హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖతో AICC రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని కొండా సురేఖకు ఆమె సూచించారు. కూర్చొని మాట్లాడదామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం.మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఆ బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వ దృష్టికి రావడంతో గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లో కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారన్న సమాచారంతో మఫ్తీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి కుమార్తె సుస్మిత వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తమపై బురదజల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని ఆరోపించారు. తన తల్లిదండ్రులనే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖతో మీనాక్షి నటరాజన్ మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో సమసిపోయేట్లు చూద్దామని ఆమె చెప్పినట్లు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి
కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి ఉక్రెయిన్ రాజధానిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం కీవ్: రష్యా-ఉ...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
No comments:
Post a Comment