బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ అక్కడ సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. బీజేపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఆయన అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు ఆ పార్టీ నేతలు అసెంబ్లీ, బయట కౌంటర్ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చారు. వారికి వాదనకు మద్దతుగానే ఈటల రాజేందర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కేంద్ర గణాంకాల ప్రకారం 2024-25 నాటికీ తెలంగాణ అప్పు రూ. 4.63.583 కోట్లు అని చెప్పారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్న 7 లక్షల, 8 లక్షల కోట్ల అప్పు ఆరోపణలకు చెక్ పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం, ఆయన వాదనకు బలం చేకూరుస్తున్నది. దీంతో నేడు కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈటలను తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితేబీజేపీ పై ఉన్న ఫ్రస్టేషన్ సీఎం రేవంత్ రెడ్డిపై చూపించడం కరెక్ట్ కాదన్నారు.బీఆర్ఎస్ తో పంచాయితీ పెట్టుకున్న ఈటల బీజేపీకి వెళ్లి అక్కడ ఇమడలేకపోతున్నారుపార్టీ అధ్యక్ష పదవి వస్తుందని, సీఎం అయిపోవచ్చనే పిచ్చి ఆలోచనతో ఈటల ఉన్నారు. కానీ బీజేపీలోని సీనియర్ నేతలు ఈటలను లాస్ట్ బెంచ్ కు పరిమితం చేశారు.దీంతో బీజేపీలో తన పరిస్థితి అర్థం కాక పార్టీ హైకమాండ్ వద్ద మంచి మార్కులు కోసం సీఎం రేవంత్ రెడ్డిని ఈటల విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు సీఎంపై ఈటల వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఇంటిపై దాడికి ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు ఈటల కులం ఏమిటో చెప్పాలనడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్ కులానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆనాడు మేము సమైక్యరాష్ట్రంలో సీమాంధ్ర నాయకులతో కొట్లాడినం. దీనిపై కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మీ లెక్క పదవుల కోసం పెదవులు మూసుకోలేదని విమర్శించారు. మీలా మోకరిల్లిన వాళ్లం కాదన్నారు. మేము తెలంగాణ నికార్సైన బిడ్డగా కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఆ దుఃఖం, ఆవేదన ఉంటుందన్నారు. సీఎం నీకు దమ్ముంటే 20- 30 ఏండ్ల కిందట చెరువుల పక్కన కట్టుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లకు ఎల్‌ఆర్‌ఎస్ , బీ ఆర్‌ఎస్ ఉన్నదన్నారు. కొట్లాడితే దీరుడితో కొట్లడతాం కానీ.. రండలతో ఏం కొట్లాడతాం అన్నారు. మొత్తానికి ఈటల వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక పుట్టించాయి.
Monday, 12 May 2025
కాంగ్రెస్ లో కాక పుట్టించిన ఈటల వ్యాఖ్యలు

Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment