Sunday, 19 October 2025

బిహార్‌లో 'ఇండియా' కూటమిలో గందరగోళం

  •  నామినేషన్ గడువు దగ్గర పడుతున్నా తెగని సీట్ల పంచాయితీ

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో, చివరి విడత నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులే గడువు ఉన్నది. ఇప్పటికీ ఇండియా కూటమిలో నెలకొన్న గందరగోళం శనివారం కూడా కొనసాగింది. కొత్త మిత్రపక్షాలను 'సర్దుబాటు చేయాల్సిన' అవసరం కారణంగా సీట్ల పంపకం ప్రకటనలో ఆలస్యం అవుతోందని ఈ కూటమి ఇటీవల వరకు సమర్థించుకుంది. అయితే, ఈ కూటమిపై విశ్వాసం కోల్పోయిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బిహార్‌లో ఆరు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుని కూటమి నుంచి వైదొలిగింది.


రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో సింహభాగంలో పోటీ చేయాలని భావిస్తున్నది. మిత్రపక్షాల అభ్యర్థులకు వ్యతిరేకంగా కొన్ని స్థానాల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తున్నది. అయినప్పటికీ, తమ అభ్యర్థుల మొత్తం జాబితాను మాత్రం ప్రకటించలేకపోయింది.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల 48 మంది అభ్యర్థులతో 'తొలి జాబితా'ను ప్రకటించింది. ఆ తర్వాత శుక్రవారం ఒకే ఒక్క అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా కిషన్‌గంజ్‌తో సహా మరో ఐదుగురు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కిషన్‌గంజ్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇజారుల్ హుస్సేన్‌ను కాదని, పార్టీ మారిన మరో వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

No comments:

Post a Comment

Featured post

ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు

  🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...