Tuesday, 14 October 2025

బిహార్ ఎన్నికలు: 71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా



జనవాక్కు: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. మొత్తం 71 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరీ తారాపూర్ నుంచి, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలో దిగనున్నారు. మంత్రులు నితిన్ నబీన్ బాంకీపూర్, రేణు దేవీ బేతియా, మంగల్ పాండే సీవాన్ నుంచి పోటీ చేస్తారు.  ఈ ఎన్నికల్లో  బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేయనుంది. ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇటీవల ఖరారైంది. కొన్ని నియోజకవర్గాలను అటూ ఇటూ మార్చుకోవడంపై చర్చలు తుది దశకు చేరాయని సామ్రాట్ చౌధరీ తెలిపారు. బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...