Thursday, 31 July 2025
Wednesday, 30 July 2025
రేపే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే తుది తీర్పు
https://www.ntnews.com/telangana/telangana-hc-verdict-on-mlas-who-defected-from-the-party-1722572
Tuesday, 29 July 2025
Monday, 28 July 2025
Sunday, 27 July 2025
Saturday, 26 July 2025
Friday, 25 July 2025
Wednesday, 23 July 2025
Monday, 21 July 2025
Sunday, 20 July 2025
Saturday, 19 July 2025
మొన్న రాజాసింగ్.. నేడు ఈటల రాజేందర్
2028లో అధికారంలోకి వస్తామని అంటున్న బీజేపీలో నేతల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నామినేషన్ వేయడానికి అనుమతించలేదన్న కారణంతో పార్టీ అధిష్ఠానంపై ఘాటు వ్యాఖ్యలు చేసి రాజీనామా చేసిన రాజాసింగ్ ను బైటికి వెళ్లడానికి అనుమతించారు. పార్టీ హైకమాండ్ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించి ఆయనకు షాక్ ఇచ్చింది. ఈ వివాదాం సమసిపోక ముందే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ల మధ్య విభేదాలు ఇవాళ బహిర్గతమయ్యాయి.హుజురాబాద్‌లో తనకు మెజారిటీ తక్కువ రావడానికి ఈటల వర్గమే కారణమని కేంద్ర మంత్రి ఆరోపించడం. అలాంటి వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా టికెట్లు ఇవ్వమంటారని బండి పెద్ద బాంబ్ పేల్చారు. నేడు హుజురాబాద్ కార్యకర్తలు శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై ఈటల ఫైర్ అయ్యారు. ఆయన పేరు ప్రస్తావించకుండానే తన స్థాయి ఏమిటో చెప్పారు. బీ కేర్ ఫుల్ నా కొడకా అని హెచ్చరించారు. వాడెవడో సైకోనా, శాడిస్టా అని ఆయన పేరు ప్రస్తావించకుండానే ఘాటుగా వ్యాఖ్యానించారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను అని విరుచుకుపడ్డారు.హుజురాబాద్ అంటే నా కుటుంబం. నాయకుడు ప్రజలు కుటుంబంలాగ కల్చర్ మనది. సోషల్ మీడియా నమ్ముకొని, అబద్దాల పునాదుల మీద బతికే కుట్రలు కుతంత్రాల మీద కొంతమంది బతుకుతున్నారు.నాది స్ట్రెయిట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ ఉండదు. ధీరుడుతో కోట్లాడతాం.. కుట్రదారులతో కాదు. ఈ కుట్రలు ఛేదించే సత్తా ప్రజలకే ఉంటుంది మనం చిన్నవాళ్ళం. నేను బేజాప్తా కాదు బాజప్తా యుద్ధం చేసేవాడిని.చరిత్ర లేకుండా వర్తమానం లేదు. వర్తమానం లేనిది భవిష్యత్తు లేదు.స్వేచ్ఛ కోసం బానిస సంకెళ్లు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలు ఎక్కారు, తూటాలకు బలయ్యారు. వారు అందించిన ఫలాలలోనే మనం జీవిస్తున్నాం.కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడ తెలంగాణ ఉద్యమం అంటున్నారు. కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో మేము చేసిన ఉద్యమం ఇంకా మా గుండెల్లో ఉంది అన్నారు.రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన ఈటలకు నిరాశే ఎదురైంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనే చర్చ జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆయన తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తపరచకపోయినా బండి సంజయ్ వ్యాఖ్యల తర్వాత ఈటల ఫైర్ అయ్యారు.అయితే అధికారంలోకి వస్తామన్న బీజేపీ సొంత పార్టీలో నేతల మధ్య విభేదాలు ఆపార్టీని కొంపముంచేలా ఉన్నాయని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది. నేతల మధ్య సమన్వయం ఎలా సాధిస్తుంది అన్నది చూడాలి.
Friday, 18 July 2025
Thursday, 17 July 2025
ప్రభుత్వానికి వత్తాసు.. ప్రతిపక్షంపై విమర్శలు
'తెలంగాణ అస్తిత్వం- సవాళ్లు, కర్తవ్యాలు' అనే అంశంపై తెలంగాణ వికాస సమితి చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశం అధికారపార్టీని కలవరానికి గురిచేసింది. అందులో పాల్గొన్న వక్తలు వివిధ రంగాల్లో నిపుణులు. వారు చెప్పిన అభిప్రాయాలు ప్రజల్లోకి వెళితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రజలు మునుముందు బట్టలూడదీస్తారేమో అన్న ఆందోళన ఆపార్టీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో అంతర్గతంగా ఉన్నది. అందుకే సమావేశం కార్డు పెట్టగానే అభ్యుదయభావాలు గల కొంతమందితో విమర్శలు చేయించింది. వాళ్లతో రాతలు రాయించింది. (వీళ్లకు కేసీఆర్ అంటే కోపం.ఎందుకంటే ఆయన ప్రజలతోనే ఉన్నారు. కానీ ఇలాంటి వారిని ఎంటర్‌టైన్ చేయలేదు. కానీ ప్రస్తుతం వీళ్లకు రేవంత్‌రెడ్డి మంచి సత్సంబంధాలు ఉన్నాయి) సీఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా మేము మౌనంగానే ఉంటాం. అసలు ప్రశ్నించం. కనీసం విమర్శించం అన్నట్టు కొంతమంది వ్యవహారం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిపై, ప్రశ్నించే వారిపై ఒంటికాలిపై లేస్తున్నారు.
వాళ్లంతా నిజాయితీ ఉన్నారా అంటే..? గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వాళ్లే. పదవీ కాలం ముగియగానే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టిన వాళ్లే. వీళ్ల బాధంతా ప్రభుత్వం దృష్టిలో పడాలి. పదవులు తీసుకోవాలి. అందుకే వికాస సమితి రౌండ్ టేబుల్ సమావేశంపై విషం చిమ్మారు. ఆ సమావేశంలో వక్తల అభిప్రాయాలను కోట్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలా వాపోయారు. నిజానికి ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 19 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ అస్తిత్వం ఎలా ప్రమాదంలోకి నెట్టివేయబడిందో వక్తలు అనేక ఉదాహరణలతో చెప్పారు. నీళ్లు, నిధులు, నియామాకాల కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్న ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపివేసే ప్రయత్నాలు చేసింది నిజం. ఇది కేసీఆర్ వ్యతిరేకులకు కనిపించదు. అలాగే అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహం గేట్లకు తాళం వేసినా వీళ్లకు పట్టదు. కేసీఆర్ కట్టిన ఏదీ వినియోగంలోకి ఉండటానికి వీళ్లేదూ అన్నట్టు కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా రైతాంగాన్ని గోస పెట్టినా, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు నమ్మబలికి ఇప్పుడు నిరసన చేస్తున్నవారిపై కేసులు పెడుతూ.. అణచివేస్తున్నా ఎన్నడూ అడుగరు.
వీళ్లంతా కాంగ్రెస్ పార్టీ దగ్గర టోకెన్ తీసుకుంటూ... బీఆర్‌ఎస్ ను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేవారిని టార్గెట్ చేస్తున్నారు. నిజానికి ఆ సమావేశంలో నందిని సిధారెడ్డి సార్ కొన్ని ఉద్యమపార్టీపై కూడా విమర్శలు చేశారు. ఎక్కడ లోపం ఉన్నదో చెప్పారు. భవిష్యత్తులో ఏం చేయాలో చెప్పారు. అలాగే పాపారావు తెలంగాణ పాట ఆవశ్యకత గురించి చెప్పారు. సీనియర్ జర్నలిస్టు పరాంకుశం వేణుగోపాల స్వామి మీడియా హక్కుల పేరుతో చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు. ప్రజలకు మాత్రమే హక్కులుంటాయని అంతేగాని భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో తెలంగాణపై చంద్రబాబు దండు చేస్తున్న దాడిని ప్రస్తావించారు. జూలురు గౌరీశంకర్ గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పారు. పంజుగుల శ్రీశైల్ రెడ్డి సాహిత్య అకాడమీ ఛైర్మన్ గా సిధారెడ్డి ఉన్నప్పుడే విమర్శిస్తూ వ్యాసం రాసినా ఎన్నడూ కేసులు పెట్టలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని చెప్పారు. మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర హోదా ఉన్న జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం ఎలా వ్యవహరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ, ఏపీ కూటమి నేతలు గతంలో తెలంగాణ ఏర్పాటుపై ఎలా వ్యవహరించారో చెప్పారు. కనకదుర్గ దంటు మాట్లాడుతూ.. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడకముందే ఏడు మండలాలు గుంజుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ దేశ పతి శ్రీనివాస్ కాళేశ్వరం నుంచి అమరజ్యోతి వరకు కేసీఆర్ కట్టిన నిర్మాణాలపై రేవంత్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న విషయాన్ని చెప్పారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ..ఈ వలసవాదం అనేది పొంచి ఉన్న పులి లాంటిదని అదనుచూసి మన మీద లంకించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇవాళ తెలంగాణ అలాంటి అదునైన కాలం వాళ్లకు కలిసి వస్తున్నదన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కార్పొరేట్, పెట్టుబడిదారులు తెచ్చే ఫార్మా కంపెనీలు గత ప్రభుత్వం తెచ్చినా ప్రస్తుత ప్రభుత్వం తెచ్చినా వ్యతిరేకించాల్సిందే అన్నారు.
సిధారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారినప్పుడే ప్రశ్నించాల్సి ఉండే అన్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ మాయమైనప్పుడే గ్రామస్థాయి నుంచి ఉద్యమం రావాల్సి ఉండే కుండబద్దలు కొట్టారు. అక్కడి వచ్చిన వక్తలంతా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న చర్యల వల్ల తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడబోతున్నదని హెచ్చరించారు. అసలు అక్కడ ఎవరు ఏం మాట్లాడారో పూర్తిగా చూడకుండానే పత్రికల్లో వచ్చిన ఒకటి రెండు అంశాల ఆధారంగానే విశ్లేషణలు చేసి వికాస సమితిని ఒక పార్టీకి అనుబంధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అబద్ధాలతో, అర్ధసత్యాలతో బట్టకాల్చి మీదేసే ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారు. గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వీళ్లు చేసిన ప్రయత్నాలు చూశారు. కానీ మార్పు మార్పు అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ పాలనలో ఏం జరగుతున్నదో ప్రజల అనుభవంలో ఉన్నది. అందుకే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సడలింది. వీళ్లు ఎంత ప్రభుత్వానికి డబ్బా కొట్టినా, గత ప్రభుత్వంపై నిందలేయాలని చూసినా వృథా ప్రయాసే అవుతుంది.
Wednesday, 16 July 2025
అసంతృప్తుల అడ్డదిడ్డమైన వాదనలు
