింపు తుది నిర్ణయం సీఎం కేసీఆర్‌దే అయినా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులది కూడా కీలకపాత్రే అన్నది బహిరంగ రహస్యమే.  అందుకే కొన్నినియోజకవర్గాల్లో టికెట్‌ నాదంటే నాది అని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే ఈ ముగ్గురు నేతలలో వారికి ఎవరైనా హామీ ఇచ్చారా?  ఇవే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు జనగామలో అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశాంతంగా ఉన్న తన నియోజకవర్గాన్ని కార్పొరేట్‌ పద్ధతిలో అస్థిరపరుస్తున్నారని ఆరోపించారు. తనను ఎదురుకోలేక తన ఇంట్లో చిచ్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడ్చాడు.  ఏనాడూ జనగామ ప్రజలను ఆదుకోని వ్యక్తి ఇప్పుడు నియోజకవర్గంలో తనకే టికెట్‌ వచ్చిందని ఎలా ప్రచారం చేసుకుంటారని ప్రశ్నిస్తూ.. ఆయనపై ధ్వజమెత్తారు. ముత్తిరెడ్డి మాటలు చూస్తే కేసీఆర్‌పై తనకు నమ్మకం ఉన్నదని, ఆయన ఈ కుట్రలన్నీ చూస్తున్నారంటూ.. ఒకవేళ తనకు టికెట్‌ రాకపోతే ఏం జరుగుతుందో అని చెప్పకనే చెప్పారు. 


ఒక్కో నియోజకవర్గంలో నేతల బలప్రదర్శనతో టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసే అవకాశం లేదని తేలిపోయింది. నాగార్జున సాగర్‌ నుంచి తానే పోటీ చేస్తాననని హీరో అల్లు అర్జున్‌ మామ, బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాల ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్‌ పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంతో చంద్రశేఖర్‌రెడ్డి బలప్రదర్శన చేశారు. రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ముత్తిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయా నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో మారుతున్న సమీకరణాలతో అభ్యర్థుల ప్రకటనకు ముందే నాలుగైదు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు  టికెట్ల చిచ్చు రాజేయగా తీరా సమయానికి ఇంకా ఎంతమంది బైటపడుతారన్నది చూడాలి. ఇవాళ వీఎస్‌టీ-ఇందిరాపార్క్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది అన్నారు. సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కానీ హ్యాట్రిక్‌ సంగతి ఏమో గాని కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడుతుందా? నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.

Labels: , ,

Saturday 13 May 2023

కర్ణాటకలో కుదిరింది.. కానీ తెలంగాణలో కష్టమే!


కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమౌతాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దీంతోపాటు సోషల్‌మీడియాలో ఇదే విషయంపై చర్చ జరుగుతున్నది. అయితే నిజంగా తెలంగాణలో ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ కాంగ్రెస్‌ లేదా బేజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా? కేసీఆర్‌ ఢీ కొట్టగలిగే రాష్ట్ర స్థాయి నేత ఇరు పార్టీల్లో ఉన్నారా? అంటే అంత ఈజీ కాదనే సమాధానమే వస్తుంది. కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం, కుల, మత రాజకీయాలు, బొమ్మై సర్కారు అవినీతిపై అక్కడి నేతలు సమిష్టిగా పోరాడారు. అక్కడ సీఎం సీటు కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ల మధ్యే పోటీ ఉన్నది. ఎన్నికల సమయంలో వారిద్దరి మధ్య విభేదాలు కాంగ్రెస్‌ పార్టీ పరిష్కరించింది. వారు కూడా ముందు పార్టీ గెలుపు తీరాలకు తీసుకెళ్లాలి. ఆ తర్వాత సీఎం సీటు సంగతి చూసుకుందామనే అభిప్రాయంతో ముందుకు వెళ్లారు. సిద్ధరామయ్య సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఐదేళ్లు సీఎంగా, అంతకు ముందు రెండుసార్లు డిప్యూటీ సీఎంగా, అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆర్థికమంత్రిగా ఆయనకు రాష్ట్రమంతా పట్టున్నది. బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేసి జైలుకు పంపినా పార్టీ కోసం గట్టిగా డీకే నాయకత్వ ప్రతిభ కూడా కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపునకు ఉపకరించాయి. అలాగే కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడించలేరు, ఆ పార్టీ నేతలే ఓడిస్తారనే నానుడిని కర్ణాటక నేతలు నిజం చేయలేదు. రాహుల్‌ భారత్‌ జోడోయాత్ర ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో ఉన్నది. 


 సంకీర్ణ ప్రభుత్వాలతో విసిగిపోయిన ఆ రాష్ట్ర ప్రజలు సుస్థిర ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. అందుకే పార్టీలు కులం, మతం ఆధారంగా సీట్లు ఇచ్చినా... వాటినే ప్రచారం చేసినా అన్నివర్గాల, అన్ని మతాల ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతోనే గంపగుత్తగా ఓట్లు వేశారు. సాధారణ మెజారిటీనే కాదు భారీ మెజారిటీని కాంగ్రెస్‌కు కట్టబెట్టారు. ప్రజల చైతన్యానికి అనుగుణంగా కర్ణాటక ప్రజాప్రతినిధులు పరిణతి ప్రదర్శించారు. ఐటీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా బెంగళూరు లాంటి సిటీ బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వ మూడేళ్ల  పాలనలో కాలంలో మత రాజకీయాలతో మసకబారింది. దీన్ని కూడా ప్రజలు నిరసించారు. కొవిడ్‌ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చూస్తున్నారు. వాటిని కల్పించడానికి కృషి చేయాల్సిన పాలకులు మతం పేరుతో శాంతిభద్రతల సమస్యలు సృష్టించ చూసిన వారిని కూడా చిత్తుగా ఓడించారు. హిజాబ్‌ వంటి సున్నిత అంశాన్ని తెరమీదికి తెచ్చి వివాదాస్పదం చేసిన  విద్యాశాఖ మంత్రి ఓటమే దీనికి ఉదాహరణ. 


కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉండొచ్చు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దించే పరిస్థితులు మాత్రం లేవు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక సీనియర్లు, బైటి నుంచి వచ్చిన వారు పార్టీలో పెత్తనం చేస్తున్నారనే రచ్చ ఆ పార్టీలో జరుగుతున్నది. ఫలితంగా ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీ వీడగా.. సీనియర్లు రేవంత్‌ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అయితే వాళ్లు పార్టీని గెలిపించగల స్థితిలో లేరు. కానీ వాళ్లను పక్కనపెట్టి అధికారపార్టీపై పోరు చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్లంతా వారి వారి నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న నేతలే. ఎన్నిలకు ఇంకో ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నది. నేతల మధ్య సయోధ్య కుదిరి అంతా ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ అంతర్గత కుమ్ములాటలు ఇలాగే కొనసాగితే అంతిమంగా అది అధికారపార్టీకే మేలు చేస్తుంది. 


ఇక గత ఎన్నికల్లో 100 పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నది. అయితే తెలంగాణలో ఆ పార్టీకి అంత సీన్‌ లేదనే అంటున్నారు. కేసీఆర్‌ లేదా రేవంత్‌రెడ్డి లపై అసంతృప్తితో బీజేపీలో చేరిన వారే ఎక్కువ. అలాంటి వారు ఆ పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయలేరు. అలాగే బండి సంజయ్‌ ఏకపక్ష నిర్ణయాలు కూడా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి నచ్చడం లేదు. కర్ణాటక ఫలితాల తర్వాత కొత్తగా బీజేపీలోకి చేరాలనే ఆలోచన ఉన్నవారు తమ అభిప్రాయం మార్చుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌తో అధినాయత్వంతో రాజీ పడలేక బీజేపీలో కొనసాగలేక సతమతమవుతున్న నేతలు కూడా కాంగ్రెస్‌ వైపు చూడొచ్చు అంటున్నారు.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాల సంగతి ఎలా ఉన్న సంక్షేమ పథకాల అమలు, సాగునీరు, ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా వంటివి ఆపార్టీకి సానుకూల అంశాలు. కేసీఆర్‌ నాయకత్వం కంటే స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉండొచ్చు. గడిచిన రెండు ఎన్నికల్లోనూ కేసీఆర్‌ నాయకత్వానికే ప్రజలు జైకొట్టిన సంగతి రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పై బీజేపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు ఇస్తున్న అవార్డులు, ప్రభుత్వ పనితీరుపై నీతి ఆయోగ్‌ విడుదల చేస్తున్న సూచీల్లో సంతృప్తి వ్యక్తం చేస్తుండటం బీఆర్‌ఎస్‌ కు లబ్ధి చేకూర్చవచ్చు. రాజకీయంగా విభేదాలు ఎలా ఉన్నా రాహుల్‌గాంధీపై అనర్హత వేటును తప్పుపడుతూ.. అందరికంటే ముందుగా కేసీఆరే స్పందించారు. అయితే తెలంగాణ ఇచ్చిన నేతగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రభావం ఇక్కడ ఉండొచ్చు. అంతేకాదు విభజన, విద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు తిరస్కరించారు. అలాంటిది కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తన అసంతృప్తిని, అక్కసు వెళ్లగక్కిన మోడీ ప్రభావం మాత్రం అస్సలే ఉండదు.  ధరణి, ప్రశ్నాపత్రాల లీకేజీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల వంటివి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అయితే ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మలుచుకుని కర్ణాటక ఫలితాలను ఇక్కడ కూడా పునరావృతం చేయాలంటే  కాంగ్రెస్‌ పార్టీ నేతలు బాగా కష్టపడితే తప్పా అది సాధ్యం కాదు. 

Labels: , , , , , , ,

Friday 12 May 2023

కాంగ్రెస్‌కే పట్టం కట్టిన కన్నడ ప్రజలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు:


-మోడీ మానియా పనిచేయలేదు

-బజరంగ్‌దళ్‌ నినాదం నిలబెట్టలేదు

-భావోద్వేగాలు ఓట్లు రాల్చలేదు

-ఉచితాలు దేశాభివృద్ధికి నిరోధకాలన్న మోడీ కర్ణాటకలో అనేక ఉచిత హామీలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు

-తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ, మూడేళ్లకు పైగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సాధించిన ప్రగతిని చెప్పలేని పరిస్థితి  

-ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.

-


అందుకే కమలం పార్టీని కాదని కాంగ్రెస్‌కే పట్టం కట్టిన కన్నడ ప్రజలు 

Labels: , , , , , ,

పవన్‌ నిలకడలేని నిర్ణయాలు.. ప్రశ్నార్థకంలో ఆ పార్టీ మనుగడ


పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలకు ముందు కూటములుగా ఏర్పడటం, పొత్తులు పెట్టుకోడం సహజమే. కానీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే పొత్తులు పెట్టుకుంటామనడమే ఆశ్చర్యంగా ఉన్నది. ఆయన పొత్తులపై మాట్లాడుతూ..' వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించి  అధికారాన్ని చేజిక్కించుకోవడం, కూటమి ద్వారా తిరిగి ప్రజలకు దక్కాలి' అన్నారు. పొత్తులపై కొందరు అంగీకరించకపోవచ్చని, వాస్తవ గణాంకాలు చూపి ఒప్పిస్తామని, ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చిన తర్వాత ఇదే చెప్పాం. తన నిర్ణయం మారదు' అన్నారు.


అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే పవన్‌ వ్యాఖ్యల ప్రకారం చూస్తే.. వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలి. మొత్తం 175 స్థానాల్లో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే సీట్ల విషయంలో అన్నిపార్టీలు రాజీపడాలి. జనసేన అధినేతగా పవన్‌ ఆధేశాల ప్రకారం వాళ్ల నేతలు అంగీకరిస్తారు అనుకుందాం. మరి బీజేపీ, టీడీపీ ల నేతలు పొత్తులో భాగంగా సీట్లు త్యాగాలు చేయడానికి సిద్ధపడుతారా? మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏపీలో బీజేపీ కంటే వామపక్షాల బలమే ఎక్కువ. విపక్ష కూటమిలో బీజేపీ ఉంటే వామపక్షాలు వారితో కలిసి వస్తాయా? భిన్న సిద్ధాంతాలు, భావజాలాలు ఉన్న పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని, అందుకు కొంతమంది అంగీకరించకున్నా ఒప్పిస్తానని పవన్‌ అనడం హాస్యాస్పదం. 


ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందని ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. కానీ ఐదేళ్లలో బాబు ఏం చేశారో అనుభవంలో ఉన్నదే. అలాగే టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలతో విసిగిపోయిన జనాలు జగన్‌కు జై కొట్టారు. గడిచిన నాలుగేళ్లుగా ఆయనేం చేస్తున్నారో చూస్తున్నాం. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వంటివి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వం రావాలనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఉన్నది. ఆ అవకాశం పవన్‌ పార్టీ లేదా ఇతర పార్టీలకు ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందే పొత్తుల కోసం పాలకులాడుతున్న పవన్‌ తానకు సీఎం కావాలనే కోరిక లేదని, ఆ పదవి వరించి రావాలి కానీ.. మనం కోరుకుంటే అయ్యేది కాదన్నారు. దీంతో పవన్‌ లక్ష్యం బాబు ను మళ్లీ సీఎం చేయడమే అన్నది స్పష్టమైంది. దీన్నిరాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జనసేన, బీజేపీ అంగీకరించినా ప్రజలు దాన్ని ఆమోదిస్తారా? అన్న గ్యారెంటీ ఏమీ లేదు. అంతేకాదు పవన్‌ టీడీపీకి బీ టీమ్‌ అన్న వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. రాజకీయాల్లో పవన్‌ నిలకడలేని నిర్ణయాలు ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థం చేస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ప్రజల ఆకాంక్షలు తొమ్మిదేళ్లైనా ఇప్పటికీ నెరవేరలేదు. ఈ వైఫల్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల పాత్ర ఉన్నది. కానీ పవన్‌ ఈ విషయాన్ని మరిచి తిరిగి బీజేపీ, టీడీపీ పొత్తులు పెట్టుకునేలా తాను కృషి చేస్తానని చెబుతుండటంపై ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. అందుకే వైసీపీ నేత సజ్జల పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ నీటి బుడగ అని,చంద్రబాబు పల్లకి మోయడమే ఆయన నైజం అని,బలం లేదని పవన్‌ అంగీకరించారని కౌంటర్‌ ఇచ్చారు. పొత్తులపై పవన్‌కు అంత తొందర ఎందుకో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 



Labels: , , , , , ,

Wednesday 10 May 2023

కర్ణాటక కాంగ్రెస్‌దే!



