జనవాక్కు: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులతో పాటు వారికి సహకరించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదో నిందితుడు సఫీక్‌ను అతని సోదరి రోజినా సమాచారంతో అందాల్ వంతెన వద్ద పట్టుకున్నారు. తన సోదరుడు చేసిన నేరానికి శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతో సమాచారం ఇచ్చినట్లు రోజినా తెలిపింది.బాధితురాలు తన భయానక అనుభవాన్ని వివరిస్తూ, శుక్రవారం రాత్రి స్నేహితుడితో బయటకు వెళ్లగా, దుండగులు వెంబడించారని, అడవిలోకి పరిగెత్తినప్పుడు తన స్నేహితుడు వేరే దారిలో వెళ్లగా, నిందితులు తనను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారని చెప్పింది. నిందితులు ఫోన్ లాక్కొని, స్నేహితుడిని పిలవమని బెదిరించారని, అతడు రాకపోవడంతో దారుణానికి పాల్పడ్డారని వెల్లడించింది. పోలీసులు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అయోధ్య నుంచి పోటీ చేయండి
యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్ యాదవ్ సవాల్ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఉత్తరప్రదే...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...

No comments:
Post a Comment