ముంబయి: మావోయిస్టు పార్టీ అగ్రనేత, దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ (అలియాస్ అభయ్) ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు! 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మంగళవారం మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం గడ్చిరోలి పోలీసులు ఆయనను మీడియా ముందుకు తీసుకువచ్చి ప్రదర్శిస్తారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా పాల్గొంటారు. మల్లోజుల పోలీసుల వద్ద ఉన్న దృశ్యాలు ఇప్పటికే బయటకు వచ్చాయి.
పార్టీపై బహిరంగ విమర్శలు.. అత్యున్నత కమిటీ నుంచి వైదొలి!కొన్ని రోజులుగా మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదని మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు కదా! ఈ క్రమంలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ (పొలిట్‌బ్యూరో) నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.
అభయ్ జీవిత చరిత్ర!మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ! పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువు పూర్తయిన తర్వాత తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలో ప్రవేశించారు. పార్టీలో ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు.

No comments:
Post a Comment