దక్షిణాది భారతంలో బీజేపీకి అధికారం కట్టబెట్టిన కర్ణాటక ఎన్నికలవైపు దేశమంతా ఆసక్తిగా చూసింది. ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఈ ఏడాది జరగనున్నమధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సత్తా చాటాలని బీజేపీ భావించింది. కర్ణాటక ఎన్నికల చరిత్ర చూస్తే గత 25 ఏళ్లలో 1999, 2013 లోనే ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈసారి ఆ రికార్డులను బద్దలు కొట్టాలని కమలనాథులు భావించారు. అయితే బీజేపీకి చెక్‌ పెట్టి ఈ విజయం ద్వారా ఈ ఏడాది జరగనున్న ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, మధ్యప్రదేశ్‌లోనూ విజయానికి బాటలు వేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని 2024 లోక్‌సభ ఎన్నికలకు గెలుపు దారులు వేయాలని కాంగ్రెస్‌ గట్టిగా కొట్లాడింది. ప్రధానంగా బీజేపీ వైఫల్యాలపైనే ఫోకస్‌ పెట్టింది. అవినీతి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా హస్తం పార్టీ ఎంచుకున్నది. ప్రధానంగా నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపినట్టు ఎగ్జిట్‌పోల్‌ అంచాలను బట్టి తెలుస్తోంది. బీజేపీలో నెలకొన్న అంతర్గత కలహాలు, కొంతమంది సీనియర్లకు పార్టీ టికెట్లు నిరాకరించడంతో వారంతా తిరుగుబాటు చేశారు. ఆ ప్రభావం కూడా ఎన్నికల్లో ఉంటుందని అంటున్నారు. అలాగే ఎన్నికలకు ముందు ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేసి లింగాయత్‌, వొక్కలిగ సామాజికవర్గాలకు పంచినా అవి బీజేపీకి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు రాజకీయ విశ్లేకులు చెబుతున్నారు. గుజరాత్‌లో  ప్రధాని మోడీ తానే సీఎం అభ్యర్థిని అన్నట్టు చేసిన ప్రచారం ఇక్కడ కూడా బీజేపీ అమలు చేసింది.  స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి అంతా తానే అన్నట్టు 18 భారీ బహిరంగ సభలు, 6 రోడ్‌ షోలు చేసినా బీజేపీని విజయతీరాలకు చేర్చలేవు అని సర్వేల సారాంశం.  గుజరాత్‌లో వలె ఇక్కడ కూడా కొత్తవారికి టికెట్లు ఇచ్చిన ప్రయోగం విఫమౌతుందని తెలుస్తోంది. 

ఇక పాతమైసూర్‌ ప్రాంతంలో గట్టి పట్టున్న జేడీఎస్‌ కు ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే పోలింగ్‌ జరుగుతున్న సమయంలోనే జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి  ఎన్నికల ఫలితాలపై సంచలన కామెంట్లు చేశారు. ఈ ఎన్నికలు జేడీఎస్‌కు పెద్ద దెబ్బ అని మా పార్టీకి 25 సీట్లకు మంచి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. 

సర్వేల శాస్త్రీయత ఎంత అన్న చర్చను పక్కనపెడితే ఎగ్జిట్‌పోల్స్‌లో చాలావరకు కాంగ్రెస్‌ పార్టీనే మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందని తేల్చాయి. ఇండియాటుడే, టైమ్స్‌ నౌ, పీపుల్స్‌ పల్స్‌, సీ ఓటర్‌ లాంటి సర్వేలు కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ  మార్క్‌ను దగ్గరలో ఉంటుందని పేర్కొన్నాయి. 224 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అన్నది ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నది. మే 13న కర్ణాటక ఫలితాలు వెల్లడికానున్నాయి.


ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఇవే


రిపబ్లిక్‌ టీవీ సర్వే: బీజేపీ 85-100, కాంగ్రెస్‌  94-108, జేడీఎస్‌ 24-32, ఇతరులు 2-6

టీవీ9 భారత్‌వర్ష్‌ సర్వే: బీజేపీ 88-98,  కాంగ్రెస్‌ 99-109, జేడీఎస్‌ 21-26,  ఇతరులు 0-4

జీ న్యూస్‌ సర్వే: బీజేపీ 79-94,  కాంగ్రెస్‌ 103-118, జేడీఎస్‌ 25-33,  ఇతరులు 2-5

పోల్‌ స్ట్రాట్‌ సర్వే: బీజేపీ 88-98,  కాంగ్రెస్‌ 99-109, జేడీఎస్‌ 21-26,  ఇతరులు 0-4

ఇండియా టుడే: కాంగ్రెస్‌-122-140, బీజేపీ- 62-80, జేడీఎస్‌-20-25, ఇతరులు 0-3

టైమ్స్‌ నౌ : కాంగ్రెస్‌- 106-120, బీజేపీ- 78-92, జేడీఎస్‌-20-26, ఇతరులు 2-4

సీ ఓటర్‌ : కాంగ్రెస్‌- 100-112, బీజేపీ- 83-95, జేడీఎస్‌-21-29, ఇతరులు 2-6

పీపుల్స్‌ పల్స్‌ : కాంగ్రెస్‌- 107-119, బీజేపీ- 78-90, జేడీఎస్‌-23-29, ఇతరులు 1-3

జన్‌కీ బాత్‌ : కాంగ్రెస్‌- 91-106, బీజేపీ- 94-`117, జేడీఎస్‌-14-24


Labels: , , , , , , , ,

Saturday 6 May 2023

ఎన్నికల పోరుకు ముందే పొంగులేటికి అనేక సవాళ్లు




బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారా? ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక కన్ఫ్యూజన్‌లో ఉన్నారా? కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమన్న ఆయన ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నారా? అంటే ఔననే అంటున్నారు. ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగానే బరిలోకి దిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వనని శపథం చేసిన ఆయన ఏ పార్టీవైపు అడుగువేయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు.

ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల్లో సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. పది నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానం గెలుపే లక్ష్యంగా కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో మీడియా అంతా ఆయనఫైనే ఫోకస్‌ పెట్టింది. కానీ ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోబుతున్నారని వార్తలు రావడం, మరోవైపు ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని బృందంతో ఆయన భేటీ కావడంతో పొంగులేటికి ఆయన అనుచరుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయని సమాచారం. వామపక్ష భావజాల ప్రభావం ఉన్న ఆ జిల్లాలో బీజేపీకి అంతగా బలం లేదు. కానీ ఆయన బీజేపీ నేతలతో సమావేశం కావడంతో ఇప్పటివరకు ఆయనపై ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా పోయింది అంటున్నారు. అలాగే ఆయనను బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేసిన తర్వాత ఏదో ఒక పార్టీలో చేరితో పరిస్థితి ఇక్కడిదాకా రాకపోయిది. కానీ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ ఇలా అన్ని పార్టీల నేతలతో టచ్‌లో ఉండటంతో పొంగులేటికి తాను రాజకీయంగా అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నది.

మరోవైపు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రచారం జరుగుతున్నది. వాళ్లంతా వేరే పార్టీ పెట్టి ఒకే గొడుగు కిందికి రావాలనే ఆలోచనతో ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే ఖమ్మంలో పొంగులేటి తో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి సమావేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని స్పందన అడిగితే తనకు సమాచారం లేదన్నారు. దీన్నిబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల నుంచి బీజేపీలో చేరిన వారికి మధ్య సఖ్యత లేదనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  బీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీలో తాను చేరుతానని గతంలో ప్రకటించారు. అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలే కాదు అదికారపార్టీ కూడా  కాంగ్రెస్‌ పార్టీనే అంంటున్నది.  మరి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు చెబతున్నారు కదా అని కొందరు అంటుండవచ్చు. అయితే   రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి అని అడిగితే రాజకీయంగా అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే చెబుతారు. దానికి పెద్దగా ఆలోచన కూడా అక్కరలేదు. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  తాను పార్టీలో చేరాలనేది ఆయన కార్యకర్తల అభిప్రాయం మేరకు, వ్యక్తిగత ఆలోచన మేరకు ఏదైనా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉన్నది. అయితే బీజేపీ సిద్ధాంతాలు నచ్చకున్నా బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ ను వీడి  తమ వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా కాషాయ తీర్థం పుచ్చుకుంటే ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. పొంగులేటి కూడా వారి బాటలోనే నడిస్తే రాజకీయంగా బలోపేతం కంటే ఇబ్బందులే అధికంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ఎందుకంటే ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ వీడిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యం అని తేలడంతో ఆయన గ్రాఫ్‌ 75 శాతానికిపైగానే ఉన్నది. ఆయన కాషాయ కండువా కప్పుకున్న తర్వాత పోలింగ్‌ తేదీ నాటికి చాలా తగ్గిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉదంతాన్నికూడా ఉదాహరణగా చెబుతున్నారు.

Labels: , , , , , , , ,

Saturday 22 April 2023

కౌశిక్‌ కంటే గెల్లుకే గ్రౌండ్‌ రిపోర్ట్‌ బాగుందట!


తెలంగాణలో ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం కూడా లేదు. అప్పుడే ప్రధాన పార్టీలలో సార్వత్రిక ఎన్నిక సందడి మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు కేసీఆర్‌ కూడా సిట్టింగులందరికీ తిరిగి టికెట్లు ఖాయమన్నారు. అయితే రాష్ట్రంలో కొన్నిస్థానాలప ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే అన్నిపార్టీలు ఒకటిరెండుసార్లు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. సర్వేలు చేయిస్తూ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి.  ఖమ్మం జిల్లాలో పొంగులేటి బీఆర్‌ఎస్‌ను సవాల్‌ చేస్తుండగా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌లకు చెక్‌ పనిలో బీఆర్‌ఎస్‌ ఉన్నది. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో అధికారపార్టీ అన్ని అస్త్రాలను ప్రయోగించినా ఈటలపై సానుభూతి పనిచేసింది. గతంలో కంటే మెజారిటీ తగ్గినా.. వచ్చే ఎన్నికల్లో ఈటల గెలుపు అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.  అధికారపార్టీ కౌశిక్‌ను హుజురాబాద్‌లో పనిచేసుకోవాలని, ఎనిమిదినెలలు నియోజకవర్గంలోనే విస్తృతంగా పర్యటించాలని సూచించింది. 

అయితే ఈటల రాజేందర్‌ను కౌశిక్ కట్టడి చేయగలరా? కేసీఆర్‌ అంచనాలను ఆయన అందుకుంటారా? అక్కడ కాంగ్రెస్‌ పార్టీ బరిలో ఉంటుండటంతో ఈ ముక్కోణపు పోటీలో ఎవరు లాభపడుతారు? ఎవరు నష్టపోతారనే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మరో విద్యార్థి నేత బల్మూరి వెంకట్‌ పోటీలో ఉండొచ్చు. కాబట్టి కౌశిక్‌రెడ్డి దూకుడు వ్యవహారశైలి బీఆర్‌ఎస్‌ను గెలుపు బాటలో తీసుకెళ్తుందా? అంటే అంత తేలిక కాదంంటున్నారు. ఈటల రాజేందర్‌ ఉద్యమకారుడిగానే అధికారపార్టీ నేతలతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా భావిస్తుంటారు.  ఉద్యమకాలంలో కౌశిక్‌ వ్యవహరించిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. రాజేందర్‌ కూడా ఉప ఎన్నిక ప్రచారంలో అధికారపార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై విమర్శలు చేయకుండా కౌశిక్‌ను, మంత్రి హరీశ్‌రావుపై ధ్వజమెత్తిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థి ఉద్యమనేతగా గెల్లు ఎంపికపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. పైగా  ఉద్యమకారుడికి అవకాశం దక్కిందని నిత్యం కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచిన వాళ్లు కూడా గెల్లుకు టికెట్‌ దక్కడాన్ని స్వాగతించారు. అయితే నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాబల్యవర్గంగా ఉన్న సామాజిక సమీకరణాల దృష్ట్యా కౌశిక్‌కు ఈసారి ఈటలపై పోటీలో నిలబెట్టాలని పార్టీ అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించి ఉండొచ్చు. కానీ అది ఈటలకే మేలు చేస్తుందనే వాదనలు లేకపోలేదు. 


గెల్లుకు ఈటల, కౌశిక్‌ వలె అంగబలం, అర్థబలం లేకపోవచ్చు.కానీ నియోజకవర్గంలో ఆయనపై సానుభూతి వ్యక్తమౌతున్నది. బీఆర్‌ఎస్‌ తరఫున కౌశిక్‌ కంటే గెల్లుకే గ్రౌండ్‌ రిపోర్ట్‌ అనుకూలంగా ఉన్నదట. ఓ సీనియర్‌ జర్నలిస్టు దీనిపై స్పందిస్తూ.. గెల్లు కింది నుంచి ఎదిగివచ్చిన బలహీనవర్గాలకు చెందిన నాయకుడు. ఆయన మరో అవకాశం ఇస్తే హుజురాబాద్‌లో అధికారపార్టీకి గెలుపు ఖాయమని కచ్చితంగా చెప్పకున్నా... సానుకూల అంశాలు అనేకం ఉన్నాయి అంటున్నారు. ఎన్నికలకు ఇంకో ఎనిమిది నెలల సమయం ఉన్నది. కాబట్టి అప్పటివరకు పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడే అంచనాకు రావడం సరికాదంటున్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఆయన టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. 

Labels: , , , , , , , ,

Wednesday 8 March 2023

ఎన్నికల తర్వాత ఇక్కడ ఏక్‌నాథ్‌ షిండే ఎవరో?


ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో దాదాపు 119 లోక్‌సభ స్థానాలు ఉండటమే దీనికి కారణం. అందుకే ఈశాన్యరాష్ట్రాలైన నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయ మొదలు దక్షిణాది రాష్ట్రాల్లో కమలం పార్టీ వికాసానికి దోహదపడిన కర్ణాటక తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాడే ఉండనున్నాయి. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి కర్ణాటక కంటే తెలంగాణకే తన ప్రధాన్యం అని రాష్ట్ర బీజేపీ కీలక నేతల భేటీలో స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే బీజేపీ అధిష్ఠానం ఇప్పటి నుంచే తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నది.


ఇక నుంచి నా దృష్టి అంతా తెలంగాణపైనే. ఆ రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా మీరంతా ముందుకు సాగాలి. పాత, కొత్త నేతలనే అనే తేడాలు వద్దు. అభిప్రాయభేదాలు ఉంటే పరిష్కరించుకోండి. చేరికలను ప్రోత్సహించండి అని ఆయన రాష్ట్ర  నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ఇంకా ఏడు నెలల సమయం ఉన్నది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సభ, ఉమ్మడి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించారు. 


కర్ణాటకలో ఆ పార్టీ పరిణమాలు బీజేపీ అధిష్ఠానాన్ని కలవరపరుస్తున్నాయి. పైకి అక్కడ కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా తెలంగాణపై మోడీ-షాలు దృష్టి సారించారు అంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ జరిగే నష్టాన్ని తెలంగాణలో పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయని విధంగా చేరికల కమిటీ ఒక ఏర్పాటు చేసి దానికి ఈటల రాజేందర్‌ కన్వీనర్‌గా నియమించింది. ఆయన నేతృత్వంలో పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని భావించింది. కానీ వారు ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోగా అధికార పార్టీ పై అసంతృప్తితో బీజేపీ చేరిన నేతలు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతిలతో పాటు తుల ఉమ వంటి నేతలు రాష్ట్ర నాయకత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. పాత, కొత్త తేడా ఉండొద్దని అమిత్‌ షా చెప్పినా కొత్త వారికి ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన నేతలకే తగిన ప్రాధాన్యం లేదనే చర్చ జరుగుతున్నది. ఆ పార్టీలో నేతల మధ్య అంతర్గత అభిప్రాయభేదాల ఫలితంగా చాలామంది పార్టీలో చేరకపోవడానికి ముఖ్యకారణమని పార్టీ అధిష్టానం గుర్తించింది. అందుకే దీనివల్ల పార్టీలో చేరికలు లేకపోగా పార్టీకి నష్టం చేస్తున్నదని అంచనా వేసింది. పేరుకు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారని పత్రికల్లో వచ్చినా.. నేతల మధ్య ఉన్న అంతరాలు పార్టీ పుట్టి ముంచుతుందని దాన్ని సరిచేయాలని అమిత్‌ షా సూచనలు చేశారు. 


తెలంగాణలో బీజేపీ గెలుపు అంత తేలిక కాదని వారికీ తెలుసు. అయితే గతంలో గెలిచిన నాలుగు లోక్‌సభ స్థానాలు తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు మరో మూడు నాలుగు స్థానాలు దక్కించుకోవాలన్ని ఆ పార్టీ పెద్దల వ్యూహం. మొత్తం పదిహేడు స్థానాల్లో సగం తమ ఖాతాలో వేసుకోవాలని కమలనాథులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నా 20-30 స్థానాల్లో పాగా వేయవచ్చు అని, ఒకవేళ రాష్ట్రంలో హంగ్‌ లాంటి పరిస్థితి వస్తే మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ను ముందుపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ కూడా అదే వ్యూహాన్ని అమలుచేయవచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఆ ఏక్‌నాథ్‌ షిండే ఇక్కడ ఎవరు అవుతారు అన్నది తేలుతుంది.

Labels: , , , , , , ,

అన్నిపార్టీల్లో సినీ సందడి.. అందుకేనా?



తెలంగాణలో  2014లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఉద్యమకారులు, తెలంగాణ తెచ్చిన పార్టీ, ఇచ్చిన పార్టీ అనే అంశాల ప్రాతిపదికన జరిగాయి. 2018లో అధికారపార్టీ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా ప్రచారాస్త్రాలుగా.. ప్రభుత్వ వైఫల్యాలే అజెండా మహాకూటమి బరిలోకి దిగాయి. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలు గత రెండుసార్ల కంటే భిన్నంగా జరగబోతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీలోసిట్టింగులందరికీ తిరిగి సీట్లు ఇస్తామని  ఇప్పటికే సీఎం ప్రకటించారు. అయితే 20-30 మంది సిట్టింగులను మారిస్తేనే బీఆర్‌ఎస్‌ వంద సీట్లకు చేరువ అవుతుందని ఆ మధ్య మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. అవి ఆయన యాధృచ్ఛికంగా చేశారా? లేక పార్టీ అధిష్ఠానం ఆలోచనా అనేది తెలియదు. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీల తరఫున పోటీ చేయాలని భావిస్తున్న సినీ ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరుగుతున్నది. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు అన్నిపార్టీలు సినీ సొబగులు అద్దనున్నాయి. 

ఇదే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 


దీనికి కారణం లేకపోలేదు. గత రెండు పర్యాయాలు అధికారపార్టీని ప్రజలు ఆదరించారు. కానీ ఈసారి ఆ పరిస్థితి తిరిగి పునరావృతమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్‌ఎస్‌, ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌, ఎన్నికల్లో గెలువాల్సిందేనని బీజేపీ అధిష్ఠానాలు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. దీంతో సిట్టింగ్‌లతో పాటు కొత్తగా టికెట్‌ ఆశిస్తున్న సినీ ప్రముఖులు కూడా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఆయా పార్టీల అధినేతలను, ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.  సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌, విజయశాంతి, బాబుమోహన్‌, నితిన్‌ జీవిత, దర్శకుడు ఎన్‌. శంకర్‌, నిర్మాతలు దిల్‌రాజు, తాళ్లూరి రామ్‌, బిగ్‌బాస్‌ ఫేం కత్తికార్తికలు టికెట్‌ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. ఈసారి  ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా వీరికి టికెట్లు ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. 


బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ప్రకాశ్ రాజ్‌ గత లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్‌ బెంగళూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరకున్నా తన వాదనలు వినిపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఆ మధ్య మహారాష్ట్రకు వెళ్లారు. అప్పటి సీఎం ఉద్ధవ్‌ఠాక్రే తో పాటు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలిశారు. ఆ సమయంలో సీఎం వెంట ప్రకాశ్‌రాజ్‌ ఉండటం చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్‌ వివిధ రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తో కలిసి పోటీచేస్తామని కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాశ్‌రాజ్‌ కర్ణాటకలో ఏదో అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేక ఎంపీగా పోటీ చేస్తారా? అన్నది త్వరలో తేలనున్నది. నిర్మాత దిల్‌రాజు నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లి వాసి. ఆయన బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అధికార పార్టీ అసంతృప్తులతో పాటు సినీ ప్రముఖులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అప్పుడెప్పుడో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు హీరో నితిన్‌ ఆయనతో సమావేశమయ్యారు. దీంతో ఆయన ఆపార్టీ నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారనే చర్చ కొంతకాలంగా జరుగుతున్నది. ఇక విజయశాంతి బీజేపీ మహిళా విభాగంలో జాతీయస్థాయి నాయకురాలిగా పనిచేశారు. ఆమె టీఆర్‌ఎస్‌ తరఫున 2009లో మెదక్‌ ఎంపీగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆమె 2014లో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బాబు మోహన్‌ కూడా 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి ఆందోల్‌ లో పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో ఆయను టికెట్‌ ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేసి బీజేపీలోకి వెళ్లారు. తిరిగి ఆయన ఆందోల్‌ నుంచే పోటీ చేయనున్నారు. దాదాపు అన్నిపార్టీలు తిరిగి వచ్చిన జీవిత ఈసారి బీజేపీ తరఫున జహీరాబాద్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. 


ఖమ్మం జిల్లాకు చెందిన సినీ నిర్మాత తాళ్లూరి రామ్‌ చుట్టాల అబ్బాయి, నేలటికెట్‌, డిస్కోరాజా వంటి సినిమాలు నిర్మించారు. ఆయన జనసేన తరఫున ఖమ్మం పార్లమెంటు లేదా అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారు. దర్శకుడు ఎన్‌. శంకర్‌  2014లో కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆయనకు మిర్యాలగూడ నుంచి అవకాశం వచ్చినా వదులుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన  ఆయన ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఫేం, టీవీ యాంకర్‌ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఆమె అదే స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. జైబోలో తెలంగాణ సినిమాలో నటించిన రోషన్‌ బాలు గత ఎన్నికల సమయంలో ముషీరాబాద్‌ టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఈసారి మరోసారి అదే నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరఫున టికెట్‌ దక్కించుకోవడానికి యత్నిస్తున్నారు. 

Labels: , , , , ,

అధికారపార్టీపై పొంగులేటి పోరాటం ఫలించేనా?



తెలంగాణలో ఎన్నికలకు ఇంకా దాదాపు తొమ్మిది నెలల సమయం ఉన్నది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్రలు, ప్రచారాలు మొదలుపెట్టాయి. ఖమ్మం జిల్లాలో అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ప్రధాన పార్టీలతో సమంగా మరోమాటలో చెప్పాలంటే ఇంకో అడుగు ముందుకు వేశారని చెప్పవచ్చు. కొంతకాలంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికారపార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆయన పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జెండా ఏదైనా కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ అజెండా అన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపించడమే తమ లక్ష్యమన్నారు. 


నిజానికి 2014లో, 2018లోనూ ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది ఒక్క సీటే. మొదటిసారి ఎన్నికల్లో కొత్తగూడెం సీటు కాగా, రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానంలోనే ఆ పార్టీ గెలిచింది. 2019లో కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే. పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌లు రాజకీయ సమీకరణాల్లో భాగంగా వాళ్లంతా బీఆర్‌ఎస్‌లోకి జంప్‌  అయ్యారు.  టీడీపీ గత ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావులు కూడా బీఆర్‌ఎస్‌లో కలిసిపోయారు. ఇక వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్యా రాములు నాయక్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. వాళ్ల చేతిలో ఓడిపోయిన అధికారపార్టీ కి చెందిన నేతలు తమను పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదని అప్పుడప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అయినా వారికి పార్టీ నుంచి ఎలాంటి హామీలు దక్కలేదు. దీంతో చాలా కాలం మౌనంగా ఉన్నా పొంగులేటి ఎప్పుడైతే అదికారపార్టీతో ఢీ అంటే డీ అని సవాల్‌ చేశారో వారందరికీ ఒక వేదిక దొరికినట్టైంది. దీంతో పొంగులేటి అంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపడమే తమ లక్ష్యమని అదికారపార్టీ నేతలను ఉద్దేశించి చేసినవే. 


పొంగులేటి బీఆర్‌ఎస్ కు దూరంగా ఉంటూ తన అనుచరులతో కలిసి స్వతంత్రంగానే ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరకపోయినా ఎన్నికల అనంతరమో లేక ఎన్నికలు సమీపించే సమయానికి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఆయన అడుగులు ఏ పార్టీ వైపు అన్నది క్లారిటీ లేదు. కానీ ఆయన కుదిరితే బీజేపీ లేదా వైఎస్‌ షర్మిల వెంట నడుస్తారనే చర్చ ఉన్నది. ఎందుకంటే బీజేపీ అధిష్టానంతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్టు సమాచారం. అలాగే పొంగులేటి బీఆర్‌ఎస్‌ నేతలను, కేసీఆర్‌ను సవాల్‌ చేసిన అనంతరం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నట్టు మాదే అధికారం అనే పరిస్థితులేమీ ప్రస్తుతం కనిపించడం లేదు. అందుకే పొంగులేటి ఏ పార్టీ వైపు వెళ్లకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఖమ్మం ఎంపీ సీటు తో పాటు, పది అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచార ప్రభావం ఎంత ఉంటుంది? ఆయన అంటున్నట్టు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్తారా? లేక ఆయన వ్యూహం బెడిసి కొట్టి విపక్ష పార్టీలకే నష్టం కలుగుతుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Labels: , , , , , ,

Sunday 5 February 2023

అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ అంటూ... కేసీఆర్‌


బీజేపీ, కాంగ్రెస్‌ యేతర ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్‌ ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉన్నదనే నినాదంతో దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంలతో ఆయన సమావేశమై చర్చించారు. మహారాష్ట్రకు వెళ్లి ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత ఎన్సీపీతోనూ దీనిపై మాట్లాడారు. కానీ ఆ సమయంలో వారు కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ యేతర కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. బహుశా అప్పుడే ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారు. కాంగ్రెస్‌, బీజేపీలో కలిసి పనిచేసిన పార్టీలు, లేదా ఆ పార్టీలతో కలిసి అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తనతో కలిసి రాకపోవచ్చునని అభిప్రాయానికి వచ్చి ముందుగా తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలపై ఫోకస్‌ చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర నాందేడ్‌లోనూ తెలుగు మాట్లాడేవాళ్లు ఎక్కువే ఉంటారు. 


మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..  చిత్తశుద్ధితో కృషి చేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. దేశ పరిస్థితులను చూసిన తర్వాత టీఆర్‌ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మార్చాం. దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్‌ఎస్ ను ఏర్పాటు చేశాం. అందుకే అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌.. నినాదంతో బీఆర్‌ఎస్‌ వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ఎనిమిదేళ్ల కిందట తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవని, క్రమంగా అన్ని సమస్యలను అధిగమంచామని అన్నారు. తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఎకరానికి రూ. 10 వేల చొప్పున  రైతుబంధు ఇస్తున్నాం. రైతు ఏ కారణం చేత చనిపోయినా రూ. 5 లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇస్తున్నాం. తెలంగాణలో సాధ్యమైనవి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతా రావాల్సి ఉన్నదన్నారు. తెలంగాణ తరహా పథకాలు రావాలంటే రైతు సర్కార్‌ రావాలి. వచ్చే పరిషత్‌ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే రెండేళ్లలోనే మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్‌ అందిస్తామన్నారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, కిసాన్‌ సర్కార్‌ రావాలన్నారు. తెలంగాణలోని దళితబంధు దేశమంతా అమలు కావాలన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామన్నారు. మహారాష్ట్ర, దేశమంతా బీఆర్‌ఎస్‌ కిసాన్‌ కమిటీలు వేస్తాం. 


54 ఏళ్లు కాంగ్రెస్‌...16 ఏళ్లు బీజేపీ పాలించి.. ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ చిన్న దేశంలో ఉన్నది. సువిశాల భారత్‌లో కనీసం  2 వేల టీఎంసీల  రిజర్వాయర్‌ ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య కేంద్రం జలవివాదాలను పరిష్కరించడం లేదన్నారు. ట్రైబ్యునళ్ల పేరుతో  ఏళ్ల కొద్దీ జలవివాదాలు పెండింగ్‌లో పెడతారని మండిపడ్డారు. 

Labels: , , , , , ,

Friday 3 February 2023

కర్ణాటకలో ప్రధాన పార్టీలకు కొత్త కూటముల సవాల్‌



మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈసారి ఎలాగైనా  పార్టీని అధికారంలోకి తేవడానికి కృష్టి చేస్తున్నది. భారత్‌ జోడో యాత్రలో ఆ రాష్ట్ర నాయకత్వం, స్థానిన నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణాదిలో బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ఆపార్టీకి ఇప్పటికీ పెద్ద దిక్కు మాజీ సీఎం యడ్యూరప్పనే. కొన్నిరాజకీయ పరిణామాలతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యడ్యూరప్ప సీఎం అయ్యారు. అయితే బీజేపీ అధిష్టానం అనూహ్యంగా ఆయనను దించి బసవరాజు బొమ్మైని సీఎంగా చేసింది. నాటి నుంచి ఆయన  అసంతృప్తితోనే ఉన్నారు. ఆయనను సంతృప్తిపరచడానికి యడ్డీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించింది. 


మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డిని బీజేపీ కొంతకాలంగా పక్కన పెట్టడంతో పార్టీ అధిష్టాన వైఖరిపై అసంతృప్తితో  కొద్ది రోజుల కిందట ఆయన బీజేపీకి గుడ్‌ బై చెప్పి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ ద్వారా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. గాలిని  బళ్లారి ప్రాంతంలో గట్టి పట్టున్నది. వచ్చే ఎన్నికల్లో కొప్పల్‌ జిల్లాలోని గంగావతి స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రమంతా పర్యటిస్తానని అన్నారు. 


కర్ణాటక కమలనాథులలో అంతర్గత ముసలం, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, గాలి జనార్దన్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టడం వంటివి బీజేపీ అధిష్టానాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. దీంతో ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి, ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటక రాష్ట్రానికి పెద్దపీట వేసింది. 

ఆ రాష్ట్రంలో కరువు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి అప్పర్‌ భద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించింది అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 


ఇదిలా ఉండగా.. నీటిపారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో తనకు మానీ ప్రధాని దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆరే స్ఫూర్తి అని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఇటీవల రాయచూర్‌లో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీళ్లు అందిస్తున్న కేసీఆర్‌ తనకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, మిషన్ భగీరథ  కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌కు ఏమాత్రం తీసిపోదని తెలిపారు. తనకు మరోసారి అవకాశం కల్పిస్తే తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ప్రకటించారు. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 


ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆవిర్బావ సభకు కుమారస్వామి హాజరు కాలేదు. దీంతో బీఆర్‌ఎస్‌కు, జేడీఎస్‌కు మధ్య దూరం పెరిగిందా? అనే చర్చ జరిగింది. కానీ కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పేరును అధికారికంగా ప్రకటించిన రోజే వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటిమి కోసం కేసీఆర్‌ మహారాష్ట్రకు వెళ్లి అక్కడ ఉద్ధవ్‌ఠాక్రే (అప్పుడు ఆయన సీఎం), ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లతో భేటీ అయ్యారు. అప్పుడు కేసీఆర్‌ వెంట వారిలో  సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఉన్నారు. ఆయన బీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా పనిచేస్తారని, కర్ణాటకలో పార్టీ విస్తరణ కోసం పనిచేస్తారని, ఆయనకు కేసీఆర్‌ కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. తాజాగా మాజీ సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌-జేడీఎస్‌ కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. గడిచిన మూడు నెలలగా కర్ణాటకలో జరుగుతున్నరాజకీయ పరిణామాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీని ఓటు బ్యాంకు గండికొడుతుంది? ఏ పార్టీకి మేలు చేస్తుంది అనేది అక్కడి రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Labels: , , , , , , ,

Monday 30 January 2023

సందిగ్ధత వీడింది.. స్పష్టత వచ్చింది


తెలంగాణ ప్రభుత్వం 2023-24 ఏడాదికి ప్రవేశపెట్టే బడ్జెట్‌ అంశం, గవర్నర్‌ ప్రసంగంపై స్పష్టత వచ్చింది. బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. మధ్యాహ్నం విచారణ జరపడానికి సీజే ధర్మాసనం అంగీకరించింది. ఈ సందర్భంగా గవర్నర్‌కు కోర్టు నోటీసు ఇవ్వగలదా? ఆలోచించుకోవాలని పేర్కొన్నది.  గవర్నర్‌ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చా? కోర్టులది మితిమీరిన జోక్యం అని మీరే అంటారు కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఏం జరగనున్నదనే ఉత్కంఠ నెలకొన్నది. 


బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశం,  గవర్నర్‌ ప్రసంగంపై హైకోర్టులో విచారణ జరిగింది. సీజే ధర్మాసనం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు దుష్యంత్‌ దవే, అశోక్‌ ఆనంద్‌లు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. చర్చల్లో పరిష్కారం లభించిందని ఇరుపక్షాల న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ద నిర్వహణకు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి అంగీకరించినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ అనుమతిస్తారని న్యాయవాదులు తెలిపారు. ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను ముగించింది. 

Labels: , , , ,

Wednesday 25 January 2023

బీఆర్‌ఎస్‌తో ఏ కూటమికి మేలు, ఏ కూటమికి ముప్పు



ఖమ్మం జి


ల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు ముగ్గురు సీఎంలు కేజ్రీవాల్‌, పినరయ్‌ విజయ్‌, భగవంత్‌ మాన్‌ లతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ జాతీయ నేత డి. రాజా హాజరయ్యారు. అయితే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంలను కలిశారు. వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, బీహార్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ తదితరులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. వీళ్లలో చాలామంది కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. దాన్ని ఆ పార్టీ ఖండించలేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా జేడీఎస్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పా బీఆర్‌ఎస్‌, జేడీఎస్‌ పోటీ చేయడం దాదాపుగా ఖాయం. ఇక ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో వేదిక పంచుకున్ననేతలంతా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవాళ్లే, కొట్లాడుతున్నవాళ్లే. అలాగే వీళ్లు ఎప్పుడూ అటు ఎన్డీఏలోనూ, బీజేపీతోనూ భాగస్వాములుగా లేరు.  బీహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ కలిసే ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌ భాగస్వామి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లు కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్‌తో కలిసి వచ్చే అవకాశాలు తక్కువ. కాకపోతే ఉద్యమకాలం నుంచి తెలంగాణకు మద్దతుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంఐఎం తమ అలయెన్స్‌ అని కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. ఇది రాష్ట్రం వరకే పరిమితం. జాతీయస్థాయిలో రేపు బీఆర్‌ఎస్‌ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే ఆ పార్టీని కూడా కలుపుకుని వెళ్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవేళ ఎంఐఎంను కలుపుకుంటే అది అంతిమంగా బీజేపీకి లబ్ధి జరుగుతుందనే అబిప్రాయం ఉండనే ఉన్నది. 


ఈసారి కేంద్రంలో కిసాన్‌ ప్రభుత్వం రావాలి అంటున్న కేసీఆర్‌ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి కూడా గత రెండు ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఈసారి తగ్గే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణతో సహా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాల ప్రభావం కచ్చితంగా వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉంటుది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోబీఆర్‌ఎస్‌ వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేయవచ్చు. ఈ కూటమి 30-40 సీట్లు దక్కించుకుంటే రేపు అటు యూపీఏకు గాని, ఎన్డీఏకు గాని పూర్తి మెజారిటీ రాకపోతే ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. వైసీపీ, బీజూజనతాదళ్‌ లాంటి పార్టీలు కూడా ప్రస్తుతం తటస్థంగానే ఉన్నాయి. ఈ పార్టీలకు వచ్చే సీట్లు కూడా కీలకంగా మారుతాయి. 

అలాగే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రయోగం అంతిమంగా బీజేపీకి మేలు చేయడానికే అనే వాదనలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీనే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ వైఖరి మారవచ్చు, కాంగ్రెస్‌ అధిష్ఠానం అభిప్రాయం మారవచ్చు.  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కదా!

Labels: , , , , , , , , ,

Sunday 22 January 2023

బీఆర్‌ఎస్‌కు కేటీఆర్‌ దూరం.. కేసీఆర్‌ వ్యూహమేనా?




టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్‌ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈసారి దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ యేతర రైతు ప్రభుత్వం రావాలని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ కీలక నేతలు మొదలు కార్యకర్తలంతా కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వందలాది కార్యకర్తల మధ్య బీఆర్‌ఎస్‌ పేరును కేసీఆర్‌ గత ఏడాది డిసెంబర్‌ 9న తెలంగాణ భవన్‌లో అధికారికంగా ప్రకటించారు. ఆరోజు కేటీఆర్‌ కూడా పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ట్విటర్‌లో మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే ఎక్కువగా స్పందిస్తున్నారు. 


ఢిల్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం, ఆ సందర్భంగా నిర్వహించిన యాగానికి కేటీఆర్ హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళితే.. కేటీఆర్ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ముందుగా  నిర్ణయించిన వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల కేటీఆర్ హాజరుకాలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్బంగా నిర్వహించిన యాగానికి కేటీఆర్‌ హాజరుకాలేదు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలంతా హస్తినలో ఉంటే కేటీఆర్‌  మాత్రం హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ముందుగా నిర్ణయించిన ఇతర కార్యక్రమాలు ఉండటంతోనే ఆయన హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఖమ్మంలో జరుగుతున్న ఆవిర్బావ సభలో కూడా ఆయన లేరు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి ఆయన దావోస్‌ వెళ్లారు. అయితే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేక కేసీఆరే తన తనయుడిని రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటానికి కేటీఆర్‌ను బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నారా? అనేది ప్రస్తుత చర్చనీయాంశమైంది. 


కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను విస్తరిస్తూ.. వివిధ రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులను, ఏపీ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించారు.  జాతీయ పార్టీలకు నీళ్లు, వ్యవసాయం, పంటల మద్దతు ధరలు వంటి విషయాల్లో జాతీయ విధానం ఉండాలంటున్నారు. దేశంలో నీటి లభ్యత, దేశంలో ఉన్న వనరులు,  ఆర్థిక విధానాలు, రైతు సంక్షేమం వంటి గురించి ఉప ఎన్నికల సందర్భంలోనూ, మీడియా సమావేశాల్లోనూ మాట్లాడారు. తెలంగాణ నమూనా ఇప్పుడు దేశానికి కావాలని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రయోజనాలు, రాష్ట్ర హక్కులు, కృష్ణ నదీలో వాటా గురించి ఈ మధ్య కాలంలో ప్రస్తావించడం లేదు. తాను జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగానే దేశం గురించి మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ వేదికల ద్వారా కేసీఆర్‌ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే.. రాష్ట్ర రాజకీయాల గురించి కేటీఆర్‌ మాట్లాడేలా ఒక పథకం ప్రకారం ఈ వ్యూహాత్మాకంగా దూరంగా ఉంచుతున్నారని అనుకుంటున్నారు.

Labels: , , ,