మనం నచ్చకపోతే మనం ఏం చేసినా నచ్చదు. అట్లనే కొంతమందికి కేసీఆర్ అంటే గిట్టదు. అందుకే అలాంటి వారికి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిస్తుంటే కడుపు మండుతున్నది. పైకి కేసీఆర్ బాటలోనే రేవంత్ సాగుతున్నారంటూనే ఆయన పాలనలో అరాచకాలపై మాట్లాడుతున్న వారిపై, రాస్తున్న వారిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వం-సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అందులో ఆయా రంగాల నిపుణులు రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణలో వచ్చిన మార్పులు. సాగు, తాగు నీటి రంగాల్లో సాధించిన పురోగతి, తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాల పై కూలకషంగా చర్చించారు. అట్లనే తెలంగాణ భాష, చిహ్నాలు, తెలంగాణ అస్విత్వం వంటి అంశాలపై చర్చించారు. కానీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చరిత్రను మార్చే ప్రయత్నం చేయడం, ఉమ్మడి పాలనా అనుభవాలను తిరిగి ప్రజలకు గుర్తుచేస్తుండాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ పాలన అంటే గత ప్రభుత్వానికి కొనసాగింపు. ఆ పాలనలో లోపాలు ఉంటే సరిచేయవచ్చు. మంచి పథకాలు ఉంటే కొనసాగించవచ్చు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్ ఆయనే చెప్పినట్లు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే బాధ్యత నాది అని వాగ్దానం చేసినట్టే ఆచరణలో తెలంగాణ అస్విత్వ ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రశ్నిస్తున్న వారిని కేసులు పెట్టి వేధిస్తున్నది. మాట్లాడకుండా, రాయకుండే చేసే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశంపై అక్కసు వెళ్లగక్కే వారికి ఇవేవీ పట్టవు. కేసీఆర్, కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ జుగుప్సాకరమైన థంబ్ నెయిల్స్ పెట్టినా వీళ్ల దృష్టిలో తప్పు కాదు. వాళ్లు ఏం చేసినా మౌనంగా ఉండాలి. మాట్లాడవద్దు. భరించాలి. అది పత్రికా స్వేచ్ఛలో భాగమని సర్దుకుపోవాలి అన్నట్టు వీళ్లు నీతులు చెబుతున్నారు. కానీ రేవంత్ సర్కార్ అవగాహన రాహిత్యంతో గోదావరి, కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నాదీనిపై మాట్లాడవద్దు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టే పరిణామాలపై చర్చించవద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారెంటీల గురించి అడగవద్దు. 19 నెలల తర్వాత కూడా కేసీఆర్ పదేళ్ల పాలనపైనే చర్చ పెట్టాలి. అవి మాత్రమే ప్రస్తావించాలి. అంతేగానీ రేవంత్‌ను పల్లెత్తు మాట అనవద్దు. చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోవద్దు. రాధాకృష్ణ అడ్డదిడ్డ రాతలపై స్పందించవద్దు. ఇదే అజెండాతో కొంతమంది కేసీఆర్ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. వాళ్లకు వాళ్ల వ్యక్తిగత ప్రయోజాలు తప్ప తెలంగాణ ఏమై పోయినా ఫరవాలేదు అన్నట్టు రాస్తున్నారు.
Tuesday, 15 July 2025
Friday, 11 July 2025
Thursday, 10 July 2025
కూటమి పార్టీలను బలపరిస్తే కాంగ్రెస్ పతనమే
ఏపీలో విన్నింగ్ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కలిసి పోటీచేయనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌నే కాదు ఆ కూటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ రేవంత్ సర్కార్ వాళ్ల వైఫల్యాలకు బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ ను నిందిస్తున్నది. గోదావరి, కృష్ణ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్నా దానికీ కారణం కేసీఆర్ అని అంటున్నది. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడమే కాకుండా రాష్ట్రంలో బలం లేని ఏపీ కూటమికి బాటలు వేస్తున్నది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రాతలు రాస్తున్న ఓ వర్గం మీడియా రాహుల్ గాంధీపైనా విమర్శలు చేస్తున్నది. రేవంత్ రెడ్డికి ఆయన స్వేచ్ఛ ఇవ్వడం లేదని రాతలు రాస్తున్నారు. ఈ విషయాన్ని మరిచి తెలంగాణ పై అక్కసు వెళ్లగక్కే ఒక వర్గం మీడియాకు బీజేపీతో పోటీ పడి కాంగ్రెస్ మంత్రులు, నేతలు వంతపాడితే రానున్న రోజుల్లో దాని ఫలితం అనుభవిస్తారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గరి వచ్చేసరికి కూటమి పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలన్నది చెప్పాలంటే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాల్సిందే. ఆ పని వాళ్లు చేస్తే అంతకు మించి రాతలు రాయడానికి ఇప్పుడు వెనకేసుకు వస్తున్న ఒక వర్గం మీడియా ఉండనే ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ప్రయోజనం ఉండదు అన్న విషయాన్ని గుర్తించుకుంటే మంచిది.
