Tuesday, 14 October 2025

ఓకే గూగుల్‌.. సీఎం చంద్రబాబు ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్

 



అమరావతి: “ఓకే గూగుల్... సింక్రనైజ్ ఫర్ వికసిత్ భారత్” అంటూ సీఎం చంద్రబాబు నాయుడు  సోషల్‌ మీడియా 'ఎక్స్‌'లో ఆకర్షణీయ పోస్ట్ చేశారు. గూగుల్ అసిస్టెంట్‌ను సక్రియం చేసే వాయిస్ ట్రిగ్గర్ “ఓకే గూగుల్”ను ఉపయోగించి చంద్రబాబు చేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘గూగుల్ కమ్స్ టు ఏపీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్ట్‌లో ఆయన పలువురు ప్రముఖులను ట్యాగ్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ బజ్వా పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...