Tuesday, 14 October 2025

హరియాణాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య!

 





జనవాక్కు: హరియాణాలో ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరో పోలీసు అధికారి సందీప్ కుమార్, రోహ్‌తక్ సైబర్ సెల్‌లో విధులు నిర్వహిస్తూ, తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సందీప్ తన సూసైడ్ నోట్‌లో పూరన్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ, నిజాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశంతో తన జీవితాన్ని త్యాగం చేసినట్లు పేర్కొన్నాడు. పూరన్ కుమార్ ఇటీవల చండీగఢ్‌లోని తన నివాసంలో రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్ష, వేధింపులు, అవమానాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సూసైడ్ నోట్‌లో ఎనిమిది మంది అధికారుల పేర్లను పేర్కొన్నాడు. ఈ కేసు సంబంధంగా వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపగా, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను బదిలీ చేసింది.


No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...