Monday, 7 July 2025
తెలంగాణలో బీజేపీ మార్క్ రాజకీయం మొదలు
బీజేపీ మార్క్ రాజకీయాలు తెలంగాణలో మొదలుపెట్టింది. కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావు ఇప్పటికే తాను క్రిమినల్ లాయర్ ఒక్కొక్కరిని బొక్కలో వేయిస్తానని బెదిరించారు. మీడియా స్వేచ్ఛ పేరుతో కొంతమంది అదేపనిగా బీఆర్‌ఎస్‌పై విషం చిమ్ముతుంటే పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా ఉండదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిని అన్న విషయం రాంచందర్ రావు, కేంద్ర సహాయ మంత్రిని అని సంజయ్ మరిచిపోయారు. బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడానికి, కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా రాయొచ్చు అన్నట్టు వీళ్లు అభయహస్తం ఇస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా బీజేపీ బుల్డోజర్ రాజ్, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఆపార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేతిలో రాజ్యాంగం బుక్కు పట్టుకుని తిరుగుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ సర్కార్ కాషాయ నేతలకు, కాషాయ నేతలు కాంగ్రెస్ సర్కార్‌కు వంతపాడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్, కాషాయ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అనడానికి బీఆర్‌ఎస్‌పై రాంచందర్‌రావు, సంజయ్‌ల వ్యాఖ్యలే నిదర్శనం. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తికి చట్టం, కోర్టులతో పనిలేదనుకుంటా. అర్జెంటుగా కేసీఆర్, కేటీఆర్‌లను జైళ్లో వేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగంగానే తెలంగాణ భవన్‌పై దాడిచేయడానికి సిద్ధంగా ఉండాలని బీజేవైఎం కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చామని చెబుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆయనే హోం శాఖ మంత్రి కాబట్టి సంజయ్ వ్యాఖ్యలను తేలికగా తీసుకోవద్దు. బాధ్యత మరిచి భౌతిక దాడులకు పురికొల్పుతున్న ఆయనపై కేసులు పెట్టాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తున్నది.
వీళ్లిద్దరే కాదు ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల వ్యాఖ్యలు గమనిస్తే వాళ్ల టార్గెట్ బీఆర్‌ఎస్ మాత్రమే. సిద్ధాంతపరంగా కాంగ్రెస్, బీజేపీలు వేరైనా రాష్ట్రంలో మాత్రం ఒక్కటే అన్నట్టు వాళ్ల వైఖరి ఉంటున్నది. ఏపీ కూటమి ఇక్కడ పోటీ చేస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. అంటే ఏపీ, తెలంగాణలో బీజేపీ పార్టీ వ్యవహారాల బాధ్యతలు బాబుకే అప్పగించారని అనుకోవాలా? ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్‌ఎస్ ను బలహీనపరచడానికి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నది. కానీ ఇప్పుటి నుంచే విద్వేషపూరిత ప్రసంగాలు, ఉద్రిక్తలు రెచ్చగొట్టేలా సవాళ్లు విసరడం దేనికి సంకేతం? బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు మూడేళ్ల ముందు అక్కడ ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా అలాంటి రాజకీయాలే చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం సప్పుడు చేయకుండా ఉంటున్నది. ఈ పరిణామాలన్నీ తెలంగాణలో అస్థిరతను సృష్టించడానికే అన్నది స్పష్టమౌతున్నది. 19 నెలల కాంగ్రెస్ పాలనానుభవం తర్వాత పాలు ఏవో నీళ్లు ఏవో తేలిపోయింది. వీళ్ల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాషాయ పార్టీ నేతలను ప్రోత్సహిస్తూ బీఆర్‌ఎస్‌పై ఉసిగొల్పుతున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి.తెలంగాణ వనరులను ఏపీకి తాకట్టు పెట్టడానికి రెండు జాతీయ పార్టీల నేతలు చేస్తున్న కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉన్నది.
Sunday, 6 July 2025
అదే నిజమైతే నగరంలో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లు వేశారు?
ఈ వారం 'కొత్తపలుకు'లో రాధాకృష్ణ రాతలు మహాటీవీ వంశీ విద్వేషానికి కొనసాగింపే. కడుపులో కత్తులు పెట్టుకుని తెలంగాణ మీద లేని ప్రేమ చూపెట్టే రాధాకృష్ణ ఉద్యమకాలం నుంచే తెలంగాణ ఉద్యమాన్ని, బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచేలా అసత్య కథనాలు వండివార్చారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక అనేక కారణాలున్నాయి. చంద్రబాబు, టీడీపీ సానుభూతి పరుల వల్లనే కాంగ్రెస్ గెలిచిందని రాధాకృష్ణ అనుకుంటే అది ఆయన భ్రమే. ఎందుకంటే సైబరాబాద్ ను నిర్మించానని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నేనే పెట్టానని గప్పాలు కొట్టే చంద్రబాబును పట్టించుకునే స్థితిలో నగర ప్రజలు లేరు. ఎందుకంటే బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. కేసీఆర్ నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విజన్ వల్ల హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అంతర్జాతీయ కంపెనీలన్నీ బెంగళూరును కాదని హైదరాబాద్‌లో తమ సంస్థలను నెలకొల్పాయి.
“తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ‘ఆంధ్రజ్యోతిని కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుంది’ అని వ్యాఖ్యానించడం నిజం కాదా?” అని రాధాకృష్ణ తన కాలమ్ రాశారు. అయితే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో ఆంధ్రజ్యోతి గురించి ఎక్కడా పై వాక్యాలు రాయలేదు. మీడియా మేనేజ్‌మెంట్ గురించి ఆ నివేదికలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 13 టీవీ ఛానెళ్లు, 5 దినపత్రికలు ఉన్నాయి. అందులో రాజ్ న్యూస్ (టీ న్యూస్) మరియు హెచ్ఎం టీవీ తప్ప మిగతా మీడియా సంస్థలన్నీ తెలంగాణను వ్యతిరేకించాయన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఉద్యమాన్నిచల్లబరచాలంటే ఈ రెండు ఛానల్స్ మినహా మిగిలిన ఛానల్స్‌ను మేనేజ్ చేయాలని సూచన చేసింది.
ఇక చంద్రబాబు అరెస్టు పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వల్ల టీడీపీ సానుభూతిపరులు గుర్రుగా ఉన్నారని రాధకృష్ణ అన్నారు. అదే నిజమైతే నగరంలో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లు వేశారో, మొత్తం సీట్లన్నీ ఎలా గెలిచిందో చెబితే బాగుండేది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఢిల్లీ నుంచి గల్లీదాకా జరిగినా ముఖ్యకేంద్రం హైదరాబాదే. ఉద్యమకాలంలో అయినా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అయినా ఇక్కడ నివసిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజల భద్రత బాధ్యతను కేసీఆర్ తీసుకున్నారు. శాంతిభద్రత విషయంలో రాజీపడలేదు. రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని అందించే హైదరాబాద్ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ ప్రజలు గత ఐదు దశాబ్దాల్లో చూడని అభివృద్ధిని చూశారు. కానీ ఎన్నడూ కేసీఆర్, కేటీఆర్‌లు చంద్రబాబులా సెల్ఫ డబ్బా కొట్టుకోలేదు.
ఏపీ కూటమి తెలంగాణలో పోటీ చేస్తుందని కేసీఆర్, కేటీఆర్ భయపడుతున్నారట. 2014, 2018, 2023 బీఆర్‌ఎస్ సింగిల్‌గానే పోటీ చేసింది. 2018లో చంద్రబాబు మహాకూటమిలో చేరి మొత్తం బాధ్యత తానే తీసుకున్నా బీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. 2014లోనూ మోడీ హవా దేశమంతా వీచినా ఇక్కడ ఆ పార్టీ ప్రభావం ఏమీ కనిపించలేదు. 2018లో అయితే సింగిల్ సిటుకే పరిమితమైంది. ఏపీ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) , కాంగ్రెస్ కలిసి పోటీచేసినా 2028లో ఏం జరగబోతుందనేది తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉన్నది. కూటములతో వచ్చినా, అనైతిక పొత్తులతో పోటీ చేసినా కేసీఆర్ భయపడుతారా? ఉద్యమనాయకుడికి తెలంగాణ ప్రజల చైతన్యం తెలువదా? ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని గుంజుకున్న చంద్రబాబుకు ఎన్నడూ ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర లేదు. అలాంటి చంద్రబాబుకు కేసీఆర్ కు పోలిక ఎందులోనూ లేదు. ఇక ఏపీలో సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలను ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి అమలు చేయలేమని చేతులెత్తేశారు.
రాధాకృష్ణ అసలు బాధ ఏపీలో జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే ఎక్కడ తన అయిపోతుందో అని అంతర్గత భయం ఆయనను వెంటాడుతున్నది. అందుకే ఇప్పటికీ జగన్‌కే కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని ఆయన తన రాతల్లో అక్కసు వెళ్లగక్కారు. అయితే 2014లో ఓటుకు నోటు కేసు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల తర్వాత వైసీపీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టకూడదని నిర్ణయించుకున్నది. దానికే కట్టుబడి ఉన్నది. అంతేగాని చంద్రబాబు లాగా శిఖండి రాజకీయాలు చేయడం లేదు. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ ఉన్నంత వరకు వాటిని తిప్పికొట్టారు. ఆయనను అమరావతికి తరమికొట్టారు. ఇప్పుడు ఆయన తాబేదారు రేవంత్ రెడ్డి చేతగాని తనం వల్ల ఆయన మళ్లీ ఇక్కడ రాజకీయాలు మొదలుపెట్టారు. అయితే కేసీఆర్ ఆ మధ్య అన్నట్టు నాకు గట్టిగానే కొట్టడం తప్ప మెల్లగా కొట్టడం అలవాటు లేదన్నారు. 2028లో అదే జరగబోతున్నది. కేసీఆర్ తెలంగాణలో కొట్టే ఆ రాజకీయ దెబ్బ అమరావతిలోనే కాదు హస్తినలోని వినిపిస్తుంది. ఆ సౌండ్ ఎంత భయంకరంగా ఉంటుందో విందువు. అప్పటివరకు స్టే ట్యూన్ రాధాకృష్ణా!
నాడు మద్రాస్, నేడు హైదరాబాద్
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయం. ఎడిట్ పేజీలో పరాంకుశం వేణుగోపాల స్వామి, నేను, జ్యోతింధ్రనాథ్ ఉండేవాళ్లం. వేణు సార్, నేను తెలంగాణ జ్యోతింధ్రనాథ్ గారు ఆంధ్ర. కాబట్టి సహజంగానే ఆయన విభజనను వ్యతిరేకిస్తారు. అయితే ఆయన చాలా ప్రోగ్రెసివ్. విభజనను గుడ్డిగా వ్యతిరేకిస్తూ బాధకృష్ణ లాంటి వాళ్ల వాదనను వినిపించేవారు కాదు. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వినిపించేవారు. అయితే విభజన అనివార్యమైతే తర్వాత జరగబోయే పరిణామాలపై ఆయనకు కొంత బాధ ఉండేది. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన దీక్షకు అప్పటి నెహ్రూ ప్రభుత్వం స్పందించింది. దీక్ష విరమించాలని కోరింది. కానీ మద్రాస్‌తో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ను కొంతమంది ముందుకు తెచ్చి శ్రీరాములు దీక్ష కొనసాగించేలా చేశారు. ఫలితంగా ఏ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేశారో ఆయన అది చూడకుండానే కన్నుమూశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ పదే పదే ఒక మాట చెప్పేవారు. మా పోరాటం తెలంగాణ వనరులను దోచుకునేవారిపై, ఇక్కడ పెత్తనం చేసే వారిపై మాత్రమేనని పొట్టగూటి కోసం హైదరాబాద్‌కు వచ్చే వారిపై కాదన్నారు. ఉద్యమ సమయంలో ఉద్రేకపూరిత పూరిత ప్రసంగాలు చేసినా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పాలకుడిగా తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించారు. ఏ ప్రాంత ప్రజలపై వివక్ష చూపెట్టలేదు. అందుకే విభజనను అప్పుడు, ఇప్పుడు వ్యతిరేకించే ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా కేసీఆర్ పాలన విధానాన్ని ప్రశంసించారు. ఆంధ్ర వాళ్ల కాలి ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న కేసీఆర్ మా వారి మనసు దోచారు. అంతేకాదు తన హయాంలో ఎక్కడా మత ఘర్షణలు, శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా చూశారు.
తెలంగాణ ఉద్యమం సాగింది నీళ్లు, నిధులు, నియామకాల్లో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు. ఆత్మగౌరవ కోసం కూడా. అందుకే అధికారంలో లేకున్నా ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేది బీఆర్‌ఎస్ మాత్రమేనని గడిచిన 18 నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూస్తే అర్థమౌతుంది. ఇదందా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అప్పుడు జ్యోతింధ్రనాథ్ ఒక మాట అన్నారు. విభజన జరిగితే అప్పుడు మద్రాస్ కోల్పోయాం. ఆ తర్వాత కర్నూల్ పోయింది. ఇప్పుడు హైదరాబాద్ మాకు కాకుండా పోతున్నదని ఆవేదన చెందారు. దీనికి స్వామిగారు ఫన్నీగా ఒక కామెంట్ చేశారు. అప్పుడు మద్రాస్, ఆ తర్వాత కర్నూల్, ఇప్పుడు హైదరాబాద్. రేపు ఇగ మిగిలేది బంగాళఖాతమే అన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఏపీపై ఆ ప్రాంత నాయకులకు లేదని. ఎందుకంటే మాట్లాడితే ఆంధ్రులు అని గొప్పలు చెప్పుకోవడమే గాని ఆరు దశాబ్దాల కాలంలో వారికంటూ ఒక రాజధాని నగరం అంటూ ఏదీ నిర్మించుకోలేకపోయారు. చంద్రబాబు మొదటి ఐదేళ్లు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడమే తప్ప శాశ్వత సెక్రటేరియట్ కట్టలేదు. ఆ తర్వాత జగన్ ఐదేళ్లు పాలించినా ఆయన సంక్షేమపై దృష్టి సారించారు. అలాగే అమరావతి పేరుతో గత ప్రభుత్వం చేసిన భూదందాను వెలికి తీశారు. అక్కడ పెట్టే పెట్టుబడి, నిర్మాణాలు వృథా అవుతాయని నిపుణుల సూచన ఆధారంగా అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టలేదు. విశాఖ ను రాజధాని కేంద్రంగా చేయాలని, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దీనికే మూడు రాజధానులు అని పేరు పెట్టారు.
అయితే ఈ అంశాన్ని చంద్రబాబు సామాజిక వర్గం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి జగన్‌కు వ్యతిరకంగా ప్రచారం చేసింది. దీనికితోడు ఉచితలు అభివృద్ధికి ఆటంకం అనే మోడీ కూడా చంద్రబాబు ఇచ్చిన అలవిగాని హామీలకు గ్యారెంటీ ఇవ్వకుండా ఆయనతో జట్టు కట్టింది. ఇప్పుడు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ గురించి బాధకృష్ణ గాని, బాబు ఏం చేసినా బాకాలు ఊదే మీడియా చర్చ చేయదు. కానీ చంద్రబాబు ఏదో అద్భుతం చేయబోతున్నారని నిత్యం ప్రజలను ఏ మార్చే కథనాలు వండివారుస్తుంటాయి. దీనివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఆంధ్రులకు ఒక రాజధాని ఉండాలనే కల మాత్రం ఎన్నటికీ నెరవేరదు. దీనికి కారణం ఆచరణలో సాధ్యం కాని కోరికలు కొంతమంది పాలకులకు, మీడియా ప్రతినిధులకు, కొంతమంది పెట్టుబడి దారులకు ఉండటమే. నాడు మద్రాస్‌పై మమకారాన్ని వదులుకోలేదు. విభజన జరిగి 11ఏండ్లు అయినా హైదరాబాద్‌పై ఆశలు వదులుకోవడం లేదు. హైదరాబాద్ కేంద్రంగానే చంద్రబాబు అండ్ కో, బాధకృష్ణ లాంటి వాళ్లు చేస్తున్న కుట్రల ఫలితంగా అమరావతి రాజధాని పత్రికల్లో, ప్రచారంలో ఉంటుంది. కానీ ఎన్నటికీ అక్కడి ప్రజలకు అందుబాటులోకి రాదు.
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న బంధం అగ్రరాజ్యం రాయబారి కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక...


