Tuesday, 14 October 2025

దిగుమతులు 10% తగ్గాయి.. భారత్‌కు చమురు సరఫరా.. రష్యానే టాప్‌

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా.. భారత రిఫైనరీలకు రష్యా చమురు సరఫరాను కొనసాగిస్తోంది. ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు కొనుగోళ్లు చేపడుతున్నప్పటికీ.. రష్యా నుంచే అధికంగా ముడి చమురు సరఫరా అవుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య అనలిటిక్స్ సంస్థ కెప్లెర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సెప్టెంబర్‌లో 34శాతం ముడి చమురును మాస్కోనే భారత్‌కు సరఫరా చేసింది. గత నెలలో మాస్కో నుంచి భారత్ సగటున రోజుకు 45 లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. అయితే అంతకుముందు నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లలో 10శాతం వాటా తగ్గినట్లు నివేదికలు తెలిపాయి.ఆగస్టుతో పోలిస్తే ఇది 70,000 బ్యారెళ్లు అధికం. అయితే గతేడాది సెప్టెంబరుతో చూస్తే పెద్దగా మార్పు లేదు. ఇందులో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లతో (34 శాతం వాటా) భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో రష్యా నుంచి సగటు దిగుమతులతో చూస్తే మాత్రం, సెప్టెంబరులో రోజుకు 1,80,000 బ్యారెళ్లు తక్కువగా నమోదయ్యాయని కెప్లెర్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ దిగుమతుల తగ్గుదలకు మార్కెట్ డైనమిక్స్ కారణమని.. అమెరికా బెదిరింపులకు దీనికి ఎటువంటి సంబంధం లేదని కెప్లెర్ గణాంకాలు స్పష్టం చేశాయి.రష్యా.. భారత్‌కు అతిపెద్ద చమురు మూలం!గత కొన్నేళ్లుగా రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. ఇటీవల ట్రంప్ బెదిరింపులకు పాల్పడినప్పటికీ.. జులైలో 3.6 బిలియన్ డాలర్లు (రూ.31,775 కోట్లు) మేర విలువైన చమురు మనకు విక్రయించింది. మన మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 34 శాతం ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ ఉన్నాయి.


No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...