Tuesday, 14 October 2025

పహల్గాం తరహా దాడి జరిగే అవకాశం: లెఫ్టినెంట్ జనరల్ కటియార్



జనవాక్కు: పాకిస్థాన్ పహల్గాం తరహాలో మరో దాడికి యత్నించవచ్చని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలకు భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని జమ్మూ కశ్మీర్‌లో మాట్లాడుతూ తెలిపారు.  “ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చాం. అయినా, ఆ దేశం తన వైఖరి మార్చుకోదు. పహల్గాం లాంటి దాడికి మళ్లీ ప్రయత్నించవచ్చు. అందుకే వారి ప్రతి కదలికనూ గమనిస్తున్నాం. ఈసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, మా సమాధానం సామాన్యమై ఉండదు” అని కటియార్ స్పష్టం చేశారు.  ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులను సమీపంలో కాల్చి చంపారు. ఈ ఘటనలో ఒక కశ్మీరీతో సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...