Thursday, 15 May 2025

కొత్త పార్టీ పెట్టాలనే కవిత ఆలోచనను స్వాగతిస్తున్నాం


కొత్త పార్టీ పెట్టాలనే కవిత ఆలోచనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ మీడియా సెల్‌ ఛైర్మన్‌ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. సొంత పార్టీ, కన్న తండ్రి, తోడబుట్టిన వాళ్లు, కుటుంబం మీద కవిత అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. తనను జైల్లో పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని గతంలోనే కవిత అన్న విషయాన్ని గుర్తుచేశారు. తనను జైలులో పెట్టించిన బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడం జీర్ణించుకోలేక బాహాటంగానే కవిత తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సామ విమర్శించారు.


No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...