భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని నిరసనలపై, ముఖ్యంగా 1974 తర్వాత జరిగిన వాటిపై అధ్యయనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (BPR&D)ను కోరినట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక వెల్లడించింది. భవిష్యత్తులో "కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం జరిగే పెద్ద ఎత్తున ఆందోళనలను" నివారించేందుకు ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని(standard operating procedure - SOP) రూపొందించే దిశగా, ఆ నిరసనల "ఆర్థిక కోణాలు", వాటి తుది ఫలితాలు " తెర వెనుక ఉన్న వ్యక్తులను" పరిశీలించాలని ఆయన బ్యూరోను కోరారు. ఆ పత్రిక కథనం ప్రకారం, జులైలో ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించిన రెండు రోజుల 'జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు-2025'లో షా మాట్లాడినప్పుడు ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
"తెర వెనుక ఉన్న వ్యక్తులతో సహా ఆ నిరసనల కారణాలు, విధానాలు ఫలితాలను విశ్లేషించాలని BPR&Dని ప్రత్యేకంగా కోరారు" అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రాసింది. "ఈ అధ్యయనం ఆధారంగా భవిష్యత్తులో స్వార్థ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున జరిగే ఆందోళనలను నివారించడానికి ఒక SOPని రూపొందించాలని ఆదేశించబడింది" అని ఆ పత్రిక పేర్కొన్నది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే BPR&D, ఈ విషయంపై పరిశోధన చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. ఈ బృందం "పాత కేసు ఫైళ్ళ కోసం రాష్ట్ర పోలీసు విభాగాలతో, వాటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌ల నివేదికలతో సహా సమన్వయం చేసుకుంటుంది".
No comments:
Post a Comment