Sunday, 26 May 2024

కోడ్‌ ముగిసిన వెంటనే పోస్టింగులు


- లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలకు కొత్త ఉపాధ్యాయులు, లెక్చరర్లు రానున్నారు.

- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకుల సొసైటీల వారీగా ఎంపికైన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.

- మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌,రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల ఫలితాలు ప్రకటించలేదు. 

- కోడ్‌ ముగిసిన వెంటనే వాటినీ ప్రకటించేందుకు బోర్డు సమాయత్తమైంది. 

- గురుకులాల్లో మొత్తం 9,210 పోస్టుల ఫలితాలన్నీ వెల్లడించిన తర్వాత ఆయా సొసైటీల వారీగా నియామకాలు మొదలవుతాయి. 

- పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుత నియామక పత్రాలు తీసుకున్న వారికి పోస్టింగులు ఇస్తే సీనియారిటీ, ఇతర సాంకేతిక సమస్యలు వస్తాయని సొసైటీలు భావిస్తున్నాయి.

- అందుకే కోడ్‌ ముగిశాక జులై రెండో వారం లోగా ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాయి.

ముచ్చటగా మూడోసారి కోల్ కతాదే ఐపీఎల్ టైటిల్


ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా విజయభేరీ మోగించింది. చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి హైదరాబాద్ ను  చిత్తుగా ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలో ఛేదించింది. ముచ్చటగా మూడోసారి టైటిల్ ను సొంతం చేసుకున్నది. వెంకటేశ్ (52 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో విజృంభించాడు. గుర్బాజ్ (39) ఫోర్లతో విరుచుకుపడ్డాడు.  శ్రేయస్ (6 నాటౌట్‌) బౌండరీతో మెరిశాడు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్, కమిన్స్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు నాలుగుసార్లు ఫైనల్ చేరిన ఈ రెండు జట్లు తలో రెండుసార్లు టైటిల్ సాధించాయి.  మూడోసారి టైటిల్‌ సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నాయి.ఐపీఎల్ లో కోల్‌కతా, సన్ రైజర్స్‌  మధ్య ఇదే మొదటి ఫైనల్.

Friday, 24 May 2024

'ఒకప్పుడు బీజేపీ ఉండేది'

 జూన్‌ 4వ తేదీ ( ఎన్నికల ఫలితాల రోజు) సంతోషకరమైన రోజు అవుతుంది. 'ఒకప్పుడు బీజేపీ ఉండేది' అనే టైటిల్‌తో ఒక సినిమా విడుదలవుతుంది. మాకు నాయ‌క‌త్వ ముఖాలకు కొరత లేదు. మేము కూర్చుని ముఖాన్ని (ప్ర‌ధాని అభ్య‌ర్థిని) నిర్ణయిస్తాం. మేము ఎంపిక చేసుకోవడానికి ఎంతటి గొప్ప నాయకుల సమూహాన్ని కలిగి ఉన్నామో చూడండి.

-అఖిలేశ్‌ యాదవ్‌, ఎస్పీ అధినేత


అగ్నిపథ్‌తో యువతను మోడీ మోసం చేశారు: రాహుల్‌


సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్న యువతను అగ్నిపథ్‌ పథకం బలవంతపు అమలు ద్వారా ప్రధాని మోడీ మోసం చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక యువతకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సాయుధ బలగాల్లో చేరాలని కోరుకొని, అగ్నపథ్‌ పథకం కారణంగా ఆ అవకాశానికి దూరమైన కొందరు యువకులతో రాహుల్‌గాంధీ ఇటీవల ఓ టెంపో వాహనంలో ప్రయాణిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను రాహుల్‌ సోషల్‌ మీడియా 'ఎక్స్‌' లో పంచుకుని పై వ్యాఖ్యలు చేశారు.

అల్లర్లు సృష్టించడానికి, అసత్యాలు ప్రచారం చేయడానికి దేవుడు పంపిస్తాడా?: మమత


తనను దేవుడే భూమి పైకి పంపించాడని, తనకు జీవ సంబంధిత తల్లిదండ్రులు లేరని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కౌంటర్‌ వేశారు. 'నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అల్లర్లు సృష్టించడానికి, ప్రచాప ప్రకటనలతో అసత్యాలు వ్యాప్తి చేయడానికి, ఎన్సార్సీ ద్వారా ప్రజలను జైలు పాలు చేయడానికి దేవుడు ఎవరినైనా భూమిపైకి పంపిస్తాడా? ఎన్నికల్లో ఓటమి భయం కారణంగా బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని' మమతా ధ్వజమెత్తారు.

ఇండియా కూటమితో ఆ వర్గాల రిజర్వేషన్లకు ముప్పు


విపక్ష ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల ప్రజలకు వ్యతిరేకం. ఈ వర్గాల రిజర్వేషన్లు లాక్కుని ముస్లింలకు కేటాయించాలని ఆ కూటమి భావిస్తున్నదని, తద్వారా ముస్లింలసు సంతృత్తి పరచాలని చూస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. యూపీలో కుశినగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమికి ఓటు వేయవద్దు. బీజేపీకి మద్దతుగా నిలువండి. మోడీ మూడోసారి ప్రధాని అయితే భారత్‌ ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. అన్నారు.

ఈసారి మోడీకి వ్యతిరేకంగా ప్రజలే పోరాడుతున్నారు



ఈసారి మోడీకి వ్యతిరేకంగా ప్రజలే పోరాడుతున్నారు. ఇవి మన ఎన్నికలు కాదు. కానీ స్వతస్సిద్ధంగా జనం ముందుకు వస్తున్నారు. మోడీని ఓడించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అధిక ధరల వల్ల, నిరుద్యోగం వల్ల, గత 10 సంవత్సరాలలో ఆయన చెప్పినవన్నీ అబద్ధమని తేలిపోవడం వల్ల


- మల్లికార్జున్ ఖర్గే,  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు

Thursday, 23 May 2024

బీజేపీ 300 సీట్లకు పైగా సాధిస్తుంది: ప్రశాంత్‌ కిషోర్‌


సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లకు పైగా సాధిస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అంచనా వేసిన విషయం విదితమే. తాజాగా ఆయన చేసిన పోస్టులో తన అంచనాలో ఎలాంటి మార్పు ఉండదనేది ఆ పోస్టు ఉద్దేశంగా కనిపిస్తున్నది. 

అలాగే నిరాశలో కూరుకుపోయిన వారికి ఆయన ఒక సలహా ఇచ్చారు. 'జూన్‌ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి'  అనిసెటైర్‌ వేశారు.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్డీఏ 400 మార్క్‌ దాటుతుందని మోడీ  చేస్తు్న్న ప్రచారంపై ఆయన  స్పందిస్తూ అది సాధ్యం కాదన్నారు. అలాగే 270 కంటే దిగువకూ పడిపోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

రోడ్డుపై గుంతలు.. మహిళ వినూత్న నిరసన


-హైదరాబాద్‌ నుంచి ఉప్పల్‌ వచ్చే రోడ్డుపై ఓ మహిళ వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలోని నీటిలో కూర్చుని ఆందోళనకు దిగారు. రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో... అటుగా వెళ్తుంటే ప్రమాదానికి గురవుతున్నామని ఆమె వ్యక్తం చేశారు. 

-ఇదే రోడ్డుపై వెళ్తూ తమ పిల్లలు గతంలో ప్రమాదాలకు గురయ్యారని వాపోయారు. ఉప్పల్‌ నుంచి నాగోల్‌కు వచ్చేలోపు లెక్కించగా 30 గుంతలు ఉన్నట్టు చెప్పారు. ప్రజలు చెల్లించిన పన్నులు ఏం చేస్తున్నారని జీహెచ్‌ఎంసీని ఆమె ప్రశ్నించారు. 

-అనంతరం నాగోల్‌ కార్పొరేట్‌, స్థానిక నేతలు జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడటంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఢిల్లీలో ఎన్డీఏ, ఇండియా ఢీ అంటే ఢీ


- దేశ రాజధాని ఢిల్లీ ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి పట్టం కట్టే ప్రజలు లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి మరోపార్టీకి మద్దతుగా నిలుస్తారు. 2019లో ఇక్కడి 7 స్థానాలను కైవసం చేసుకున్న కాషాయపార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి (ఆప్‌) పట్టం కట్టారు. 


- సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌, ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ ఏపీ దాడి వంటి ఘటనలు ఆప్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఆర విడుతలో ఢిల్లీలోని 7 నియోజకవర్గాకలు ఒకేసారి పోలింగ్‌ జరగనున్నది. 


- గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన అభ్యర్థులనూ బీజేపీ మార్చి మొత్తం 7 స్థానాల్లో బరిలోకి దిగింది. ఇక్కడ ఆప్‌ 4, కాంగ్రెస్‌ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. దీంతో ఇండియా, ఎన్టీఏ కూటముల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఉన్నది. 


- అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్‌, తాగునీరు వంటి అంశాలకే ప్రాధాన్యం ఇచ్చే హస్తిన ఓటర్లు లోక్‌సభకు వచ్చేసరికి జాతీయ భద్రత, అభివృద్ధి, ప్రధాని మోడీ సమర్థత వంటి చూస్తున్నారు. ఈసారి ఓటర్లు మద్దతు పలుకుతారంటే మౌనమే సమాధానం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఢిల్లీ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనే ఉత్కంఠ నెలకొన్నది.

'అబ్‌ కీ బార్‌.. 400 పార్‌' నిజం కాబోతున్నది: శివరాజ్‌సింగ్‌


ఎన్డీఏకు 'అబ్‌ కీ బార్‌.. 400 పార్‌' అని మేము ఏదైతే చెబుతున్నామో ప్రజలు కూడా అదే చెబుతున్నారు. ఇది వాస్తవం కాబోతున్నదని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, విదిశ లోక్‌సభ ఎంపీ అభ్యర్థి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలను మేము గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Saturday, 18 May 2024

సింగపూర్‌లో కొవిడ్‌ కలకలం


కొవిడ్‌ ఉధృతి చాలా తగ్గిందని అంతా అనుకుంటున్న సమయంలో అది అక్కడక్కడా పంజా విసురుతూనే ఉన్నది. తాజాగా సింగపూర్‌లో కొవిడ్‌ కలకలం సృష్టిస్తున్నది.  ఈ నెల 5 నుంచి 11 వ తేదీ మధ్య వారం వ్యవధిలో 25,900 పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి వారం అంతకు ముందు వారం కన్నా రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి.  దీంతో సింపూర్‌ ప్రభుత్వం హెల్త్  అడ్వైజరీ జారీ చేసింది.  మాస్క్‌ ధరించడం సహా ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించింది. 



బాల్యాన్ని గుర్తు చేసుకుని రాహుల్‌ భావోద్వేగం

 


'రాయ్‌బరేలీ వెళ్లినప్పుడల్లా నేను, ప్రియాంక మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. నాన్నమ్మ జ్ఞాపకాలు, నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక చేసిన కేకులు, ఇలా ఎన్నో మధురమైన క్షణాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. ఇవన్నీ నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తున్నది. చిన్నప్పటి నుంచి రాజకీయాలతో అనుబంధం ఉన్నది. కానీ, మా మధ్య రాజకీయాలకు ఎప్పుడూ చోటివ్వలేదు' అని బాల్యాన్ని గుర్తు చేసుకున్న రాహుల్‌ భావోద్వేగానికి గురయ్యారు'

మీరు రాజకీయాలు చేస్తున్నప్పుడు మీ కుటుంబాలకు గౌరవం ఇవ్వకపోతే... బైట కూడా సత్సంబంధాలు కొనసాగించలేరని అని బీజేపీ అగ్రనేతలపై రాహులు ధ్వజమెత్తారు.

మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే


మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్‌ ఇచ్చిన ఇంజినీర్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సాగు నీటి శాఖపై సచివాలంలో చేసిన సమీక్షలో పలు ప్రశ్నలు సంధించారు. 'పని పూర్తయితే, నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలని ఎందుకు కోరింది? నీటి పారుదల శాఖ ఎందుకు పొడిగించింది? నిర్మాణ సంస్థ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొత్తం రికార్డులన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలి అని సీఎం స్పష్టం చేశారు. 


నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్డీఎస్‌) ఇచ్చిన మధ్యంతర నివేదిక, వానకాలంలో చేయాలని సూచించిన పనుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు. ఈ సమీక్షలో ఉత్తమ్‌తో పాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖా ఉన్నారు. అయితే ఎన్డీఎస్‌పై సుదీర్ఘ చర్చ చేసినట్టు సమాచారం. బ్యారేజీ కుంగుబాటులో బాధ్యులపై క్రిమినల్‌ చర్యలకు వెనకాడవద్దనీ సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. వచ్చే వారం ప్రాజెక్టు వద్దకు సీఎం వెళ్లనున్నారు. 


Friday, 17 May 2024

మెట్రో రైలు సమయం పొడిగింపు

 


హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనున్నది. 

అలాగే ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలుకానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనున్నది. 

ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సమయాల్లో మార్పులు చేసినట్టు సమాచారం. పొడిగించిన సమయాలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. 


ఏపీలో ఎన్నికల హింసపై సిట్‌ ఏర్పాటు


ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ ఏర్పాటైంది. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్‌ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి (శ్రీకాకుళం), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు (ఒంగోలు), ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి (తిరుపతి), వి. భూషణం (గుంటూరు రేంజ్‌), వెంకటరావు (విశాఖ ఇంటెలిజెన్స్‌), రామకృష్ణ (ఏసీబీ), జి.ఎల్‌. శ్రీనివాస్‌(ఏసీబీ) ఉన్నారు.




అంతకుముందు ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆఫీస్‌ ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌  రెండురోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ప్రతి ఘటనలపైనా సిట్‌ ఈసీకి నివేదిక ఇవ్వనున్నది.

2024, 2029లోనూ మోడీనే ప్రధాని: రాజ్‌నాథ్‌


బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే మోడీనే ప్రధాని అవుతారని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. వచ్చే ఏడాది ప్రధాని మోడీకి 75 ఏళ్లు పూర్తి కానుండటంతో ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని అమిత్‌షాకు పగ్గాలు అప్పగిస్తారని కేజ్రీవాల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. 


మరో పదేళ్లు మోడీనే ప్రధానిగా ఉంటారని, ఆయన పదవీ విరమణ గురించి ఆలోచించనే లేదన్నారు. బీజేపీ మూడోసారి అధికారం చేపడితే రిజర్వేషన్లు ఎత్తివేస్తారన్న ప్రచారంలోనూ ఏమాత్రం వాస్తవం లేదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగం అనుమతించదని తెలిపారు. దేశ రాజకీయాల విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నం కావడానికి ప్రతిపక్షాలే కారణమని రాజ్‌నాథ్‌ సింగ్‌ ధ్వజమెత్తారు. 


బీజేపీ సీనియర్‌ నేతగా చెబుతున్నాను. 2024, 2029లోనూ ప్రధాని మోడీయే ఉంటారు. ఆయన తప్పుకునే విషయంలో మేం ఆలోచించనే లేదు. ఆ వ్యక్తి అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను పెంచారు. ఆ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గా మారింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా చెబుతున్నాయి. 2014 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 11వ స్థానంలో ఉండేది. మోడీ హయంలోనే 5వ స్థానానికి ఎగబాకింది. 2027 ఆరంభంలోనే  మూడో స్థానానికి చేరనున్నది. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా  భారత్‌ అవతరించనున్నది. విశ్వమహాశక్తిగా అవతరించే దిశగా భారత్‌ దూసుకుపోతున్నది. ఎవరినో బెదిరించడానికి  మహాశక్తి కావాలనుకోవడం లేదు. విశ్వకల్యాణం కోసమే మహాశక్తిగా అవతరించాలనుకుంటున్నామని రాజ్‌నాథ్‌ తెలిపారు.

బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు : రాహుల్‌గాంధీ

 


బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉన్నదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమేథీలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కిషోరీ లాల్‌ శర్మ తరఫున ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కలిసి రాహుల్‌ ప్రచారం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అధికారపార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నందున దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు.  రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని రాహుల్‌ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '2024 ఎన్నికలు ప్రత్యేకమైనవి. మొదటిసారి ఓ రాజకీయపార్టీ, ఆపార్టీ నేతలు రాజ్యాంగాన్ని ఖతం చేస్తామని అన్నారు. అందువల్ల రాజ్యాంగాన్ని రక్షించాల్సి ఉన్నది. ఇదే మీ గొంతుక. నరేంద్రమోడీ రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. రాజ్యాంగం రద్దయితే  ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవు. ఉద్యోగాలు ఉండవు. ధరలు ఆకాశాన్నంటుతాయి. రిజర్వేషన్లు రద్దవుతాయి. మీ హక్కులన్నీ లాగేసుకుంటారు. వాస్తవం ఏమంటే రాజ్యాంగం లేకుంటే దేశంలోని 22 లేదా 25 మంది సంపన్నులకు మాత్రమే హక్కులుంటాయి. రైతులు, కూలీలు, యువకులు, మహిళల హక్కులు లాగేసుకుంటారు' అని హెచ్చరించారు.

కడుపుపై కొట్టాడు.. కాలితో తన్నాడు: స్వాతి మాలీవాల్‌


దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో  సంచలన విషయాలు బైటికి వస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి  పాల్పడినట్లు బాధితురాలు స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. కడుపుపై కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో స్వాతి ఆరోపించినట్లు సమాచారం. అంతేకాకుండా సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు బిభవ్‌ కుమార్‌ కొట్టినట్లు ఆరోపించారు. 


ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు బిభవ్‌ కుమార్‌ కొట్టినట్లు స్వాతి ఆరోపించారు. దీనిపై ఆమె వాంగ్మూలం తీసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు గురువారం మాలీవాల్‌ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా దాడి జరిగిన ఘటనను ఆమె పోలీసులకు వివరించారు. సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో బిభవ్‌ తన చెంపపై కొట్టి కాలితో తన్ని కర్రతో కొట్టినట్టు  స్వాతీ మాలీవాల్‌ వాపోయారని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. దాడి ఆరోపణలు నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గతంగా గాయాలైనట్టు ఈ పరీక్షల్లో తేలిందని వైద్యవర్గాలు తెలిపాయి. 


అటు ఈ ఘటనపై స్వాతి మాలీవాల్ మొదటిసారి స్పందించారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని సోషల్‌ మీడియా ఎక్స్ వేదికగా ద్వారా పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు దీనిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు రాసుకొచ్చారు. ఇటీవల రోజులు చాలా కష్టంగా గడిచాయని, తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నాయని ఈ తరుణంలో స్వాతి మాలీవాల్‌ అంత ముఖ్యం కాదన్నారు. దేశంలో సమస్యలే ముఖ్యమని ఈ ఘటనను రాజకీయాల్లోకి  లాగవద్దని బీజేపీ శ్రేణులకు ప్రత్యేకంగా విన్నవించారు. 


గతంలో తనకు ఇలాంటి అనుభవాలే ఎదురైనట్టు ఆప్‌ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో కొట్టడం సర్వసాధారణమన్నారు. కేజ్రీవాల్‌ చెప్పింది చేయడమే బిభవ్‌ పని అని, అక్కడ కొట్టడం మామూలేనని ఆరోపించారు. ప్రశాంత్‌ కుమార్‌, యోగేంద్ర యాదవ్‌ లాంటి వాళ్లను గతంలో బౌన్సర్ల తో గెంటేశారని  ఈసారి హద్దులు దాటారని ఇల్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏతో ఒక మహిళను కొట్టించడం సరైనదేనా అని, ఘటనకు బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్‌ స్వాతి మాలీవాల్‌కు క్షమాణలు చెప్పి, సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

గెలిస్తే అర్జునుడిని...ఓడితే అభిమన్యుడిని


నిజామాబాద్‌ స్థానంలో గట్టి పోటీ ఉన్నదని గెలిస్తే అర్జుడిని, ఓడితే అభిమన్యుడిని అవుతానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ గెలువకుండా బీఆర్‌ఎస్‌ బీజేపీకి అమ్ముడుపోయిందని ఆరోపించారు. అయినా ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందునే బీఆర్‌ఎస్‌ రైతు దీక్షలు చేపడుతున్నదని ఎద్దేవా చేశారు. 

