హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు బీసీల హక్కని, ఇవి దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కావని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సమానత్వం ఆధారంగా నూతన సమాజ నిర్మాణానికి రిజర్వేషన్లు ఉద్దేశించినవని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, రిజర్వేషన్ల సాధన కోసం ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు నేతృత్వంలో ఒక సబ్-కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తుందన్నారు. “కొన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. కేసులు వేసిన వ్యక్తులకు మద్దతు ఇస్తూనే, బీసీలకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తున్నాయి. తెజస్‌కు ఇలాంటి రెండు నాలుకల వైఖరి లేదు. 42% బీసీ రిజర్వేషన్లకు మేం పూర్తి మద్దతు ఇస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదించేలా చేయడమే మా పోరాట లక్ష్యం” అని కోదండరాం వెల్లడించారు. తెజస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తామని, సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. అక్టోబర్ 16న గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా తెజస్ బీసీ రిజర్వేషన్లపై పలు తీర్మానాలు చేసింది. అక్టోబర్ 18న బీసీ సంఘాలు నిర్వహించే బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడం న్యాయం కాదని ఎంపీ, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి కన్వీనర్ ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్టే ఇవ్వడం ద్వారా బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నారని, బీసీల వాదన వినకుండా కోర్టు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
Tuesday, 14 October 2025
రిజర్వేషన్లు బీసీల హక్కు, దయాదాక్షిణ్యం కాదు: కోదండరాం

Subscribe to:
Post Comments (Atom)
Featured post
ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!
లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...

No comments:
Post a Comment