బిహార్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ మానిఫెస్టోను విడుదల చేసింది. ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రాణ్’ పేరుతో ఈ మానిఫెస్టోను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తదితరుల సమక్షంలో విడుదల చేశారు.కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సహా మహాగఠ్‌బంధన్ కూటమిలోని ప్రముఖ నేతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీఐపీ నుంచి ముకేశ్ సాహ్ని, కాంగ్రెస్ నుంచి మదన్‌మోహన్ ఝా, ఆర్‌ఎల్‌ఎస్‌పీ నుంచి ఉపేంద్ర కుశ్వాహా, సీపీఐ(ఎంఎల్) నుంచి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ నుంచి రామ్‌నరేష్ పాండే మొదలైనవారు ఉన్నారు. వరాల జల్లు
మహాగఠ్‌బంధన్ కూటమి తమ మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది. బిహార్‌లోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగాలు, భూమి లేని కుటుంబాలకు 5 డెసిమల్ భూమి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కీలక వాగ్దానాలు ఇచ్చారు.తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర హామీలు ఇందులో పేర్కొన్నారు. బిహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ వెల్లడించారు.

అంతకుముందు పార్సా, సారణ్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్వీ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం స్వేచ్ఛగా లభిస్తోందని, ఇంటికే నేరుగా మద్యం సరఫరా అవుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే నిషేధం నుంచి కల్లుకు మినహాయింపు ఇస్తామన్నారు. విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి, సాగునీటిని అందించే ప్రభుత్వాన్ని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారని.. గత ఇరవై ఏళ్లలో ఎన్డీయే కూటమి వీటిని చేపట్టలేకపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వీటిని పూర్తి చేసి చూపిస్తామన్నారు.
నిత్యం దోపిడీలు..
‘‘సారణ్‌లో హత్యలు, దోపిడీ, అపహరణలు నిత్యకృత్యమయ్యాయి. అయినప్పటికీ సీఎం నీతీశ్ కుమార్ పట్టించుకోవడం లేదు. ఒక్కసారి కూడా బాధితులను పరామర్శించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ఉద్యోగాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం’’ అని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.
బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు అవుతోంది. మద్యం తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధాన్ని ఎత్తివేస్తామని ఇదివరకే ప్రకటించింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నవంబర్ 6 తొలిదశ, నవంబర్ 11న రెండోదశలో పోలింగ్ జరగనుంది.

No comments:
Post a Comment