రైతు దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉండటమే కాకుండా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా వరి వేస్తే ఉరి, కేవలం సన్న వడ్లు మాత్రమే సాగు చేయాలన్నారని గుర్తు చేశారు. అలాంటి ఆయన రైతు దీక్షలకు పిలుపు నివ్వడం తనకు ఆశ్చర్యం వేసిందని జీవన్‌రెడ్డి అన్నారు. గతంలో మీరు అమలు చేసిన పని మేము చేయకుంటే తప్పన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిన్నటిదాకా అమలు చేసిన కార్యక్రమాలను అమలు చేస్తూనే అదనంగా మరిన్ని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన జగిత్యాలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నిజామాబాద్‌లో పోటీ చేస్తున్నానని తెలిపారు. గెలిస్తే అర్జునుడి అవుతా ఓడిపోతే అభిమన్యుడిని అవుతానని ఎమ్మెల్సీ అన్నారు.

Monday, 13 May 2024

బీజేపీకి మెజారిటీ రాకపోవచ్చు: యోగేంద్ర యాదవ్‌





బీజేపీకి ఈసారి మెజారిటీ రాకపోవచ్చని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్‌ అంచనా వేశారు. దీనికి సంబంధించి ఎక్స్‌ వేదికగా ఆయన ఒక వీడియో పోస్ట్‌ చేశారు. ఆయన మాట్లాడూతూ...

ఈ వీడియో ద్వారా నేను మీకు అణచివేయబడుతున్న, దాచబడిన సత్యాన్ని చెప్పబోతున్నాను.ఈ లోక్‌సభ ఎన్నికలు మలుపు తిరిగిన మాట వాస్తవమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్‌ అన్నారు. తాను కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌,హర్యానా వెళ్లానని చెప్పారు. ఎన్నికలపై పదేహేళ్ల నా అనుభవంతో చెబుతున్నాను. బీజేపీకి మెజారిటీ రాదని చెప్పారు. ఆ పార్టీకి మెజారిటీకి అవసరమైన సీట్లు కూడా రావని, ఎన్డీఏ కూటమికి కూడా 270 సీట్ల కంటే తక్కువే వస్తాయని అంచనా వేశారు. 







2019లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు వస్తే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యపార్టీలకు 353 సీట్లు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో 10 సీట్లు, మహారాష్ట్రలో 20, రాజస్థాన్‌, గుజరాత్‌లలో 10, హర్యానా, పంజాబ్‌, చండీగఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీలలో కనీసం 10, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో 15, బీహార్‌లో 15, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో 10 ఇలా బీజేపీ, ఎన్డీఏ కూటమిలోని పార్టీలో 100 సీట్ల వరకు కోల్పోతున్నాయి. మరోవైపు తమిళనాడు, కేరళ, తెలంగాణలో  5 సీట్లు,ఏపీలో 10 ఎన్డీఏకు సీట్లు పెరుగుతాయి. ఇది ఎగ్జిట్‌పోల్స్‌ కావని ఇప్పుడు పరిస్థితి ప్రకారం బీజేపీకికి సొంతంగా 233 వరకు, ఎన్డీఏ కూటమికి  268 సీట్లు రావొచ్చు అని ఆయన అంచనా వేశారు.

Sunday, 12 May 2024

కళ్యాణ్ మామకు నా మద్దతు ఎపుడూ ఉంటుంది




నంద్యాల టూర్ పై స్టైలిశ్‌ స్టార్‌ బన్నీ క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ రాజకీయపార్టీతో  సంబంధంలేదన్నారు. మా మావయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎపుడూ ఉంటుందన్నారు.  శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడని అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. 

అందుకే రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వెళ్లానని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరారు. 

ముందు పార్టీనే నన్ను మోసం చేసింది:నీలేశ్‌ కుంభానీ

సార్వత్రిక ఎన్నికల్లో సూరత్‌ స్థానం వార్తలో నిలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి


నీలేశ్‌ కుంభానీ నామినేషన్‌ పత్రాలు చివరి నిమిషంలో తిరస్కరణకు గురయ్యాయి.  దీంతో ఆయనను హస్తం పార్టీ బహిష్కరించిన విషయం విదితమే. అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన సుమారు 20 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. 


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ' పార్టీని మోసం చేశానని కొంతమంది కాంగ్రెస్‌ నేతలు నన్ను తిడుతున్నారు. వాస్తవానికి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కామ్రేజి స్థానం నుంచి చివరి క్షణంలో నన్ను తొలిగించి తొలుత పార్టీనే తప్పు చేసింది. ఇలా చేయాలని నేను అనుకోలేదు. కానీ సూరత్‌లో ఐదుగురు స్వయం ప్రకటిత నేతలే పార్టీని నడుపడంతో నా మద్దతుదారులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా ఆప్‌ పార్టీ నేతలతో నేను కలిసి నేను చేసిన ప్రచారాన్ని కూడా ఈ నేతలు తప్పుపట్టారు' అని వ్యాఖ్యానించాడు.


ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన 8 మంది అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మీరేమైనా ప్రధాని అభ్యర్థా?: స్మృతి ఇరానీ


బీజేపీ సాధారణ కార్యకర్తతో కాంగ్రెస్‌ కంచుకోటలోనే పోటీపడలేని వ్యక్తి గొప్పలకు పోవడం ఆపాలి. మోడీతో చర్చించడానికి మీరేమైనా 'ఇండియా' కూటమి  ప్రధాని అభ్యర్థా? అని బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ప్రశ్నించారు. మోడీ లాంటి వ్యక్తితో చర్చించే స్థాయి ఉందా? ఏ హోదాలో చర్చకు వస్తారని ధ్వజమెత్తారు. 

లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయపార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆహ్వానించిన విషయం విదితమే. ఆ చర్చకు తాను కానీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కానీ రావడానికి సిద్ధమేనని శనివారం వెల్లడించారు. ఇందులో ప్రధాని మోడీ కూడా భాగస్వాములవుతారని ఆశిస్తున్నాను అన్నారు.

ఆందోళన వద్దు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: సీఎం రేవంత్‌


తెలంగాణలో రాగల ఐదు రోజులు వానలు పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని  సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే రైతులు ఆందోళన చెందవద్దని, ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం తెలిపారు.

రాయ్‌బరేలీకి బీజేపీ ఏం చేసింది? ప్రియాంక



రాయ్‌బరేలీ నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, AIIMS, NIFT,  రింగ్‌ రోడ్డు, ఐదు జాతీయ రహదారులను ఇచ్చిందన్నారు. మేము  AIIMS ప్రారంభిస్తే  బీజేపీ వాళ్లు మూసేశారన్నారు. రాయ్‌బరేలీ కోసం వాళ్లు ఏం చేశారు? నిలదీశారు. 

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?


ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశాయి. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తామని ప్రకటించాక కొంత సానుకూల వ్యక్తమైంది. వైసీపీ కంటే ఆ కూటమి వైపే కొంత ప్రజలు మొగ్గుచూపినట్టు ఆ సర్వే సంస్థలు వెల్లడించిన నివేదిక ఆధారంగా తెలిసింది. అయితే ఎప్పుడైతే బీజేపీ కూటమిలో చేరిందో మొత్తం సీన్‌ మారిపోయిందనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్‌. 


అంతెందుకు మెగా ఫ్యామిలీలోనే మెనీ పార్టీలు అన్నట్టు రెండుమూడు రోజులుగా అక్కడ రాజకీయ పరిణామాలను చూస్తే అర్థమౌతుంది. అక్కడ ఏపార్టీ గెలుస్తుంది అనే దాని ప్రజలు తేలుస్తారు. కానీ కొన్ని మీడియా సంస్థలు పీకే అభిప్రాయమే ప్రజాభిప్రాయం అన్నట్టు అక్కడ అధికారపార్టీ పని అయిపోయినట్టు, కూటమివైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ-జనసేన ప్రజలకు ఇచ్చిన హామీలకు తమది బాధ్యత కాదన్నట్టు బీజేపీ వ్యవహరిస్తున్నది. 


అలాగే ఏపీ విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రానికి నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందనేది అక్కడ జనాల్లో ఉన్న అభిప్రాయం. అలాంటి బీజేపీ కూటమిలో చేరడం వల్ల టీడీపీ-జనసేనలకు నష్టం జరుగుతుంది కానీ జగన్‌ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదనే వాదన వినిపిస్తున్నది.

ద్విముఖ పోరులో ఏ పార్టీకి అనుకూలం?

 తెలంగాణలో రేపు 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. హైదరాబాద్‌లో మినహా మిగిలిన 16 స్థానాల్లోని ముఖాముఖి పోటీ ఉన్న స్థానాల గురించి తెలుసుకుందాం. అక్కడ పార్టీల బలాబలాల గురించి చూద్దాం. 


ఖమ్మం: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోరు సాగనున్నది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌ రావు ఒకసారి టీడీపీ తరఫున ఒకసారి బీఆర్‌ఎస్‌ తరఫున ఇదే నియోజకవర్గంలో గెలిచారు. ఆయనకు నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పరిచయాలు ఆయన బలం. కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలువడం కలిసి వచ్చే అంశం. అలాగే అభ్యర్థి రాఘురాంరెడ్డి మంత్రి పొంగులేటికి వియ్యంకుడు కావడం, డిప్యూటీ సీఎం భట్టి, మరో మంత్రి తుమ్మల ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. 


భువనగిరి: కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనున్నది. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి కోమటిరెడ్డి బద్రర్స్‌ అండదండలున్నాయి. ప్రచార బాధ్యతలను రాజగోపాల్‌రెడ్డి తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ ఈ నియోజకవర్గ ఎంపీగా పనిచేయడం, ఆయన అనుభవం, పరిచయాలు ఆయనకు సానుకూల అంశాలు. 


పాలమూరు: ఇక్కడ మూడు పార్టీలు పోటీ చేస్తున్నా.. బీజేపీ, కాంగ్రెస్‌లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌వే. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ ఈ పార్లమెంట్‌ పరిధిలోనే ఉన్నది. దీనిపై ఆయన ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేస్తున్నారు. బీజేపీకి మొదటి నుంచి బలం ఉన్న నియోజకవర్గం ఇది. అరుణకు జిల్లా వ్యాప్తంగా అనుచరవర్గం, మోడీ ఛరిష్మా ఆమెకు కలిసి వచ్చే అంశం.


Thursday, 9 May 2024

నెలరోజుల్లో రేవంత్‌ సర్కార్‌ కూలిపోతుంది: అర్వింద్‌


నెలరోజుల్లో రేవంత్‌ సర్కార్‌ కూలిపోతుంది: అర్వింద్‌

https://youtube.com/shorts/O3ZhYqIVPK8

విద్వేషాలు వ్యాపింపజేయడమే బీజేపీ లక్ష్యం

https://youtube.com/shorts/dDZclZf8GuE

జనాభాలో హిందువుల వాటా తగ్గుదల: ఈఏసీ-పీఎం

https://youtube.com/shorts/OPCTy-Odalg

మోడీజీ.. మా మ్యానిఫెస్టో చదివి మాట్లాడండి: ప్రియాంక

https://youtube.com/shorts/kYavkweSWhs

మోడీ నాలుగైదురోజుల్లో కొత్త డ్రామా మొదలుపెడుతారు: రాహుల్‌

https://youtube.com/shorts/35LvTz-Jquc

అమేథీ గాంధీ కుటుంబ విలువైన ఆస్తి: కిశోరీలాల్‌ శర్మ

https://youtube.com/shorts/S_KA9aVRLAw

అమేథీ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రియాంక గుమాస్తా:దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌

https://youtube.com/shorts/aVm1GN0HMqI

ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు కష్టకాలం

https://youtube.com/shorts/o18tIss-aRI


Featured post

రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టమే

  https://youtube.com/shorts/_r2lWAb0R_Q?si=1h68-jBEvAojO7Fy https://youtube.com/shorts/-38ElK6EMfE?si=m3zaCUqPHRkUWm_h https://youtube....