జనవాక్కు: సెలక్టర్ల నియామకంలో, ముఖ్యంగా దేశవాళీ స్థాయిలో సమూల మార్పులు చేయాల్సిన అవసరముందని భారత బ్యాటర్ అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. ఇటీవలే రిటైర్ అయిన ఫస్ట్ క్లాస్ ఆటగాళ్లకు మాత్రమే జట్లను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించాలన్నాడు. ఆట తీరులో వస్తున్న మార్పులకు అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకునే అవకాశముందన్నాడు. ప్రస్తుతం కనీసం 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండి, రిటైర్ అయి ఐదు సంవత్సరాలు దాటిన ఏ క్రికెటర్ అయినా స్టేట్ సెలక్టర్‌గా దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది.రహానె సంచలన ప్రకటన!‘ఆటగాళ్లు సెలక్టర్లకు భయపడకూడదు. నేను వారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో సెలక్షన్ కమిటీ నియామకంలో మార్పులు జరగాలి. ఇటీవల అత్యుత్తమ స్థాయిలో క్రికెట్ ఆడి రిటైర్ అయిన వారిని సెలక్టర్లుగా నియమించాలి. అంతేకాని ఎప్పుడో రిటైర్ అయిన వారిని ఎంపిక చేయొద్దు. ఎందుకంటే క్రికెట్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. దానికి అనుగుణంగా సెలక్టర్ల మైండ్‌సెట్ మారాల్సిన అవసరముంది. 20-30 సంవత్సరాల క్రితం క్రికెట్ ఎలా ఆడారో అన్నదాని ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు వద్దు. టీ20, ఐపీఎల్ వంటి ఫార్మాట్లతో ఆధునిక ఆటగాళ్ల శైలిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధ్యమైనంతవరకు సెలక్షన్ కమిటీలో అన్ని రాష్ట్రాల వారికి ప్రాతినిధ్యం దక్కేలా చూడాలి. తద్వారా ఆటగాళ్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడతారు’ అని ఛెతేశ్వర్ పుజారాతో జరిగిన యూట్యూబ్ ఇంటరాక్షన్‌లో రహానె అన్నాడు.రహానె చాలాకాలంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. అతను చివరగా 2023 జులైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే రహానె మళ్లీ పునరాగమనం చేయడం కష్టమనే చెప్పొచ్చు. ఎంతోమంది యువ ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో చోటు కోసం పోటీపడుతున్నారు. పైగా ప్రస్తుతం అతడి వయసు 37. దీంతో అతడి కెరీర్ దాదాపు ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, భారత్ తరఫున 103 టెస్టులు ఆడిన ఛెతేశ్వర్ ఈ ఏడాది ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment