జనవాక్కు: తమిళనాడు మద్యం కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర పోలీసుల హక్కులను ఈడీ లాగేసుకుంటోందా? సమాఖ్య వ్యవస్థ స్థితి ఏమిటి? అని ప్రశ్నించింది. “రాష్ట్ర పోలీసుల హక్కులను ఉల్లంఘిస్తున్నారా? అనుమానం వచ్చినప్పుడల్లా మీరు సొంతంగా దర్యాప్తు చేస్తారా? సమాఖ్య వ్యవస్థ ఏమైంది? ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదా? గత ఆరేళ్లలో ఈడీకి సంబంధించి ఎన్నో కేసులు చూశాను” అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని ‘టాస్మాక్’ మద్యం రిటైలర్‌లో అవకతవకలపై రాష్ట్ర పోలీసులు, అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, మార్చిలో టాస్మాక్ కార్యాలయంలో, మేలో అధికారుల ఇళ్లలో సోదాలు చేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, ఈడీ సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తోందని ధర్మాసనం ఆక్షేపించింది. మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధించిన కోర్టు, తాజాగా విచారణను పునఃప్రారంభించింది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు
🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment