జనవాక్కు: తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణ కోసం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో నోడల్ అధికారులను నియమించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘గురియా స్వయం సేవి సంస్థాన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా, జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. నోడల్ అధికారుల వివరాలను ఆన్‌లైన్‌తో సహా అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఈ వివరాలతో ఒక ఆన్‌లైన్ పోర్టల్ రూపొందించాలని కోర్టు సూచించింది. ఈ పోర్టల్‌లో అదృశ్యమైన పిల్లలపై ఫిర్యాదులు అందిన వెంటనే నోడల్ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. ఫిర్యాదుల ఆధారంగా కిడ్నాపర్‌లపై కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు
🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment